తెలంగాణ

డాక్టర్ నిర్లక్ష్యంతో బాలింత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసుపత్రిపై బంధువుల దాడి,ఫర్నిచర్ ధ్వంసం * వైద్యురాలి అరెస్ట్

చౌటుప్పల్, డిసెంబర్ 17: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ప్రశాంతి ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యంతో బుధవారం రాత్రి తంగడపల్లి గ్రామానికి చెందిన బాలింత వెన్‌రెడ్డి శిల్ప (23) మృతి చెందిందన్న వార్తతో ఆగ్రహం చెందిన ఆమె బంధువులు ఆసుపత్రికి దాడి పాల్పడ్డారు. ఇరువర్గాల చర్చల అనంతరం పోలీసులు వైద్యురాలిని అదుపులోకి తీసుకొని ఆసుపత్రిని మూసివేయంచారు. వివరాలిలా ఉన్నాయ. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెన్‌రెడ్డి శిల్ప గర్భం వచ్చినప్పటి నుంచి మండల కేంద్రంలోని ప్రశాంతి ఆసుపత్రిలో చూపించుకుంటోంది. వైద్యురాలి సూచన మేరకు బుధవారం ఉదయం ఆసుపత్రిలో ప్రసూతి కోసం చేరారు. మొదటి కాన్పు సాదారణ ప్రసవమైనప్పటికీ రెండవ కాన్పుకు వైద్యురాలు ఆపరేషన్ చేశారు. అ తర్వాత అనుభవంలేని సిబ్బందితో చికిత్స చేయించారు. శిల్ప పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆపరేషన్ చేసిన అనంతరం శిల్పకు బ్లీడింగ్ అవుతున్నప్పటికీ వైద్యులు పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పినా సిబ్బంది నిర్లక్ష్యం చేశారు. దీంతో పరిస్థితి విషమించింది. అప్పుడు తేరుకున్న వైద్యురాలు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. హయాత్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్సలు చేస్తుండగా మరణించింది. వెంటనే శవాన్ని చౌటుప్పల్‌లోని ప్రశాంతి ఆసుపత్రి వద్దకు తీసుకువచ్చి ఆందోళనకు దిగారు. తంగడపల్లి, మందోళ్లగూడెం గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసుపత్రిపై దాడి చేశారు. ఆసుపత్రి ముందు భాగంలోని గ్రిల్స్‌ను కూల్చివేశారు. ఆసుపత్రి, మెడికల్ షాపు అద్దాలు పగులగొట్టారు. ఫ్యాన్‌లు, కుర్చీలు, బేంచీలను ధ్వంసం చేశారు. తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. సంఘటన ప్రాంతానికి భువనగిరి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌ల నుంచి పెద్ద ఎత్తున బలగాలను రప్పించారు. భువనగిరి డిఎస్పీ మోహన్‌రెడ్డి సంఘటన ప్రాంతానికి చేరుకోని పరిస్థితిని అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. గ్రామస్థులు, బంధువులతో చర్చలు జరిపారు. పోలీసు బందోబస్తుతో డాక్టర్ ప్రశాంతిని పోలీసులు అదుపులోకి తీసుకోని రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న రోగులను ఇతర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రశాంతి ఆసుపత్రిని మూసివేశారు. శవాన్ని పోస్టుమార్టంకు హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకోని డిఎస్పీ మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో సిఐ శివరాంరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.