Others

‘తిత్తికి సమాధానం కత్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలమీద తల్లిదండ్రులకి ఎంత ప్రేమ వుంటుందో నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెళ్లి కావాల్సిన తన కొడుకు నుదుటిమీద ఎత్తుగా, పెద్దగా అందవికారంగా ఉన్న గడ్డను చూసి తల్లిదండ్రులు బాధపడటం సహజం. పెళ్లిచూపులకోసం విదేశాల నుంచి వచ్చిన కొడుకు నుదుటి మీద ఉన్న గడ్డను చూసి ముందు పెళ్లిచూపుల కంటే డాక్టర్ వద్దకు వెళ్లటం మేలని భావించి తండ్రీ కొడుకులు వచ్చారు. ‘‘అసలు ఈ గడ్డ ఏంటి డాక్టర్?’’ అని అడిగాడు. శ్రద్ధగా పరీక్షించిన తరువాత దీనిని ‘‘తిత్తి’’ (CTST) అంటారని చెప్పా.
ప్ర:తిత్తి అంటే?
జ: తిత్తి అనగా రసి వంటి ద్రవం చేరుకునే సంచి.
ప్ర:అసలు ఇది ఎందుకు వచ్చింది?
జ: ఎందుకు వస్తాయి అని చెప్పడం, మీరు అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. చాలా కారణాలు ఉంటాయి. దెబ్బ తగలడంవల్ల, లేక పుచ్చు పన్నువల్ల, లేక చర్మంమీద రంధ్రాలు మూసుకుపోవడంవల్ల- ఇలా చాలా కారణాలు ఉంటాయి. వయసుని బట్టి, వచ్చిన ప్రదేశాన్ని బట్టి, అవయవాలను బట్టి కారణాలు మారుతూ ఉంటాయి. అన్నింటినీ ఇక్కడ వివరించడం కష్టం.
ప్ర:ఇవి నుదుటిమీదే వస్తాయా?
జ: లేదు; శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ముఖానికి సంబంధించినంతవరకు నుదుటిపై కానీ, రెండు కనుబొమలమధ్య కానీ, మెడపై కానీ, చెవి ప్రక్కన కానీ, పెదాలపైనా, నాలుక క్రింద, చిగురులో, ఇంకా క్రింది మరియు పైదవడ ఎముకలో కూడా రావచ్చు.
ప్ర:ఎముకలో కూడా రావచ్చా? వామ్మో!
జ: ఎక్కడైనా రావచ్చు.
చర్మం లోపల రావచ్చు: ఈ రకంలో చాలా ఎక్కువగా కనిపించే తిత్తి పేరు SEBACEOUS తిత్తి. మన చర్మం పొడిబారకుండా ఉత్పత్తి చేసే SEBUM అనే నూనె లాంటి ద్రవం, బయటికి వచ్చే రంధ్రాలు మూసుకుపోయినపుడు చర్మం క్రింద ఓ సంచీ తయారవుతుంది. అందులో ఈ నూనె చేరుకుని తిత్తిలా అవుతుంది.
పెదాలపై రావచ్చు: ఇలా లాలాజం (ఉమ్ము) ఉత్పత్తి చేసే అవయవాలకి సంబంధించి వచ్చే తిత్తి. పళ్లతో పెదాలని కొరుక్కోవడంవల్ల కానీ, పెదాలకి దెబ్బ తగలడంవల్ల కానీ, ఉమ్ము బయటకు వచ్చే రంధ్రాలు మూసుకుపోవడంవల్ల కానీ ఈ తిత్తి రావచ్చు. దీన్ని MUCOCELE అంటారు.
నాలుక క్రింద రావచ్చు: ఇవి కూడా ఉమ్మునీరు ఉత్పత్తి చేసే అవయవాలకి సంబంధించి వచ్చే తిత్తి. దీనిని RANULA అంటారు. ఇది చాలా సందర్భాలలో చాలా పెద్దదిగా ఉండడంవల్ల నాలుక మీదకి వచ్చి మింగడం, మాట్లాడడంలో కష్టం కలిగించవచ్చు. కొన్నిసార్లు ఈ RANULA నోట్లోనే కాకుండా బయటనుండి కూడా గడ్డం వెనకాల భాగంలో ఎత్తుగా, పెద్ద సంచీలా కనిపిస్తుంది. దీన్ని PLUNGING RANULA అంటారు.
4)దవడ ఎముకలో రావచ్చు:ఇవి పంటికి సంబంధించి వచ్చేవి. పంటికి పుచ్చు ఉన్నా (RADICULAR CYST) లేక పన్ను బయటికి రాకుండా ఎముకలో ఉండిపోయినా (DENTIGEROUS CYST), చిన్న పిల్లలలో శాశ్వత పళ్లు బయటికి వస్తున్నపుడు (ERUPTION CYST) ఈ తిత్తులు రావచ్చు.
ప్ర:ఇవి అందరిలోనూ ఊగుతూ, మెత్తగా ఉంటాయా?
జ:చర్మంలో ఉన్న తిత్తి పెరిగిన తరువాత బయటికి ఎత్తుగా కనిపిస్తుంది. రెండు వేళ్లతో ఊపితే ఊగుతుంది. ఒత్తినపుడు గట్టిగా ఉండదు. శ్రద్ధగా పరీక్షిస్తే చిన్ని రంధ్రం కనిపిస్తుంది. అదే తిత్తి ఎముకలో ఉంటే, ఆ ఎముక భాగం ఎత్తుగా కనిపిస్తుంది. తాకితే ఆ ఎత్తు స్పష్టంగా తెలుస్తుంది. కానీ చర్మంలో ఉన్న తిత్తిలాగా ఇది వేళ్ళతో ఊపితే ఊగదు. గట్టిగా ఉంటుంది. వీటికి ఓ ఎక్స్-రే తీసి నిర్థారించుకోవాలి.
ప్ర:మొదటిలో చాలా చిన్నదిగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా పెద్దదిగా మారింది. ఎందుకలా?
జ:బెలూన్‌లోనికి గాలిని ఊదినకొద్దీ దాని పరిమాణం ఎలా పెరుగుతుందో, ఈ తిత్తిలో చేరుకునే ద్రవం ఎక్కువయ్యేకొద్దీ దీని పరిమాణం అలా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా, తిత్తి ఉన్నవారు చెప్పే మాట ఇదే! మొదట్లో వారి తిత్తి చాలా చిన్నదిగా ఉండేది, కాలంతో అది పెరిగి పెద్దదయిందని. ఇలా పెద్దదిగా పెరగడానికి కొన్ని నెలలు లేక కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు.
ప్ర:నాకు అది పెరుగుతున్నపుడు నొప్పి కలగలేదు!
జ:సాధారణంగా ఇవి నొప్పి కలిగించవు. ఒకవేళ తిత్తిలో చీము చేరితే పై చర్మం ఎర్రగా మారి, తాకినపుడు నొప్పి కలిగిస్తాయి. లేకపోతే నొప్పి ఉండదు.
ప్ర:దీనికి చికిత్స ఏంటి?
జ:తిత్తికి చికిత్స కత్తి. కోసి, తిత్తి సంచిని మొత్తం పగలకుండా తీసేయాలి. దీన్నిENUCLEATION అంటారు. తిత్తి చాలా పెద్దదిగా ఉన్నప్పుడు, ముఖ్యమైన నరాలు ఈ తిత్తి పరిధిలో ఉన్నపుడు ఇలా మొత్తం ఒకేసారి కోసి తీయడం సాధ్యంకాదు. అప్పుడు ఈ తిత్తికి ఒక రంధ్రం చేసి ద్రవమంతా బయటికి వచ్చేసిన కొన్ని రోజులకి, ఆ సంచీ పరిమాణం తగ్గినప్పుడు దాన్ని తీసే ప్రయత్నం చేస్తారు. దీన్ని MARSUPIALIZATION అంటారు. చీము నిండిన తిత్తికి కుట్లు వేయరు. సంచీ తొలగించిన తరువాత ఆ గాయం స్వతహాగా మానేలాగా రోజూ కట్టుకడతారు.
ఎముకలో ఉన్న తిత్తిని కూడా పైన చెప్పిన ప్రకారమే తొలగిస్తారు. అయితే ఆ తిత్తికి సంబంధించిన పన్నుకి కూడా చికిత్స చేయాల్సి ఉంటుంది. పుచ్చు ఉన్న పన్నుకి ROOT CANAL TREATMENT చేస్తారు. ఎముకలో ఉండిపోయిన పన్నుని తీసేసే ప్రయత్నం చేస్తారు.
ప్ర:తిత్తి తొలగించిన తరువాత తిరిగి రావడానికి అవకాశం ఉందా?
జ:తిత్తి చికిత్సకి మూల మంత్రం ‘‘సంచీ మొత్తాన్ని తొలగించడం’’. ఒక మిల్లీ మీటరు సంచీని వదిలేసినా తిరిగి మళ్లీ తిత్తి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. దీని ఆపరేషన్ చాలా శ్రద్ధగా చేయాలి.
ఇలా అన్ని ప్రశ్నలకీ సమాధానం పొందిన తరువాత ఆ అమెరికా అబ్బాయి తిత్తి సంచీని తీయించుకున్నాడు. వారానికి కుట్లు తీయడం జరిగింది. నాలుగు వారాలకి నిశ్చితార్థం జరిగింది, పదివారాలకి పెళ్లి జరిగింది.

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

సెల్ నెం: 92995 59615

-డాక్టర్ రమేష్ శ్రీరంగం