ఆంధ్రప్రదేశ్‌

కిర్లంపూడికి ముద్రగడ తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి ఆరుగురిని అమలాపురం పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్‌లో బైఠాయించిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను పోలీసులు కిర్లంపూడికి తరలించారు. కేసులు రైల్వేశాఖ పరిధిలో ఉన్నాయని చెబుతున్న స్థానిక పోలీసులు అరెస్టులు ఎలా చేస్తారని ముద్రగడ స్థానిక డిఎస్పీతో వాదనకు దిగారు. అరెస్టు చేసినవారిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తనను కూడా అరెస్టు చేయాలంటూ ఆయన పట్టుబట్టడంతో పోలీసులు ముద్రగడను బలవంతంగా వ్యాన్ ఎక్కించి కిర్లంపూడిలోని ఆయన ఇంటి వద్ద విడిచిపెట్టారు. కాగా, అమాయకులను అరెస్టు చేయడం అన్యాయం అంటూ ముద్రగడ అభిమానులు, కాపు ఉద్యమ కార్యకర్తలు అమలాపురం పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు.