Others

‘సంగీత’ పాత్ర అద్భుతం : నర్గీస్ ఫక్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజహర్ సినిమాలో సంగీత బిజ్‌లాని పాత్ర చిత్రీకరణ అద్భుతంగా ఉంటుందని ఆ పాత్రను పోషస్తున్న నర్గీస్ ఫక్రి అంటున్నారు. ప్రముఖ క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా ఆయన పేరుతో ‘అజహర్’ సినిమా వస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా అందులో సంగీతాబిజ్‌లాని పాత్ర చిత్రీకరణ గురించి నర్గీస్ ముచ్చటిస్తూ.. ఇందులో ఆమె ప్రాత సొగసుగా, అద్భుతంగా ఉంటుందని వెల్లడించింది. ఈ వయసులోనూ ఇంత సొగసుగా సంగీతాబిజ్‌లాని ఉండటం వెనుక ఉన్న ఫిట్‌నెస్ మంత్రం గురించి తెలుసుకోవాలని ఉబలాటపడుతున్నానని, త్వరలోనే ఆమెను కలుస్తానని వెల్లడించింది. డైరెక్టర్ చెప్పిన విధంగానే తాను ఆ పాత్రలో ఒదిగిపోయానని అన్నారు. మీకు అజారుద్దీన్ గురించి ఏమి తెలుసుకున్నారని అడిగితే నాకు ఆయన గురించి ఏమి తెలియదని స్క్రిప్ట్ ఆధారంగా నటించానని చెబుతూ.. కాని కథలో చాలా భావోద్వేగాలు ఉన్నాయని, మ్యాచ్ ఫిక్సింగ్ విషయంలో ఇవి కనబడతాయని వెల్లడించింది. క్రికెట్ పరిజ్ఞానం కూడా అంతగా లేదని, ఆట ప్రదర్శనలో ప్లేయర్స్ కనబరిచే శక్తియుక్తులను ఇష్టపడతానని పేర్కొంది. ఈ సినిమాలో కోప్లేయర్ ఇమ్రాన్ హష్మీ గురించి చెబుతూ..నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతారని, ఆయుర్వేదంలో ఇమ్రాన్‌కు పరిజ్ఞానం ఉందని పేర్కొంది. బాలీవుడ్‌లో నిలదొక్కుకోవటం కొంచెం కష్టమేనని, భాషాపరమైన ఇబ్బందులు ఎదుర్కోవటంతో పాటు ఎన్నో పాఠాలు నేర్పిందని పేర్కొంది. నిజాయితీని నమ్ముతానని, ఇది ఉంటే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని, దీనిని తన తల్లి నేర్పిందని వెల్లడించింది. ఇదిలా ఉండగా సంగీతాబిజ్‌లాని తన పాత్ర చిత్రీకరణ సరిగా లేకపోయినా, వివాదాలు తలెత్తినా పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు వినికిడి. భారీ ఎత్తున ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా.. ఇంతవరకు ఆమెను ఎవ్వరూ సంప్రదించకపోవటం గమనార్హం.