Others

బాబోయ్! ‘‘కశ్మీర్ కి కలియాఁ!’’ (వార్త-వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కశ్మీర్ కీ కలీ’ అంటే అనార్కలీని తలదనే్న అందగత్తె అని ఎందరికో తెలుసు గానీ, వాళ్లింత పెంకి పిల్లలని మనం అనుకోలేం. పోయిన వారం ఢిల్లీ విమానాశ్రయంలో ‘ట్రాన్సిట్’గా దిగిన కాశ్మీర్‌కి చెందిన యిద్దరు ‘ఎం.బి.’ స్టూడెంట్ కన్యలు- సెక్యూరిటీ సిబ్బంది గుండెల్లో విమానాలు పరిగెత్తించారు.
వాళ్లిద్దరూ బంగ్లాదేశ్‌లో ఎం.బి.బి.యస్ చదువుతున్నారు. శలవు పెట్టి కల్లోల కాశ్మీర్‌లోని తమ సొంత గ్రామానికి బయలుదేరారు. ఢాకానుంచి కలకత్తా మీదుగా ఢిల్లీ చేరుకున్నారు. అక్కణ్నుంచి శ్రీనగర్‌కి ఎగిరే విమానం పట్టుకోవాలి. ఈ అందాల భామలలో ఒక అమ్మాయి వీపుకు అతుక్కుని వున్న నల్లని బ్యాగ్‌మీద తెల్లని అక్షరాలు వుండి, యిలా వార్నింగ్ యిచ్చాయి.
‘‘ఈ బ్యాగ్‌లో బాంబ్ వుందోచ్!’’- దాంతో నఖశిఖ పర్యంతం చెక్ చేస్తూ పోలీసులకి రింగ్ యిచ్చారు భద్రతా సిబ్బంది- చెమటలు క్రక్కుతూ. ఇది అసలుసిసిలు టెర్రరిస్టల కాలం కదా! బంగ్లాదేశ్ సే కాశ్మీర్‌కి పోయే ప్రయాణీకుల బ్యాగ్‌లో బాంబా? అంతా హడిలి చచ్చారు.
‘‘్భలే వాళ్లండీ అంకుల్స్! బాంబ్ అంటే అంత భయమా? అంటూ కిలకిలా నవ్వింది. అంత దుస్థితిలోనూ కశ్మీర్ కీ కలీ- మా ‘క్యాంపస్’లో (బంగ్లాదేశ్‌లో) మేం ‘బుక్స్’ని ‘బాంబులు’ అంటాం’’ అన్నది. ‘బాంబులు’ తెచ్చుకుంటాం అంటాం సార్, మేము లైబ్రరీకి పోయి బాంబులు తెస్తాం అన్నారు.
ఈలోగా కాశ్మీర్ వెళ్ళే విమానం చెక్కేసింది. ఢిల్లీలో వున్న కజిన్ ఇంటికి పోయి మర్నాడు విమానం ఎక్కారు ఈ భలే అమ్మాయిలు!
ఐతే, కథ అంతటితో ఆగలేదు. వీళ్ల అమ్మా నాన్నలున్నారుగా? వాళ్లు కాశ్మీర్ ప్రతిపక్ష నాయకుడు ఒమర్ అబ్దుల్లాని పట్టుకున్నారు. ‘‘అన్యాయంగా ఇండియన్ గవర్నమెంటు మా పిల్లకాయల్ని ఢిల్లీ విమానాశ్రయంలో నిలవరించారు’’ అంటూ ఫిర్యాదు చేశారు. దాంతో ఒమర్ అబ్దుల్లా ది గ్రేట్‌గారు ‘‘ట్వీట్ బాంబులకి’’ లంకించుకున్నారు. పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు కానీ కథ మాత్రం అలా రగులుతూనే వుంది!

-వీరాజీ