Others

చీదరించుకున్నవారే.. ఆదరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు ఆమెను చూస్తే చీదరించుకునేవారు. అనారోగ్యం పాలైన కన్నతల్లిని కాపాడు కునేం దుకు దేవదాసి వృత్తిని స్వీకరించటమే ఆమె చేసిన నేరం. అయతేనేమి అవమానాలను దిగ మింగు కుని ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకు వేసింది. ఈ రోజు చీదరించుకున్నవారే గౌరవిస్తున్నారు. పసి వయసు నుంచే పలు ఆటు పోట్లను ఎదుర్కొన్న మహానంద అనే మహిళ గాథ ఇది. కర్ణాటకలోని గడగ్ జిల్లాకి చెందిన మహానంద జీవితం అనుకోని మలుపులు తిరిగి ఎక్కడికో చేరుకుంది. ఆమె చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. పదహారేళ్ల ప్రాయం వచ్చేసరికి భగవంతుడు చిన్నచూపు చూడడంతో తల్లి అనారోగ్యం బారిన పడింది. దాంతో మహానంద తల్లడిల్లిపోయింది. తల్లి వైద్యానికి ఆర్థిక సాయం చేయమని మేనమామలను ప్రాధేయపడింది. కొంత పైకం ఇచ్చి ఇంతకంటే మేము సాయం చేయలేమని చెప్పేశారు. ఒంటరిదైన మహానందకి తల్లిని బతికించుకోవడానికి ఒకే ఒక్క మార్గం కనిపించింది. అదే దేవదాసీగా మారడం..
మూడేళ్ల పాటు నరకం
అయితే ఈ విషయం ఎవరికి చెప్పినా చీదరించుకుంటారు. కానీ అంతకంటే ఆ సమయంలో చేయగలిగేది లేదు. దాంతో మనస్సును దృఢపరచుకుని మహానంద దేవదాసిగా మారింది. వచ్చిన డబ్బుతో తల్లికి వైద్యం చేయించింది. ఇష్టం లేకపోయినా దిగిన రొంపిలోనుండి బయటికి రావడానికి సాధ్యం కాలేదు ఆమెకి. అలా మూడేళ్ల పాటు నరకం అనుభవించింది.
అదే సమయంలో దేవదాసీలు, ఇతర నిస్సహాయ మహిళల కోసం పోరాటం సాగిస్తున్న సీతా వా అనే సంఘ సేవకురాలికి మహానంద గురించి తెలిసింది. ఆమెని నరక కూపం నుండి బయటికి తీసుకొచ్చింది. చుట్టుప్రక్కల వాళ్లు ఆమెని చీదరించుకోవడం , హేళన చేయడం మొదలుపెట్టారు. అయితే సీతావా మహానందకి తోడుగా నిలబడింది. ఆమెలోని న్యూనతాభావాన్ని తొలగించింది. మహానందని టైలరింగ్ స్కూల్లో చేర్పించింది. సీతావా చొరవతో మహానంద మాస్ అనే స్వచ్ఛంద సంస్థలో చేరి రకరకాల దుస్తులు కుట్టడం నేర్చుకుంది. దాతల సాయంతో ఒక కుట్టుమిషన్ కొనుక్కుని బట్టలు కుట్టడం మొదలుపెట్టింది. మంచి మంచి మోడల్స్‌లో, అతి తక్కువ ఛార్జికే ఆమె దుస్తులు కుట్టడం గురించి తెలుసుకున్న వారంతా ఆమె దగ్గరికి రావడం మొదలైంది. మెల్లగా ఆమె బిజినెస్ పెరిగింది. చక్కని రాబడితో మహానంద ధైర్యంగా నిజాయితీగా జీవిస్తోంది.
పాకుడురాళ్లమీద నుండి స్వశక్తితో పైస్థాయికి చేరుకున్న మహానంద దీని గురించి మాట్లాడుతూ ‘నేను పరిస్థితులకి తలొగ్గి తప్పుడు మార్గంలో నడిచాను. చీడపురుగునన్నట్లు చూసారు. అయినవాళ్ళు కూడా దరి చేరనీయలేదు. ఈ భూమీద నాకంటూ ఇంత చోటు కూడా లేదేమో అన్నట్లు అంతా ప్రవర్తించేవారు. కానీ భగవంతుడు దయామయుడు. నేను ఆ నరక కూపం నుండి బయటికి రావడానికి మెల్లగా నా ఎదుట దారులు పరిచాడు. అంది వచ్చిన అవకాశాలను పట్టుకుని ఇప్పుడు నా కాళ్ళమీద నేను నిలబడగలిగాను. సమాజంలో ఇపుడు నేను గౌరవప్రదంగా బ్రతకగలుగుతున్నా ను. అంతో ఇంతో సంపాదించగలుగుతున్నాను. ఒకప్పుడు నన్ను చీదరించుకుని అవహేళన చేసినవారే ఇప్పుడు గౌరవించడం మొదలుపెట్టారు అని చెబుతుంటుంది. అందుకే ఎవరినీ మనం అనాలోచితంగా ఒక మాట అనకూడదని, ఎవరి వెనుక ఏ కన్నీటి వెతలు ఉన్నాయో తెలుసుకుని మసలుకోవాలని మహానంద అంటుంటుంది.

- చలన