Others

దవడలు వాస్తే జాగ్రత్తా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పన్ను నొప్పే కదా అని సరిపెట్టుకుంటే అప్పుడప్పుడు అది దాని పూర్తి సత్తా ఏంటో చూపిస్తుంది. అలా చూపించినపుడు అది ముఖంపై వాపుకి దారితీస్తుంది. వాపే కదా ఏమవుతుందని దాన్ని చిన్నచూపు చూస్తే అంతకుమించిన పొరపాటు ఇంకోటి ఉండదు. ఆ వాపు ఊపిరి పారే ప్రదేశాలమీద ఒత్తిడి కలిగిస్తే అది ప్రాణానికే ప్రమాదం. అలా వచ్చే వాపు, ముఖానికి ఒకవైపు మాత్రమే వస్తే దాన్ని ళఉజజజశ్రీజనినిడ అంటారు. ఆ వాపు ముఖానికి ఇరువైపులా వస్తే దాన్ని జశ్రీజీనిదిడ దిని అంటారు. ఆది ఇంకా ప్రమాదకరం.
వాపు అసలు ఎందుకు వస్తుంది?
నోట్లో పన్నుకి లేదా చిగురికి సంక్రమణ (నిఉ్ళన్జి) అయితే అది కొందరిలో (ముఖ్యం గా రోగ నిరోధక శక్తి తక్కువున్నవారిలో) పెద్దదిగా మారి ముఖంమీద కనబడే వాపులా అవుతుంది. ఈ సంక్రమణవల్ల ఉత్పత్తి అయ్యే చీము అవయవాల మధ్య పారి, ఆ ప్రదేశంలోని రక్తకణాల మీద లేక ఊపిరి పారే ప్రదేశాల మీద ఒత్తిడి కలిగించి ప్రాణాంతకం కావచ్చు. పన్ను లేక చిగురు నొప్పితోపాటు, జ్వరం, నోరు తెరవలేకపోవడం, మింగలేకపోవడం మనం వీరిలో గమనించగలం. ఈ వాపు పై పళ్ళకి సంబంధించినదయితే అది కన్ను క్రింది భాగం వరకు పాకే ప్రమాదం ఉంది. అదే క్రింద పళ్ళకి సంబంధించినదైతే అది మెడ ఇంక ఛాతి వరకు పాకే ప్రమాదం ఉంది. ఛాతివరకు పాకితే దాన్ని ఉనిడనినినిడ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. వాచిన ప్రాంతంలో చర్మం ఎర్రగా ఉంటుంది, ఈ వాపు గట్టిగా లేక మెత్తగా ఉండొచ్చు. అక్కడ నొక్కితే నొప్పిగా ఉంటుంది.
ఈ వాపు రాగానే
ఎం చెయ్యాలి?
ఈ వాపుకి మూలం ఏంటో కనుక్కోవడం ముఖ్యం. చాలాసార్లు ఇది పంటికి సంబంధించినదై ఉంటుంది. అలా ఉంటే వారు పళ్ళ డాక్టర్‌ని కలవడం ఉత్తమం. ఈ వాపు పంటికి సంబంధించినదైతే మొదట ఆ వాపు ప్రమాణం మరియు ఎక్కడదాకా విస్తరించిందో చూసుకోవాలి.
వాపు కొద్దిగా ఉన్నవారిలో దానికి కారణమైన పళ్ళకి గ్జ్జ ళోజ చేసి మందులు వాడాల్సి ఉంటుంది. 48 గంటలలోపు వాపు తగ్గపోయినా లేక ఎక్కువైనా అపుడు ఆ పన్నుని తీసేయాల్సి వుంటుంది. పన్ను తీయించుకోవడం ఇష్టంలేనివారు ఇంకొంచెం మేలైన మాత్రలు లేక ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వుంటుంది.
పై చెప్పినవి ఫలించకపోయినా లేక మొదటినించే వాపు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నా ఆపరేషన్ చెయ్యాల్సి వుంటుంది. కత్తితో వాపు ఉన్న ప్రదేశంలో కోసి లోపలిదాకా వెళ్లి చీముని తీయాలి. దీనితోపాటు పంటికి ఏ చికిత్స చేస్తే మంచిదో డాక్టర్ నిర్ణయిస్తాడు. అత్యంత ప్రమాదకరమైన వాపులలో చీముతోపాటు పంటిని తీసేయడం శ్రేయస్కరం. కొందరిలో పంటిని రూట్ కెనాల్ చేసి కాపాడవచ్చు. తీసిన చీముని పరీక్షకి పంపి అందులో ఏ క్రిములున్నాయో ఏ మందులు పనిచేస్తాయో తెలుసుకుని వాడితే లాభం వుంటుంది.
ఎన్నాళ్లు ఆసుపత్రిలో ఉండాలి?
ఇది వాపుమీద మరియు డాక్టర్ అనుభవంమీద ఆధారపడి వుంటుంది. వాపు తక్కువగా ఉన్నవారు, ప్రమాదం అంతగా కనిపించనివారు పన్నుకి సంబంధించి చికిత్స చేసుకొని ఇంటికి పోవచ్చు. నొప్పి, వాపు, జ్వరం ఎక్కువైతే తక్షణం డాక్టర్‌ని తిరిగి సంప్రదించాల్సి వుంటుంది. లేకపోతే 24 గంటలకి మరియ 48 గంటలకి డాక్టర్‌ని వచ్చి కలవాలి. వాపు, జ్వరం, పంటినొప్పి తగ్గుముఖం పట్టాయో లేదో అని డాక్టర్ పరీక్షిస్తాడు.
వాపు ఎక్కువ ఉన్నవారిలో లేక తగ్గని వారిలో ఆపరేషన్, ఆసుపత్రిలో ఉండడం అవసరం. మధుమేహం ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
చీము తీయడంకోసం చర్మాన్ని లేక
చిగురుని కోస్తే గాట్లు పడవా?
గాట్లు పడతాయి. ఈ క్రమంలో చేసే కోతలకు కుట్లు వెయ్యరు. చీముని మొత్తం ఒకేసారి తీయడం అనుభవం. అందుకే కోసి కుట్లు వెయ్యకుండా అలానే వదిలేస్తారు. రోజూ ఆ గాయంలో దూది పెట్టి మరుసటి రోజు అది తీసి కొత్త దూదిని పెడుతుంటారు. దూది చీముని పీల్చుకొని శరీరంలో నిలువ ఉండకుండా కాపాడుతుంది. వాపు మొత్తం తగ్గాక, గాయం శుభ్రంగా ఉన్ననాడు దూది పెట్టడం ఆపివేస్తారు. సాధారణంగా దూది 4 నుంచి వారం రోజులు పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత గాయాన్ని స్వతహాగా మానేందుకు వదిలేస్తారు.
మరి గాట్లు?
కోసిన గాయం గాటుకింద మారి అది మన సౌందర్యానికి అడ్డు అయితే 3 లేక 4 నెలలకి ఆ గాట్లని ఆపరేషన్ చేసి తొలగిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ గాటు నిర్మూలించే ఆపరేషన్ ఆరు వారాలకి చెయ్యొచ్చు.
రూట్ కెనాల్ అంటే?
అంటే ఏంటో, పన్ను తీసేస్తే ఏం చెయ్యాలో, ఇంక పంటికి కంటికి సంబంధం ఉందా లేదా అన్న వాటి గురించి తెలుసుకోవాలంటే మరో వారం ఆగండి.
*

-డా. రమేష్ శ్రీరంగం, సర్జన్, ఫేస్ క్లినిక్స్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్