Others

తవ్వితీసినకొలదీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండవ పద్యం మొదటి పద్యానికి పూర్తి భిన్నంగా అచ్చమైన ఆత్మీయతతో ఆరంభవౌతుంది ఇలా.. రంగన్నా, కరుణింపరా తలపరా, రారా, జగన్మంగాలాపాంగ..
ప్రతి పద్య వైవిధ్య సాధనకోసం కవి చేసిన ప్రయత్నం ఇది.
శతకం ఆత్మీయతకు ప్రతిరూపంగా ఉండాలి. ‘రీతి’లోని విలక్షణత్వం ఆత్మీయ స్పర్శను ప్రగాఢతరం చేస్తుంది. శతక పాఠకుడు పద్యంలో లీనమయేందుకు ‘రీతి’ అమిత రీతిలో తోడ్పడుతుంది. మూడవ పద్యం అందుకు సూచిక. అది
‘‘స్వామీ! నీ యెదలోని దీన జన
వాత్సల్యమ్ము సర్వమ్ము నే
డేమై పోయెనొ ఒక్కసారయిన రావేమయ్య! నీవల్ల నా
డేమో సర్వచరాచర ప్రకృతి శాసింపన్ సమర్థుండవై
సామాన్యుం దములన్ ప్రవర్తిలుదునా
చాల్చాలు రంగ ప్రభూ
సమకాలీన సాహిత్యం- సాహిత్యంలోని మంచి చెడులను గురించి శతకాలలో ప్రస్తావించడం బాగా అరుదు. శతక కవి సాహిత్యాన్ని శ్వాసగా పీల్చేవాడైనపుడే ఈ తీరు సాధ్యవౌతుంది.
గర్రెపల్లి జీవిత రేఖల్ని చూసినపుడు ఆయన రమారమి మూడు దశాబ్దాలపాటు సాహిత్యానికి అంకితమైనట్టు అవగతవౌతుంది. విమర్శకులు, పండితులు అల్ప ప్రతిభ అనల్ప ప్రచార జిజ్ఞాసతో ఉండే అభాస కవులనూ మూడు పద్యాలలో సున్నితంగా విమర్శించారు. విమర్శకుల తీరు ఇట్లా ఉంటుందట.
‘‘కావ్యంబంతయు జూడకుండ నేదియో
కార్పణ్యమున్ బూనియున్
నవ్యస్వాదు రసార్ద్ర భావముల పొంతన్ బోవలేకుండ గా
అవ్యాప్తిన్ గళమెత్తి చూసెడి విమర్శాగ్రేసరుల్ గల్గు సం
భావ్యంబై మనునే మనోజ్ఞ కవితాభ్యాసంబు
రంగప్రభూ
మేధస్సులో ఎంతో ఎత్తుకు చేరిన కొందరు పండితులు హృదయాలు బాగా కుచించుకొని వీరిని గురించి సాహిత్య చరిత్రలో చదువుకొన్నాం. అటువంటివారు గతంలోనే కాదు, ఎప్పుడూ ఉంటారన్న గర్రెపల్లివారి అభిప్రాయంతో తప్పకుండా అంగీకరించవలసిందే, సహృదయత కరువైన పండితుల గురించి రాస్తూ-
ప్రావీణ్యంబు గణించకన్ కుల మత ప్రాంతీయ వైషమ్య దుర్
భావమ్ముల్ సృజియించి సుకవి వ్రాతమ్ము ద్రోయింతు రో
దేవా పండితులే కదా సకల విద్వేషాగ్నికిన్ సంపదల్..
అన్నారు.
అదేపనిగా రచనలు చేస్తూ అలసట లేకుండా అచ్చు వేసుకునే కవులు ఎల్లకాలలలోనూ ఉంటారు. ఈ కోవలో చేరే కొందరు కవులలోని అహంకార వైఖరిని గురించి గర్రెపల్లి సునిశితంగా విమర్శ వ్యాఖ్య చేశారు- పద్యంలో
కమ్మచ్చున్ పనివోలె పద్దెముల సాగందీసి నాల్గైదు వా
క్యమ్ముల్‌గా ప్రచురించి తద్రచన వ్యావృత్తి గన్నంత నే
కొమ్ముల్ మొలచును మా కవీశ్వరులకున్ గోరంత కొండంతలై
అమ్మో వారిని మందలించ వశవౌనా ఇంక రంగ ప్రభూ
ధూపాటి రమణాచార్యులవారు తెలంగాణను గురించి విస్తృత పరిశోధన చేసిన విద్యావంతులు. జీవనోపాధి కోసం ఈ ప్రాంతానికి తరలివచ్చారు. వరంగల్లులో పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేశారు. కొంతకాలంపాటు కరీంనగర్‌లోనూ బాధ్యతలు నిర్వహించారు. ఆ రోజుల్లో సినారె వంటివారు ధూపాటి శిష్యులు. గర్రెపల్లి కూడా ఆయన శిష్యుడే. ధూపాటి పేరు ఇటీవలికాలంలో తెలంగాణ పరిశోధనాక్రమంలో చాలా వినబడుతున్నది. అయితే శ్రీరంగ ప్రభు శతక రచనా కాలం నాటికి ఆయన సాహిత్య రంగం నుండి రమారమి నిష్క్రమించారు. గర్రెపల్లి గురుభక్తితో కృతజ్ఞతగా ఆనాడు ఇట్లా పద్యం చెప్పారు.
శ్రీ దూపాటి మహాన్వయాబ్ది విలసచ్చీతాంశువున్ నిర్మల
సాదుప్రేమ సుధాంబురాశి రమణాచార్యుండు సాహిత్యలో
కాదర్శంబిల మద్గురుండు కవితాభ్యాసంబునన్ సత్కళా
మొదాత్మున్ పరిశోధనా రతునెదన్ పూజింతు రంగప్రభూ
కృతజ్ఞత చూపించడం ఉత్తమ వ్యక్తిత్వానికి సంకేతం. శతక కవిగా గర్రెపల్లి తన సన్నిహితులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో ముందరితరం బంధువులున్నారు. తన తరం చుట్టాలున్నారు. అనేకమంది ఆత్మీయులున్నారు. పద్యాల ఎత్తుగడను చూసినపుడు కవికి పద్య శిల్పరహస్యం బాగా తెలుసునని అర్థవౌతుంది. ‘‘తల్లిన్ మించినదేది ఈ యవని మీదన్ శాంతి మాయమ్మ’’ అన్న వాక్యం ఇందుకు నిదర్శనం.
అంత సులువుగా అంతుపట్టని తాత్విక అంశాన్ని అత్యంత సరళ రీతిలో చెబుతున్నపుడు గర్రపల్లి ప్రజ్ఞ అబ్బురపాటును కలిగిస్తుంది. ఇందుకు మొత్తం శతకంలో విలక్షణమైన ఈ పద్యం ఉదాహరణ.
‘‘అద్వైతంబును ద్వైతభావము విశిష్టాద్వైతమేదైన నీ
చిద్వైశిష్టమే నీదు అంశమెకదా దేవుండు, భావింప యా
వద్వేదాంత నిరుక్త సారమె తలంపన్ జీవ కారుణ్య మే
విద్వవందిత నీకు నయ్యదియే నందిత్కాంతి రంగప్రభూ.
విశిష్టాద్వైతం తత్త్వంతో అవినాభావ సంబంధమున్న సత్యనారాయణ రాజు రంగప్రభూ శతకంలో దశావతార వర్ణన చేయడమే వైవిధ్య విశేషం. శతకాలలో ఇటువంటి ప్రయోగాలు బాగా అరుదు. శతకంలోని ఇతర పద్యాలకు ఈ దశావతార పద్యాలకు మధ్య నిర్మాణ తారతమ్యాల్ని సులువుగా గర్తుపట్టవచ్చు. ఇది కవిలోని పుష్టివంతమైన ఔచితీ దృష్టిని పట్టి ఇస్తున్నది.
శతక కవిత్వంలో కవిలోని నిర్లిప్త భావనలు కూడా పద్య రూపం సంతరించుకుంటాయి. బహుశః ఇది ధూర్జటి ‘కాళహస్తీశ్వర శతకం’లో ఆరంభమైన సంప్రదాయం కావచ్చు. ‘‘అన్నల్ దమ్ముల ప్రేమ బంధములు మిథ్యా భావనల్’’, ‘‘మా వారే యని నమ్మి ఎవ్వరికిని ప్రేమన్ జూచి ఆత్మీయతా భావంబు గని చేరదీసితిమొ యవ్వారే మహా శత్రువుల్’, ‘‘సంబంధం బది ఎట్టిదైన ధనమే సర్వమ్ముగానెంచు లోకము’’ వంటి పద్యాలు ఇందుకు ప్రతినిధులు.
ఆనాటి రాజకీయాలలోనూ అపసవ్య ధోరణులున్నట్లే ‘హింసా ప్రేరణ రాజకీయ మకటా’ అన్న పద్యం జీవన రంగంలో యువత హిప్పీ తదితర పోకడల వైపు పోతున్న తీరును ‘హిప్పీవేషము మత్తుమందు సినిమా హీరోలు రాణించుచున్’ పద్యంలో వర్ణించి చూపారు గర్రెపల్లి.
చిత్తశుద్ధితో కూడి కవి ఆవేదన ఈ పద్యంలో ప్రస్ఫుటమవుతున్నది.
సేవా భావము లేక త్యాగమది కించిత్తేనియున లేక భో
దావిర్భభావము దేశ భక్తి విమలాదర్శంబులున్ లేక దు
ర్భావ ప్రేరిత రాజకీయములలో పాల్గొంచు విద్రోహ న
వ్యావర్తంబుల లోన మా యువకులన్ రక్షించు
రంగ ప్రభూ!
‘మునె్న చేసిన పాపకర్మ’ వంటి పద్యాల్లోకి సున్నితమైన అంతర్లయ పద్య కవితాభిమానులకు ఆనందప్రదవౌతుంది.
నిజానికి ఈ శతకంలోని ప్రతి పద్యాన్ని అనేక కోణాలతో వ్యాఖ్యానించవచ్చు. అయితే వ్యాసపరిమితి దృష్టిలో పెట్టుకొని కొన్ని వైవిధ్యాంశాలనే విశే్లషించవలసి వచ్చింది.
సత్యనారాయణ రాజుగారు మరో పాతిక సంవత్సరాలు జీవించి వుంటే ఎన్ని స్వప్న ఫలాలు, కలస్వనాలు, మరెన్ని రంగప్రభూ శతకాలు వచ్చేవో. ఈయన కవిత్వం చదివితే సహృదయులకు తప్పకుండా ఈ అభిప్రాయం ఏర్పడుతుంది.

సంపూర్ణం

- డాక్టర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి 9866917227