Others

ఆచరిస్తేనే ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీన భారతీయ శాస్త్రాలలో సమస జగత్తును ఆధారమైన వానిని ఈశ్వరుడనియే అందురు. ఈశ్వరుడు అంటే శివుడనో విష్ణువనో కాదు.
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యెవ్వని యందుడిందు బరమేశ్వరుడెవ్వడు
మూల కారణం
బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వ ము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణం వేడెదన్
అని గజేంద్రమోక్షమనే భాగవత ఘట్టంలోని గజము చెప్పినట్లుగా ఈశ్వరుడంటే సమస్తమునకు ఈశ్వరుడు. మనం ఉండే ఈ జగత్తుకు ఆది అంతములు తెలుసుకోవడం కష్టమైన పని కదా. ఇటువంటి బ్రహ్మాండాలెన్నో కల్పించిన వానికి ఈశ్వరుడు అని కాక మరొకటి పెట్టలేము కదా. ఇలా ఎందుకన్నాము అంటే శివపురాణములో బ్రహ్మ, విష్ణువులే ఈ బ్రహ్మాండం అడుగునుండి పైవరకు వ్యాపించిన జ్యోతిర్లింగము యొక్క ఆద్యంతములు కనుగొనవలెనని పందెములు కాచుకొని విఫలం చెందారనే కథ మనకు కన్పిస్తుంది.
వాక్కులతో చెప్పుటకు వీలుకాని వాడు కడకు మనస్సుతో ఊహించుటకు కూడ వీలుకాని వాడు ఈశ్వరుడు. ఆయన కన్ను తెరిస్తే సృష్టి కన్ను మూస్తే ప్రళయం అన్నింటికీ కారణాకారణుడు ఈశ్వరుడే . శివాజ్ఞలేనిదే చీమైనా కుట్టదనే సామెత కూడా దీనినే ప్రతిపాదిస్తుంది.
పూర్వకాలంలో నెలబాలునిచూసి చంద్రుని కో నూలుపోగు అంటూ అర్పించే వారిమి కదా.( ‘‘అత్రి నేత్ర సముద్భూత లక్ష్మ్యా సహ సహోదర! క్షీరోదార్ణవ సంభూత బాలచంద్ర నమస్తుతే’’ అను శ్లోకమును చదివేవాళ్లంకదా. చంద్రుడు మన మనఃకారకుడిని జ్యో తిష శాస్తమ్రులు చెప్పుచున్నవి. మాసము ఒక పర్యాయము 2 నిమిషములు సందెవేళ చంద్రప్రార్థన చేసినచో జీవితాంతము మన మనస్సు సవ్యముగా ఉంటుం ది అన్న భావం( శాఖాచంద్ర న్యాయముఅంటే ఇదే) అట్లానే ఈశ్వరుని గురించి బ్రహ్మాదిదేవతలు చెప్పలేరు. వేదాలు కూడా శాఖాచంద్ర న్యాయముతో శివుని గురించి చెప్తాయంటారు పెద్దలు అంటే మనం చంద్రునికి అర్పించిన నూలు పోగు లాగా శివుని గురించి చెప్తాయన్నమాట. పూర్తిగా శివుని గురించి తెలిసిన వారెవరూ లేరు.
ఎందుకంటే
లోకంబులులోకేశులు లోకస్థులు దెగిన తుది నలోకం బగుపెం , జీకటి కవ్వల నెవ్వం డే కాకృతి వెలుగు... (గజేంద్రమోక్షం) ఆ వెలుగు ఈశ్వరుడు కనుక ఆ వెలుగును వర్ణించడానికి మహే శ్వరుడు పుట్టించిన అక్షరాలకు శక్తి లేదు అంటే అతిశయం కాదుకదా. అటువంటి ఈశ్వరుడిని స్తోత్రపాఠాదులతో పూజించడం మన బాధ్యతగా ఎంచుకున్నను మనం ఈశ్వరుని తత్త్వాన్ని తెలుసుకొనడమే మంచిదనే పండితులున్నారు.
ఏదైనా ఒక రోగం వచ్చినపుడు దానిని పోగొట్టుకోవాలనుకొన్నపుడు దానికి తగిన మందులను వేసుకోవాలి. కానీ కేవలం మందు ఇచ్చే డాక్టరును స్తుతి చేసినందువల్ల ఆ రోగం దూరం కానట్టుగానే దేవునికి పూజచేయడం, దేవుని స్తుతి పాఠాలు చదవడం, భక్తుల గురించి తెలుసుకొనడం మంచిదే కానీ ఎప్పుడు మనం ఆ దేవుని మార్గంలో నడు స్తామో అపుడే అవి మనకు మంచి ఔషధాలౌతాయ. మార్గదర్శకంగా నిలబడు తాయ.
ఈశ్వరుడు గురించి నాకు తెలుసు అనడం కన్నా ఈశ్వరుని తత్వం తెలుసుకొని ఈ తత్త్వాన్ని దినచర్యలో భాగం చేసుకొంటే అపుడు జీవునికి ఈశ్వరునికి తేడా కనబడదు.

- ఆర్. చరణ శ్రీ