శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నాడు కళ కళ.. నేడు వెల వెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 25: ఒకప్పుడు ఏడాది పొడవునా నీటితో కళకళలాడే పులికాట్ సరస్సు నేడు చుక్క నీరు లేక నెర్రెలు బారి వెలవెలబోయింది. ప్రకృతి వరప్రసాదమైన పులికాట్ మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకరంగా మారింది. సరస్సు పేరు మీద సూళ్లూరుపేటలో ప్రతి ఏడాది పక్షుల పండుగ నిర్వహిస్తున్నప్పటికీ సరస్సు అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో 620 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, చిట్టమూరు, వాకాడు మండలాలతో పాటు తమిళనాడులోని ఏళావూరు, గుమ్మడిపూడి, పొనే్నరి తాలుకాలో విస్తరించి ఉంది. సరస్సు తమిళనాడు పరిధిలో లోతు ఎక్కువగాను, మన ప్రాంతంలో లోతు తక్కువగా ఉంటుంది. ఇక్కడ లోతు తక్కువ కావడంతో శీతాకాలంలో పక్షులు వలస వచ్చి విడిది ఉండి మళ్లీ వెళ్లిపోతాయి. దీంతో ఈ ప్రాంతానికి పర్యాటకంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇటు సముద్రం నుంచి ఉప్పు నీరు, కాళంగి నది, పాములకాలువ, కరిపేటి కాలువల నుంచి మంచి నీరు సరస్సులోకి చేరడంతో ఇందులో దొరికే రొయ్యలు, చేపలు, పీతలు రుచికరంగా ఉండి, వీటికి మన ప్రాంతంలోనే కాకుండా విదేశాల్లో సైతం మంచి గిరాకీ ఉంది. సరస్సుపై మత్య్సకారులతో పాటు వేలాది మంది గిరిజన కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు 4 మీటర్ల నుంచి 6 మీటర్ల వరకు లోతున్న సరస్సు నేడు రెండు మీటర్లు మాత్రమే ఉంది. దీనికి తోడు సముద్రం నుంచి పులికాట్‌కు నీరొచ్చే ముఖద్వారాలు ఇసుక మేటలతో పూడిపోవడంతో సరస్సు కేవలం వర్షాకాలంలో మాత్రమే నీరుండి మిగిలిన కాలంలో ఎడారిని తలపిస్తోంది. దీంతో సరస్సుపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులు వలస బాట పడుతున్నారు. ఈ ఏడాడి కూడా పులికాట్ పేరుతో జనవరిలో పక్షుల పండుగ వైభవంగా నిర్వహించారు. పులికాట్‌కు వలస వచ్చే విదేశీ విహంగాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఏటా పక్షుల పండుగను సూళ్లూరుపేట వేదికగా నిర్వహిస్తారు. ఈ సారి కూడా జనవరిలో వైభవంగా నిర్వహించగా, పులికాట్ అభివృద్ధి ఊసే ఎవరు ఎత్తకపోవడం విశేషం. 2001లో తొలిసారిగా పులికాట్‌ను అభివృద్ధి చేసుకునేందుకు పక్షుల పండుగను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 16 సార్లు పక్షుల పండుగ నిర్వహించినప్పటికీ సరస్సు మాత్రం అభివృద్ధికి నోచుకోకపోవడంతో పాలకులు విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు.
పూర్వవైభవం వచ్చేనా..
ఒకప్పుడు ఏడాది పొడవునా నీరుండే సరస్సు నేడు శీతాకాలంలోనే నెర్రెలు బారి ఎడారిని తలపిస్తోంది. ఎట్టకేలకు సరస్సు అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినా ఆ దిశగా పనులు మాత్రం జరగలేదు. వాకాడు మండలం రాయదొరువు, తమిళనాడులోని పళ్లవర్‌కాడు వద్దనున్న ముఖద్వారాలను పూడిక తీయించి ప్రళయకావేరికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రత్యేక నిపుణుల కమిటితో సర్వే సైతం చేయించారు. ఇందుకుగాను ప్రభుత్వం రూ.45 లక్షలు కేటాయించగా, పనులు ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. మూడుమాసాల క్రితం రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శి, తమిళనాడుకు చెందిన ఓ సర్వే సంస్థ, జిల్లా అధికారులు వచ్చి ముఖద్వారాలతో పాటు పులికాట్‌ను పరిశీలించి వెళ్లారు. ప్రస్తుతం పులికాట్ ఎడారిగా మారిపోయింది. ఇందులో వాహనాలు సైతం వెళ్లడం విశేషం. సరస్సుకు పూర్వ వైభవం రావాలంటే ముఖద్వారాలను పూడిక తీయించి సముద్రపు నీరు సరస్సుకు వచ్చేలా చర్యలు తీసుకుంటే ఏడాది పొడవునా పులికాట్ జలకళతో కళకళలాడుతోంది.