Others

అక్కడ కోతి కనబడితే షూట్ చేయొచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండాకాలం కదాని, సిమ్లాకి వెళ్లకండి. ఊటీకి పోండి. హిమాచల్‌ప్రదేశ్‌లో కోతుల ఆగడాలకి అంతులేదు. సిమ్లా వీధుల్లో అవి దండు దండులుగా- వెనుకటికి వానర సైన్యం లంకలో రాక్షసుల మీద దాడులు చేసినట్లు టూరిస్టుల మీద దండయాత్రలు చేస్తూంటాయి. వీటి బెడద పడలేక రాష్ట్ర, కేంద్రం శరణుజొచ్చింది.
కేంద్ర ప్రభుత్వం మొన్న వీటిని ‘క్షుద్ర జంతువులు’గా ప్రకటించి- సిమ్లా మ్యునిసిపల్ పరిధిలో ఎక్కడ అవి కనబడ్డా ‘షూట్’ చేసి పారేయొచ్చుననీ, రుూ ఉత్తర్వులు ఆరు మాసాలదాకా అమలులో వుంటాయనీ ప్రకటించింది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా, లక్షమంది టూరిస్టులు వచ్చే సిమ్లాలో- ఇండ్లకీ, దుకాణాలకీ, జనాలకీ కూడా రుూ మర్కట యోధుల దాడి యుద్ధరంగాన్ని తలపిస్తుంది.
రీసస్ కోతులు (వైద్య పరిశోధనలకి పనికొచ్చేవి) హిమాచల్‌ప్రదేశ్‌లో - మూడు లక్షల దాకా వున్నాయిగానీ- సిమ్లా సిటీమీద వాటి దెబ్బ మహాఘోరం.. నెలకో వంద ‘కోతి కాట్లు’ ప్రభుత్వ రిప్పన్ ఆసుపత్రిలో నమోదు అవుతున్నాయి. 2006 నుంచి వీటి బెడదని తప్పించుకోడానికి వీటికి కుటుంబ నియంత్రణ (శస్త్ర) చికిత్సలు చేశారు. లేజర్ బీమ్ యంత్రాలు వాడారు. ఇండ్లకి కటకటాల రక్షణ కల్పించారు. కాని అవి క్రమేపీ, మనుషులు తినే తిండి, వండిన పదార్థాలు, కూరలు, పులుసులు, బిర్యానీలు, పలావులూ ఆరగించడానికి అలవాటుపడిపోయాయి. దాంతో జనాల్ని- అక్షరాలా పీక్కు తినడం మొదలెట్టాయి. ‘‘కోతి, ముఖ్యంగా- సయామీ రీసెస్ మర్కటాన్ని చంపడం దాకా ఎందుకు? కొట్టడం కూడా చేయకూడదు’’. కానీ దాన్ని యిప్పుడు ‘క్షుద్రజంతువు’గా ప్రకటించడం చేత జనాలమీద అవి కలియపడితే- ఆత్మరక్షణ కోసం చంపేసినా ఈ ఆర్నెల్ల పాటు అడిగేవాడుండడు. ‘హిమాచల్‌లో’ 75 తాలూకాలకీ 39 తాలూకాలు ‘మర్కట ప్రమాద ప్రాంతాలు’గా ప్రకటించారు ప్రభుత్వం వారు. కోట్లాది రూపాయలు విలువచేసే పంటలు, పండ్లతోటలనూ యివి ధ్వంసం చేసేస్తున్నాయి. ‘‘కోతి హింస నేరం’’ అన్నది కాస్తా యిప్పుడు కోతిని ‘‘కాల్చిపారేయండి’’ అన్న ఆర్డర్‌గా మారింది. జంతు రక్షణ సంఘాలు- కోర్టుకి వెళ్తామంటున్నాయి. ‘‘మనుషులు బ్రతకాలా? వద్దా?’’ అంటున్నారు అధికారులు. కోతుల, కుక్కల బెడద దుర్భరం అయిన మన దేశంలో సిమ్లా కూడా ఒక భాగమేగా?

‘‘అమ్మ జెడలో పువ్వు’’ అంతే సంగతులా?

సుప్రీంకోర్టు ముందు డ్రమెటిక్‌గా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది- అన్నది, రుూ వారం మొదట్లో అందిన వార్త- కొంచెంమందినైనా రుూ న్యూసు కలిచివేసింది. అది దేని గురించి అంటారా?
‘‘కొండంత వెలుగు’’ ‘కోహినూర్’ అనే రత్నం గురించి చింత. కోహినూర్‌ని ఎప్పుడు తీసుకు వస్తారు? అంటూ అర్జెంట్‌గా పడ్డ ఒక జనహిత వాజ్యం మీద స్పందించిన సుప్రీంకోర్టు- సీరియస్‌గా స్పందిస్తూ గవర్నమెంటుని అడిగింది.
‘‘కోహినూర్’’ అనంగానే మా చిన్నప్పటి స్కూలు- ప్రార్థనా సమయం కొంత లీలగా జ్ఞాపకం వస్తోంది. అప్పుడు ఎలిమెంటరీ స్కూల్సులో ‘‘ప్రేయర్లుం’’డేవి కావు. ‘ప్రార్థన’లే వుండేవి. అందులో పాట ఒకటుంది, అది దేశభక్తి గీతంలెండి. ‘‘మాతా నమో హిందూమాతా- మాతా జగన్మాతా, ఎట్సెట్రా.. ఎట్సెట్రా.. ఎట్సెట్రా చరణాల తర్వాత- ‘‘కోహినూరు నీ జెడలో పువ్వట- గోలకొండ నీ రత్నకోశమట.. ఆహా! నీ భాగ్యమునేమందు మాతా!’’ అంటూ సాగింది ఆ పాట. కానీ, సదరు భాగ్యం 1850 తర్వాత- ‘‘ఇండియా మాత’’కి లభించలేదు. ఆ జడలో పువ్వు అన్నది ప్రస్తుతం బ్రిటిష్ రాణీగారి కిరీటంలో భద్రంగా పొదగబడి వుంది అని సుప్రీంకోర్టువారికి కేంద్ర ప్రభుత్వ న్యాయవాద మహాశయుడు- శ్రీ రంజిత్‌కుమార్ చెప్పాడు. దాన్ని మనం తిరిగి తేలేమండీ! ఎలా తెస్తాం? అది ‘గిఫ్ట్’ అనగా ‘కానుక’. దాన్ని అక్రమంగానో, దొంగతనంగానో ఎత్తుకుపోతే, మనం తేడానికి ప్రయత్నం చేయగలంగానీ’’ అన్నాడు. ‘‘సారీ సర్! సాధ్యం కాదు’’ అంటూ, ‘‘గిఫ్ట్‌ని వెనక్కి లాక్కోగలమా?’’ అని అనేశాడు- చేతులెత్తేస్తూ మరీ..
‘‘అమూల్యం’’ అనాలో- ‘‘అపార మూల్య’’మనాలో మొత్తంమీద ప్రపంచ ప్రఖ్యాత అపురూప రత్నం- దాని బరువు 108 క్యారెట్‌లుంటుంది. దీన్ని రంజిత్ సింగ్ రాజు బ్రిటీష్ వారికి సమర్పించాడు అంటూ వివరించాడు.
అసలు ‘యిది’ మనది, తెలుగువారిది. అంటే కాకతీయ రాజులనాటిది. గోలకొండ దగ్గర దొరికింది. దీన్ని ‘గియానుద్దీన్ తుగ్లక్ షా’ సుల్తాన్ పంపిన ఉద్గల్ ఖాన్ అనే సైన్యాధికారి కొల్లగొట్టుకుపోయాడుట! అది 1323 నాటి సంగతి. ఎలా అయితేనేం? యిది 1830 నాటికి మహారాజ్ రంజిత్ సింహుడికి దక్కగా- ఆయన ‘‘నా తదనంతరం రుూ కోహినూర్‌ని పూరీ జగన్నాధుడికి అరణంగా యిచ్చేయండిరా!’’ అంటే- డల్‌హౌసీ ప్రభువు, ఎత్తుకుపోయాడట. మొత్తానికి దానికో శాపం వుంది- ఏ మగాడూ దీన్ని కిరీటంలోగానీ, భుజకీర్తులలోగానీ ధరిస్తే అంతే సంగతులయిపోతాడు.
ఒక దేవత లేదా ఒక గొప్ప స్ర్తి నెత్తిమీదో యిది వుండాలిట. అయితే దీన్ని ఒక్క భారత్ మాత్రమేనా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ దేశాలు కూడా ‘మాదే’నంటున్నాయిట. ఆమాటే సుప్రీంకోర్టు గవర్నమెంటు న్యాయవాదిని అడిగింది. పైగా 1849లో సిక్కు యుద్ధం లాహోర్‌లో జరిగింది. అదే, రంజిత్ సింహ్‌గారి ముఖ్య పట్టణం. మరి అంచేత బ్రిటిష్‌వాళ్లు తిరిగిస్తే, అది నేరుగా లాహోర్‌కో ‘జానాహై’ కదా?
‘‘వద్దులే బాబూ! బ్రిటన్‌లోనే వుండనీయండి దాన్ని, ‘సేఫ్’గా వుంటుంది’’ అన్నదో దేశభక్తురాలు.
సో, ‘అమ్మ జెడలో పువ్వు’ ‘కోహినూర్’ బ్రిటిష్ రాణీ కిరీటంలో - ‘కొండంత వెలుగు’ (కోహినూర్ అన్నమాటకి పర్షియన్ భాషలో అర్థం) అలా అలా నిస్తూ వుండిపోవచ్చునేమో- అయినా మరో ఆరు వారాల్లో యింకోసారి, యింకో నివేదిక తెమ్మందిట సుప్రీంకోర్టు. ఎనివే, కోహినూరుకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్!

లైబ్రరీ బుక్ పారేస్తే ‘జైలు’కే!

మిచిగన్ (అమెరికా) రాష్ట్ర దంపతులు శ్రీమతి క్యాథీశ్రీ మెర్విన్ డ్యూరేక్‌లు వాళ్ల వూళ్లోని ‘టెకుమేసే’ జిల్లా గ్రంథాలయం నుంచి ‘ఓ హ్యాట్ ఫుల్ ఆఫ్ సెయస్’ అనే పిల్లల పుస్తకం ఒకటి, అలాగే ‘ది రోమ్ ఫ్రాఫెసీ’ అనే పెద్దల నవల ఎరువు తీసుకుని, పాపం! ఎక్కడో పారేసుకున్నారు. తన ‘మనవడికి చదివి వినిపించవయ్యా!’ అంటూ పిల్లల పుస్తకం మెర్విన్ వాళ్లబ్బాయికిస్తే, ఆ బిడ్డ తండ్రి దాన్ని పారేశాడు. ఈ నేర పరిశోధక నవలన్ని వీళ్లు పారేశారు. ఆ రెండు పుస్తకాలకీ ‘ఫైన్’ కట్టడం కూడా మరిచిపోయారు. బుక్స్ ఇవ్వకపోతే, ఎనిమిది నెలల తర్వాత, నోటీస్ కొట్టి రప్పించారు లైబ్రరీ వాళ్లు- ‘‘నవలకి లేట్ ఫీజు క్రింద 35 డాలర్‌లు అంటే మాటలా?’’ అంటూ బుకాయించారు రుూ దంపతులు. ‘‘కట్టం సార్’’ అన్నారు. ఈ కథ జూలై 2014 నుంచి 2015 డిసెంబర్ దాకా సాగేకా- లైబ్రరీ వాళ్లని కోర్టుకీడ్చింది. 250 డాలర్లు ఫైన్ కట్ట లేదన్నది ఆరోపణ. పుస్తకాల ఖరీదు యివ్వలేదు పోనీ- దాంతో కోర్టు వారు మూణ్ణెల్లు జైలుకీ, 500 డాలర్ల జరిమానా కట్టాల్సి వుంటుంది అంటూ ఒక వంద డాలర్లకి జామీను యిచ్చి ప్రస్తుతానికి పంపించారు. ‘‘బుక్స్ పారేస్తే జైలుకి తోలేస్తారా? నేను అంత అంత పెద్ద నేరం చేశానా?’’ అంటూ, శ్రీమతి క్యాథీ ఒక వంద డాలర్లు మనీ ఆర్డర్ చేసిందట. అయితే ‘జైలు’ మాత్రం తప్పదంటున్నారు లాయర్లు. ఇదే మన దేశంలో అయితే? ‘‘పుస్తకం విత్తం పరహస్త గతం గతః’’ అంటూ బుకాయిస్తారు- ఔనా? కాదా?

veeraji.pkm@gmail.com