ఆంధ్రప్రదేశ్‌

దీక్ష విరమించిన ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తుని విధ్వంసకాండలో అరెస్టులకు నిరసనగా గత 13 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బుధవారం మధ్యాహ్నం తన ఆందోళనను ముగించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కిర్లంపూడిలోని తన ఇంటికి చేరుకున్నాక ఆయనకు కాపుసంఘాల ఐకాస నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తనపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరించిందని ఆరోపించారు. తన కుమారుడిని పోలీసులు కొట్టారని, భార్య, కోడలిని దుర్భాష లాడారని, అయినప్పటికీ ప్రభుత్వంపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు. ముద్రగడ ఇంటికి చేరుకున్న సందర్భంగా కిర్లంపూడికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.