Others

పసిమొగ్గల పొద్దుతిరుగుడు పువ్వు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసుపుపచ్చని పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడ్ని చూడగానే పులకరించిపోతుంది. ఇలాంటి పొద్దుతిరుగుడు పువ్వులను పేపర్‌తో చేయించి అలంకరిస్తే..
ఆ ఇంటికే అందాన్నిస్తోంది. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతకు పదును పెట్టేందుకు వారి చేత ఇలాంటి అందమైన పొద్దు తిరుగుడు పువ్వలను తయారుచేయించండి మరి. వీటికి ఖర్చు కూడా చాలా తక్కువే.
టిష్యూ పేపర్‌తో...
పిల్లలు స్కూలు నుంచి ఇంటికి రాగానే టీవీలకు అతుక్కుపోకుండా టిష్యూ పేపర్‌తో అందాలొలికే పొద్దుతిరుగుడు పువ్వులను చేయించండి
కావల్సిన వస్తువులు
పసుపుపచ్చ, ఆకుపచ్చ, బ్రౌన్ కలర్ టిష్యూ పేపర్
తయారుచేయటానికి పేపర్,గమ్
తొలుత అందమైన పొద్దుతిరుగుడు బొమ్మ వేయండి. ఈ స్కెచ్ అనుగుణంగా గమ్ పూస్తే దానిమీద కత్తిరించిన టిష్యూపేపర్లను టైట్‌గా కాకుండా నీట్‌గా అతికిస్తే సరిపోతుంది. ఆకులకు గ్రీన్, పువ్వు రెమ్మలకు పసుపు, పుప్పొడికి బ్రౌన్ కలర్ టిష్యూపేపర్ బాల్స్‌ను అతికించమంటే పిల్లలు ముచ్చటగా చేసేస్తారు. అంటించిన తరువాత గంటసేపు జాగ్రత్తగా కాపాడితే చాలు అందంగా తాము తయారు చేసిన ఈ పొద్దుతిరుగుడు బొమ్మను పిల్లలు తమ గదిలోపెట్టుకుంటారు.
పేపర్ ప్లేట్‌తో..
పేపర్ ప్లేటుతో కూడా అందంగా పొద్దు తిరుగుడు మొక్కను రూపొందించవచ్చు.
కావల్సినవి
పేపర్ ప్లేటు, సిజర్, జిగురు, ఎల్లో, గ్రీన్ ఫోమ్ షీట్, పెన్సిల్, పొద్దు తిరుగుడు విత్తనాలు.
అన్ని కలర్ టిష్యూ పేపర్లను రెండు అంగుళాల సైజులో స్క్వేర్ ఆకారంలో కత్తిరించాలి. పసుపుపచ్చ ఫోమ్ షీట్‌ను దీర్ఘచతురస్రాకారంలో కత్తిరించాలి. అలాగే పొద్దుతిరుగుడు రేకులను కూడా ఈ విధంగానే కత్తిరించాలి. పెన్సిల్‌తో కాండాన్ని గీయాలి. ఆ కాండానికి పచ్చని ఫోమ్‌ను రెండు ఆకులుగా కత్తిరించి అతికించాలి. అలాగే పేపర్‌ప్లేటును పువ్వుగా అలంకరించాలి. పుప్పొడి స్థానంలో విత్తనాలను ఏర్పాటుచేస్తే పొద్దుతిరుగుడు పువ్వు రెడీ అవుతోంది.
హ్యండ్ ప్రింట్‌తో..
చిన్నారుల చేత యాక్రిలిక్ పెయింట్‌తో పొద్దుతిరుగుడు పువ్వును తయారుచేయించవచ్చు. వీటికి కావల్సినవి ఎల్లో, గ్రీన్, బ్రౌన్ యాక్రిలిక్ పెయింట్స్, ఫోమ్ బ్రెష్ ఉంటే సరిపోతుంది. ముందు ఫోమ్ బ్రెష్‌తో కాండాన్ని గ్రీన్ పెయింట్‌తో తీర్చిదిద్దండి. పువ్వు రేకులను కూడా చేతివేళ్లకు పసుపు పెయింటింగ్ పూసి అద్దమనండి. ఇక బ్రౌన్ కలర్ పెయింట్‌తో పుప్పొడిని వేయండి. తరువాత చిన్నారుల రెండు చేతులకు గ్రీన్ పెయింట్ అద్దేస్తే ఆ రెండు చేతులను ఆకులుగా కాండానికి అద్దండి. ఇలా మొత్తం పెయింటింగ్ అయిన తరువాత డ్రైగా మారిన తరువాత చూస్తే బాగుంటుంది. ఇలా చిన్నపాటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పనులతో వారిలో ఉత్సాహాన్ని నింపండి.