Others

హనుమంతుడి భక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సత్యం’ ఒక్కటే కాలానికి చిక్కక, లొంగక, కాలగర్భంలో కలయక, దివ్యప్రభలతో తేజరిల్లుతూనే ఉంటుంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు మన ‘రామాయణ, భారత, భాగవత’ గ్రంథాలు. ఇవి కేవలం కథలు అయితే ఏనాడో వాటికి కాలదోషం పట్టేది. అలాకాక అవి ఇప్పటికీ కాలంతో సమానంగా పరుగులు తీస్తూ.. జాతిని జాగృతం చేస్తున్నాయంటే.. వాటిలోని ప్రతి పాత్రా సత్యబలంతో జీవం పోసుకున్నవే.. ధర్మసంకల్పంతో రూపు దాల్చినవే.. ‘శ్రీరామ’ అనగానే వెంటనే మన కళ్ళముందు కదిలే పాత్ర ‘హనుమంతుడు’. అసలు హనుమ లేని రామకథను ఊహించగలమా? ఆస్వాదించగలమా? ఏడుకాండల గ్రంథమైన రామాయణంలో.. ఎప్పుడో నాలుగో కాండ అయిన ‘కిష్కింధకాండ’లో ప్రవేశించిన ‘హనుమంతుని పాత్ర’ నేటికీ ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉంది. పలకరిస్తూనే ఉంది. ఎందుకంటే..
రామాయణంలో హనుమంతుని పాత్ర కిష్కింధకాండలో పరిచయం అవుతుంది. తొలిపరిచయంతోనే ఆ పాత్ర స్వరూప స్వభావాలు, పటిష్టతను పరిచయం చేస్తాడు ఆదికవి వాల్మీకి. రావణాపహృత అయిన సీతాదేవిని అనే్వషిస్తూ రామలక్ష్మణులు ఋష్యమాకం చేరుకుంటారు. దూరం నుంచి వారిని చూస్తూనే ప్రాణభయం పరుగులు తీస్తాడు సుగ్రీవుడు. చెంతనున్న హనుమంతుడు.. సుగ్రీవునికి ధైర్యం చెప్పి.. యతిరూపం ధరించి రామలక్ష్మణుల దగ్గరకు వస్తాడు. ‘అదూయ క్షత్రియవంవ సంజాతుల్లా కనిపిస్తున్న మీరు.. అందుకు విరుద్ధంగా నారచీరలు, జటాజూతాలు ధరించడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పోనీ మహర్షులు అనుకుందామంటే.. మీ చేతిలోని ధనుర్బాణ, కరవాలాలు చూస్తుంటే మీరు ఋషులు కాదనిపిస్తోంది. తమరెవరు? ఏ కార్యార్థమై ఇలా వచ్చారు? అయినా నా గురించి చెప్పలేదు కదూ.. నా పేరు హనుమంతుడు. వానరసేనలో అతిబలవంతుడైన వాలి, తన తమ్ముడైన సుగ్రీవుని సందేహించి, అతని భార్యను అపహరించి, రాజ్యం నుంచి తరిమికొట్టాడు. నేను ఆ సుగ్రీవుని మంత్రిని’ అని తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఆ మాటలు విన్న రాముడు పరమానంద భరితుడై లక్ష్మణుడితో ‘లక్ష్మణా.. చతుర్వేదాలు, సమస్త శాస్త్రాలు, నవ వ్యాకరణాలు అధ్యయనం చేసినవాడు మాత్రమే ఇంత మృదుమధురంగా మాట్లాడగలడు. చెప్పవలసిన విషయంలో సందిగ్ధం లేదు. సాగతీతలు లేవు. గొంతు చించుకోవడం, కనుబొమలు ఎగరవేయడం, తలతిప్పడం వంటి అవలక్షణాలు లేకుండా, తను చెప్పాల్సింది మృదుమధురంగా మధ్యమ స్వరంలో చెప్పాడు. ఇంతటి వాక్చాతుర్యం గల ఈ ధీమంతునితో చాలా జాగ్రత్తగా సంభాషించు’ అని లక్ష్మణుడిని హెచ్చరిస్తాడు రాముడు. ఈ ఒక్కచోట తప్ప రాముడు లక్ష్మణుడిని హెచ్చరించిన సందర్భం రామాయణంలో మరెక్కడా కనబడదు. మానవులు ఎలా మాట్లాడాలో మనకు ఈ సన్నివేశంలో నేర్పుతాడు హనుమంతుడు.
ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్ర ప్రయోగానికి లక్ష్మణుడితో పాటు సర్వ వానరులూ మూర్ఛపోతే, సంజీవినీ పర్వతాన్ని తెచ్చి అందరికీ ప్రాణదానం చేసిన హనుమ సామాన్యుడా? అసలు హనుమ లేని రామకథను మనం ఊహించగలమా? ఆస్వాదించగలమా? ఆనందించగలమా? హనుమ లేనిదే రాముడు లేడు.. అంటారు. ఎందుకంటే..
రాముడు విష్ణాంశ సంభూతుడు..
హనుమ ఈశ్వరాంశ సంభూతుడు..
శివాయా విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్యం హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
అందుకే రామనామం ఎక్కడుంటే హనుమ అక్కడుంటాడు.
శివుడు: అభిషేక ప్రియుడైన భోళాశంకరుడు
హనుమ: రామనామాభిషేక ప్రియుడైన భోళావానరుడు
సామాన్యులమైన మనం.. ఆ మహావీరునికి ఏమివ్వగలం? ఒక్క రామనామాన్ని తప్ప..
యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్
తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్