Others
వీర జవాన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 February 2019
- ప్రొ. ముదిగొండ శివప్రసాద్
మంచుకొండలో తుపాకీ పట్టిన
మానవ దైవం మా సైనికుడు
మాతృభూమి సంరక్షణ కొరకై
ముక్కలు ముక్కలు అయిపోయాడు
కర్మయోగివయ్యా నీవు కాంతి కళికవయ్యా॥
ముష్కర తురుష్క దానవకాండకు
లష్కరే తోయిబాల దాడులకు
జైషే మహమద్ మారణకాండకు
బలియై నాడీ భారత పుత్రుడు
ధన్య జీవివయ్యా.. జన..మూ
ర్థన్య జీవివయ్యా॥
చరిత్ర పుటలో రక్తాక్షరమై
జాతికి దివ్య పునీత గీతమై
కోటి కోటి జనగణముల పెదవుల
మంత్రముగా గణతంత్రముగా
మిగిలిపోతివయ్యా!
యువతకు మార్గదర్శివయ్యా॥