Others

పరివర్తన తెచ్చిన పసి హృదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ శైలేష్ మెహతా గుజరాత్‌లో ప్రముఖ కార్డియాలజిస్ట్. వేలాదిమంది రోగులకు గుండె ఆపరేషన్ చేసి ప్రాణం పోశాడు. అలాంటి వైద్యుడిని ఓ ఆరేళ్ల పాప కదిలించింది. ఈ పాపకు గుండెకు సరిగా రక్తప్రసరణ కావటం లేదు. ఆపరేషన్ చేస్తే బతికేది కేవలం 30శాతం మాత్రమే. అయినప్పటికీ తల్లిదండ్రులు చిరు ఆశతో నగలు,విలువైన వస్తువులు తాకట్టుపెట్టి ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. ఆపరేషన్ థియోటర్‌లోకి ఆ పాపను తీసుకువచ్చారు. మత్తుమందు ఇచ్చారు. ఆపరేషన్ చేసేందుకు డాక్టర్ మెహతా వచ్చారు. అపుడు ఆ పాప ఇలా అంటుంది... ‘‘డాక్టర్! దేవుడు గుండెల్లో ఉంటాడని మా అమ్మ చెప్పింది. మీరు గుండెను ఓపెన్ చేస్తున్నారు కదా! ఆ దేవుడు ఎలా ఉంటాడో చెబుతురా?’’ అని అడిగింది. డాక్టర్ మెహతా పక్కా భౌతికవాది. ‘డోంట్ వర్రీ! నీకు తగ్గిపోతుంది. నేనున్నానుగా! అంటూ ఆ పాపను సముదాయించి ఆపరేషన్‌కు ఉపక్రమించాడు. ఆరుగంటలు ఆపరేషన్ చేసినా ప్రయోజనం శూన్యం. ఆయన ఎంతో విచారంగా తన గదిలోకి వచ్చి వాష్‌రూమ్‌లో చేతులు శుభ్రం చేసుకుంటూ ఆ పాప మాటలు గుర్తుకువచ్చి.. ‘ఇపుడు ఆ పసిపాప కళ్లు తెరచి దేవుడు ఎలా ఉన్నాడని అమాయకంగా ఆడిగతే.. ’ఎలాంటి సమాధానం ఇవ్వాలని రెండు కన్నీటి బొట్లు వదిలాడు. ఇంతలో జూనియర్ డాక్టర్ పరుగెత్తుకు వచ్చాడు. సార్! పాప గుండె కవాటాల్లోకి రక్త ప్రసరణ జరుగుతుంది. అని చెప్పాడు. ఆశ్చర్యపోయిన డాక్టర్ మోహతా మళ్లీ ఆపరేషన్ థియోటర్‌లోకి పరుగెత్తుకు వెళ్లి నాలుగు గంటలు శ్రమించి ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ పూర్తయిన వెంటనే ఆయన ఆనందంగా ఇక ఈ పాపకు ఎలాంటి ఇబ్బంది రాదు అని అంటూ ఎన్నడూ చెయ్యెత్తి దణ్ణం పెట్టని ఆ భౌతికవాది శిరస్సు వంచి భగవంతుడికి నమస్కరించాడు. ఇది యదార్థ సంఘటన. ఇది వైద్యశాస్త్రంలోనూ, తన జీవితంలోనూ జరిగిన ఓ అద్భుతమైన సంఘటన అని ఆ వైద్యుడు ఇప్పటికీ చెబుతుంటాడు. ఇక ఆయన ఏ ఆపరేషన్ చేసినా ముందు భగవంతుడ్ని ప్రార్థించాకే పని ప్రారంభించేలా ఆ పసిహృదయం ఆయనలో పరివర్తన తీసుకువచ్చింది.