Others

‘‘అహో! ఏమి ‘హోటలు!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నిసియానా ఆన్‌సేనా కియాన్‌కాన్’ అంటే ఏమిటి? అదేదో మంత్రమో, తంత్రమో, పొడుపు కథో కాదు. అది ఒక జపాన్ హోటలు పేరు.
యమానాషి జిల్లాలో యించుమించు ఫుజి పర్వతాలకి దగ్గరగా వుంది యిది. దీన్ని క్రీ.శ. 705లో స్థాపించారు. చక్రవర్తులు మొదలు సామాన్యులదాకా రుూ హోటల్‌కి ఎగబడివస్తూ వచ్చారు. ఇవాళ కూడా యిది టూరిస్టులకు స్వర్గం. ఒక్క రాత్రికి కేవలం 34,720 ‘యన్’లు. అంటే 217 పౌండ్లు. ఇది కనీస రేటు మాత్రమే! ఈ హోటలు 1311వ వార్షికోత్సవం చేసుకుంటోంది. దీన్ని వంశపారంపర్యంగా మొత్తం 52 తరాలు- ఒకే కుటుంబీకులు నిర్వహిస్తూ వస్తున్నారు. అదే అసలు రికార్డు!
‘వేడి నీటి బుగ్గలు’ వున్న రుూ ప్రాంతంలో, అచ్చం అలనాటి జపాన్ సంప్రదాయ రీతులలో నడిచే రుూ హోటల్ మీద ఫిర్యాదులు లేవు. ‘‘్భజనం, బస- రుూ రెండూ అద్భుతాలు’’ అంటారు టూరిస్టులు. పాతవాసనలు కొట్టని, చరిత్రాత్మకమయిన ఈ హోటలులో 35 గదులున్నాయి. 1997లో దీన్ని ఆధునీకరించారు. దీనికి దాయాదుల తగాదాలు లేవు. అంతా ఆరోగ్యకరమైన వాతావరణమే. ‘‘అహో! ఏమి రుూ మయసభా!’’ అన్నట్లుంటాయేమో గదులు, వరండాలు? ఐనా చాలా దూరం బాబూ!