ఆంధ్రప్రదేశ్‌

కెసి కాలువ రైతాంగానికి మళ్లీ నీటి కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతరు..
* ఆందోళనలో కడప జిల్లా ఆయకట్టుదారులు
కడప : కర్నూలు- కడప కాలువకు ఎగువ ప్రాంతం నుంచి సంబంధిత అధికారులు నీటి సరఫరాను నిలిపివేయడంతో కడప జిల్లాలో రబీ కింద సాగు చేసిన పంటలన్నీ నిట్టనిలువునా ఎండుతున్నాయి. 45 రోజుల క్రితం ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన సందర్భంగా కెసి రైతులకు పూర్తిస్థాయిలో నీరు ఇస్తామని, ఒక ఎకరా పంటను కూడా ఎండనివ్వనని ముద్దనూరు బహిరంగ సభలో ప్రకటన చేశారు. అయితే సంబంధిత అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలను బేఖాతరు చేస్తూ వారం రోజుల క్రితమే కర్నూలు జిల్లా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని నిలిపివేశారు. కెసి సాగులో కర్నూలు-కడప జిల్లాలకు నీరు సమభాగాల్లో రెండు జిల్లాలకు ఇవ్వాల్సి ఉంది. కర్నూలు జిల్లా రైతాంగానికి మాత్రం వచ్చే నెల 15వ తేదీ వరకూ నీరు ఇస్తామని అధికారులు గడువు పొడిగించారు. వైఎస్సార్ కడప జిల్లాకు మాత్రం నీటి సరఫరాను నిలిపివేశారు.