Others
ఆమే.. సగం కాదు సాంతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 February 2019
-కొప్పోలు యాదయ్య 9494273703
ముడుచుకుపోయి మురిపెం
కోసం ఎదురుచూస్తున్న
నా హృది పుష్పాన్ని
వికసింపచేసి పరిమళించిన
పాణీగృహితి.
గమ్యం గతిని శృతి చేయని
పయనానికి అడుగులు
వేయించి పరితుష్టి
ప్రమిదలై ప్రకాశితములు
నింపిన నీరజాక్షి
నిస్తేజం నిండిన గుండెల్లో
ప్రేమ మొలకలను మొలిపించి
ఆనందాల హరివిల్లులు
పండించిన పరువాల నిధి
మమతల తడి లేని
నా మది ఎడారిలో
ఆలోచనా మాలలు అల్లె
అచంచల ఆత్మవిశ్వాసాల
నా అర్ధాంగి ఆ అరుణ తార...
చీకటి జఢత్వంలో దారి ధరి
దశ దిశ మృగ్యమైన
ఉజ్జీవములో జీవ
ధామంబై దవన
కాంతిలీనిన ధృవతార
సమ్మిళిత సమస్యల సంద్రాన్ని
చిలికి స్వేదాన్ని చిమ్మి
ఇంట ఆనందాలను ఒంపిన
అమృతధార... ఆమె!