Others

సిరాచుక్క ఇక్కడినుంచే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోని ప్రతి ఓటరు వేలిపై మన సిరాచుక్క.. అంటే హైదరాబాద్ సిరాచుక్కే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. సిరాచుక్క మనం ఓటు వేశాం అని చెప్పడానికి మాత్రమే గుర్తు కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా సిరాచుక్కే.. అందుకే భారతదేశంతో పాటు చాలాదేశాలు ఎన్నికల ఓటు వేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. ఎన్నికల వేళ కీలకంగా మారే ఈ సిరా హైదరాబాద్‌లోనే తయారవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాల ఎన్నికల్లో కూడా ఈ సిరానే వాడుతుంటారట.
భారతదేశంలో ఈ సిరాను ప్రధానంగా రెండు సంస్థలు మాత్రమే ఎన్నికల సిరాను తయారుచేస్తుంటాయట. కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్షిష్ లిమిటెడ్ (ఎంపీవీఎల్) ఒకటైతే, హైదరాబాద్‌లోని రాయుడు లాబొరేటరీస్ మరొకటి. భారత ఎన్నికల సంఘం మైసూర్ పెయింట్స్ అండ్ వార్షిష్ లిమిటెడ్ సిరాను ఎక్కువగా వినియోగిస్తుండగా, ప్రపంచంలోని చాలా దేశాలు రాయుడు లాబొరేటరీస్ తయారుచేస్తోన్న సిరాను వాడుతున్నాయి. ఎన్నికల కోసం ప్రపంచంలోని దాదాపు 100 దేశాలకు చెరగని సిరా (ఇండెలబుల్ ఇంక్) ఇక్కడి నుండే సరఫరా చేస్తున్నారట. ఇండియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, బెనిన్, నైజీరియా, ఒమన్, మాల్దీవులు, రువాండా, జాంబియా, ఇథియోపియా.. వంటి చాలా దేశాలు ఇక్కడి నుంచే సిరాను తెప్పించుకుంటాయట.. అలాగే భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో జరిగే మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో కూడా ఈ సిరానే ఉపయోగిస్తుంటారట. దాదాపు 37 సంవత్సరాలుగా రాయుడు లాబ్స్ ఈ సిరాను తయారుచేస్తున్నారట. మొదట సిరా చిన్న చిన్న బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవాళ్లట. 2004 తర్వాత ఇంక్ మార్కర్లను మొదటిసారిగా తీసుకొచ్చింది ఈ కంపెనీ.. ఎన్నికల్లో వాడే సిరాను ‘సెమీ పర్మినెంట్ ఇంక్’గా చెప్పవచ్చు. అంటే కొద్దిరోజుల పాటు చెరిగిపోకుండా ఉండి.. తరువాత నెమ్మది, నెమ్మదిగా చెరిగిపోతుంది. ఈ సిరాలో కొన్ని రకాల రసాయలనాలతో పాటు పది నుండి పద్దెనిమిది శాతం వరకు సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది వెలుతురు పడగానే గట్టిగా మారుతుంది. వేలుపై ఈ సిరా చుక్కను పెట్టిన తర్వాత 72 నుంచి 96 గంటల పాటు చెదిరిపోకుండా ఉంటుంది. అందుకే దొంగ ఓట్లను నివారించేందుకు ఈ సిరా చాలా ఉపయోగపడుతుంది. అందుకే చాలా దేశాలు ఈ సిరానే వాడుతుంటాయి.
‘నీ వేలిపై సిరాచుక్క, దేశప్రగతికి వేగుచుక్క’ అన్నాడో కవి. దేశ ఎన్నికల్లో సామాన్యుడి ఓటు ఎంత ముఖ్యమో చెప్పడమే ఈ కవి ఉద్దేశ్యం. అయితే ఓటు మాత్రమే కాదు, నేడు సిరాచుక్కది కూడా కీలకపాత్రే.. మీరు విన్నది కరెక్టే సిరాచుక్కే.. సారా చుక్క కాదు.. నేడు సారా చుక్క కూడా ఎన్నికల్లో కీలకపాత్ర వహిస్తోందిలే కానీ.. అది కథనానికి రెండో వైపు మాత్రమే.. భారతదేశ ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది. ఒకవేళ ఓటరుకు ఎడమ చేయి చూపుడు వేలుకు ఏదైనా దెబ్బ తగిలినా, అసలు వేలే లేకపోయినా ఇతర ఏ వేలుకైనా సిరా చుక్క పెట్టవచ్చు.
ఎన్నికల్లోనే కాకుండా పల్స్‌పోలియో కార్యక్రమంలో కూడా ఈ సిరాను వాడుతుంటారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు గుర్తించేందుకు గుర్తుగా వారి వేలుపై సిరా చుక్కను పెడతారు. ఇందుకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంస్థతో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుందట. ప్రపంచంలోని ఏ దేశంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగినా ఇక్కడ తయారయ్యే సిరానే ఉపయోగిస్తారని ఆ సంస్థ సిఈఓ శశాంక్ తెలిపారు. దాదాపు 100 దేశాలు ఎన్నికల వేళ మా సిరాను వాడుతుండటం మాకు గర్వంగా ఉందని కూడా ఆయన తెలిపారు. *