Others

మాటల మాటున...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. రాష్ట్రం ఇంకా గాడిలో పడలేదు. ఇవాళ కాకపోతే రేపైనా ‘మీరు ఏం చేశారని’ ప్రజలు నిలదీయవచ్చు. వారు ప్రశ్నించకముందే జవాబు చెప్పేస్తే పోలా...అదీ అర్థవంతంగా, మార్కులు కొట్టేసేలా, మరోమాట లేకుండా...ఇదీ ఏపీ ముఖ్యమంత్రి ఎత్తుగడ. అందుకే ఆయన కష్టాల పల్లవి అందుకున్నారనిపిస్తోంది. కష్టాల రాజ్యభారాన్ని మోస్తూ చాకచక్యంగా పరిపాలన నిర్వహిస్తూ, వచ్చే దశాబ్దాల్లోకూడా అధికారంలో కొనసాగేందుకు ఏం చేయాలో అవన్నీ ఆయన పక్కాగా చేస్తున్నారని ఈ రెండేళ్లలో ఆయన వేసిన అడుగులు చెబుతున్నాయి. వ్యూహం అంతా ఆయన మాటల్లో అంతర్లీనంగా కన్పిస్తూంటుంది.
విభజనలో జరిగిన అన్యాయం, రెవిన్యూ లోటు, నిధుల పంపకంలో అన్యాయం, కేంద్రం నుంచి ఆశించినంత వేగంగా, పెద్దమొత్తంలో సహాయం లేదన్న వాదనలను ఏకరవుపెడుతూంటారు చంద్రబాబు. చంద్రబాబు కనుక నెట్టుకొస్తున్నారన్న ‘ఇమేజ్’ తెచ్చుకోవడానికి ఏం చేయాలో ఆయనకు తెలిసింతగా మరెవరికీ తెలీదు. గత రెండు నెలల్లో బాబు మాటలు ఆయన వ్యూహాన్ని చెప్పక చెబుతున్నాయి.
రాజకీయ ప్రయోజనాలకోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని, అప్పులతో రోడ్డున పడేశారని, తాను కష్టపడి పనిచేస్తూ గాడిలో పెట్టడానికి పనిచేస్తున్నానని, దేశంలో ఇలాంటి పరిస్థితి మరే రాష్ట్రానికీ లేదని ఆయన ఏకరవుపెడుతున్న వాదన. రాష్ట్రం ఏమైపోతుందోనన్న బెంగతో ఉన్న జనాలకు తను భద్రతాభావాన్ని కలిగించేలా పనిచేస్తున్నానని చంద్రబాబు భావిస్తున్నారు. జనంకూడా అలా భావించేలా ఎత్తుగడలు వేస్తున్నారు. ఇందులో నిజంకూడా ఉంది. అయినా దురదృష్టం పలురూపాల్లో వెన్నాడుతోందని, రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవని, ఇందుకు చాలా సమయం పడుతుందనే భావన ప్రజలకు కలిగేలా ఆయన ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇటీవలి కాలంలో ఆయన మాటల పల్లవిలో అన్నీ కష్టాలే విన్పించడానికి అదే కారణం. ప్రతి రోజూ సమస్యలను ఏకరవుపెట్టడం ఆ వ్యూహంలో భాగం. 52 శాతం ఆంధ్రాజనాభాకు 48 శాతం ఆదాయం ఇస్తే, 48 శాతం తెలంగాణ జనాభాకు 52 శాతం ఆదాయం ఇవ్వచ్చారంటూ ఆలాపన అందుకుంటున్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా, రాజధాని నిర్మాణానికి నిధులు లేకుండా, ప్రత్యేక హోదా లేకుండా చేసిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని, రాష్ట్ర ప్రజల హక్కులను పరిరక్షించే నిబంధనలు రాష్ట్ర విభజన చట్టంలో చేర్చకపోవడం వల్లనే నేడు ఈ ఇబ్బందులు వస్తున్నాయని చంద్రబాబు చెబుతున్నారు. అంతటితో ఊరుకోకుండా 2050 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్‌గా రాష్ట్రాన్ని నిర్మించడం లక్ష్యమని, అలాగే 2029 నాటికి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని పేర్కొంటున్నారు. అంటే తక్షణం అభివృద్ధి అంతా జరిగిపోదని, ఏళ్లతరబడి పనిచేస్తే తప్ప అది సాధ్యంకాదని చెప్పడమన్నమాట. ఇటీవల జరిగిన మహానాడులో కూడా అదే స్పష్టం చేశారు. ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఒకే పార్టీ అదే పనిగా మళ్లీ గెలుస్తుండగా, ఆంధ్రాలో టిడిపి మాత్రమే 2050 వరకూ అధికారంలో ఉండేలా ఎందుకు చూడకూడదని ప్రశ్నించారు. తదనుగుణంగా పార్టీని పటిష్టం చేయాలని నాయకులను సిద్ధం చేశారు.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో తొలి ఆరు నెలలు రాజధాని ఎంపికకు, తర్వాత ఆరు నెలలు భూ సమీకరణకు సరిపోయింది, మరో ఆరు నెలలు రాజధాని డిజైన్లకు, సింగపూర్‌తో చర్చలకు గడిచిపోయింది. రాష్ట్రంలో నవనిర్మాణ కార్యక్రమం, మహానాడు, కలెక్టర్ల కాన్ఫరెన్సులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు, ఆర్ధిక ఇబ్బందులు, హుద్‌హుద్ తుఫాను, గోదావరి పుష్కరాలు, తొక్కిసలాట , దక్షిణభారతంలో తుఫానుతో మూడు జిల్లాలు సర్వనాశనం కావడంతో వాటి పునరుద్ధరణ పనులు, ప్రధాని చేతులు మీదుగా అమరావతి శంకుస్థాపన పనులు, సిబ్బంది తరలింపు, సంక్షేమ కార్యక్రమాల అమలు మధ్యలో శాసనసభ సమావేశాలు ఇలా ముఖ్యమంత్రి అంతా తానై ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒకపుడు ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టించిన చంద్రబాబు తనస్టైల్ మార్చి వారిని నమ్మించి, ఒప్పించి పనులు చేయించుకునే ఆలోచనకు వచ్చారు. ప్రభుత్వం విధించిన జూన్ 27 గడువు పాటించలేమని చెబుతున్నా వేచిచూసే ధోరణిని చంద్రబాబు అనుసరిస్తున్నారు. రాష్ట్భ్రావృద్ధికి రోజంతా కష్టపడుతున్న చంద్రబాబునాయుడు వాటి ఫలాలను ఎపుడు అందిస్తారోనని ఎదురుచూడటం ప్రజల వంతైంది.

chitram...

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు

- బి.వి. ప్రసాద్