ఆంధ్రప్రదేశ్‌

నిర్భయ చట్టం కింద ఇద్దరు యువకుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: ప్రేమ పేరుతో వేధించి, ఓ యువతి ఆస్పత్రిపాలు కావడానికి కారకులైన ఇద్దరు యువకులను నిర్భయ చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నవీన్ అనే యువకుడు తనతో చదువుకున్న యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో నవీన్ కక్ష పెంచుకున్నాడు. జూన్ 1న నీవన్ తన స్నేహితుడైన యశ్వంత్‌తో కలిసి బైక్‌పై వెళుతుండగా ఆ యువతి తన స్నేహితురాలితో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతోంది. నవీన్ బైక్‌తో ఆమె వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ఆ యువతి, ఆమె స్నేహితురాలు గాయపడ్డారు. వెనె్నముకకు గాయం కావడంతో ఆ యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై అలిపిరి పోలీసులు నవీన్, యశ్వంత్‌లను అరెస్టు చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.