సంపాదకీయం

మోదీపై కెటిఆర్ అసహనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయుత చండీయాగానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకాకపోవడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తనయుడు, ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు అసహనంతో ఉన్నట్టుగా అగుపిస్తోంది. యాగం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని కెటిఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ప్రధాన మంత్రి మోదీ ఒరగబెట్టింది ఏమీ లేదని, పిలిచినా ఆయన రాష్ట్రానికి రావడం లేదని మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కెటిఆర్ విమర్శించారు. తెలుగు రాష్ట్రాలకు పిలిచినా రావడం లేదన్న కెటిఆర్, దేనికి రావడం లేదో స్పష్టంగా చెప్పకపోయినా, యాగానికి రాలేదని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా యాగానికి రాష్టప్రతిని, ప్రధానిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి యాగానికి వస్తారని ఆశించినప్పటికీ ఆయన రాలేదు. అయితే చండీయాగాన్ని అద్భుతంగా నిర్వహించారని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అభినందిస్తూ లేఖ రాసి ప్రధాన మంత్రి సరిపెట్టుకున్నారు. ఇది మంత్రి కెటిఆర్‌కు నచ్చినట్టు లేదు. ఇటీవల ప్రధానిపై అదే పనిగా మంత్రి కెటిఆర్ విమర్శలు చేయడం వెనుకనున్న ఆంతర్యం ఇదన్న మాట.
- వెల్జాల చంద్రశేఖర్

దొంగ - పోలీసు
దొంగ - పోలీసు ఆట భలేగా ఉంటుంది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించడం సహజం. కానీ పంజాబ్‌లో ఓ పోలీసు ఉన్నతాధికారి కారులో వెళుతుండగా, గురుదాస్‌పూర్ ప్రాంతం వద్ద దుండగులు అటకాయించారు. మారణాయుధాలు చూపించి ఆ ఎస్‌పిని, కారు డ్రైవర్‌ను దించేసి ఎంచక్కా ఆ కారుతో ఉడాయించారు. సదరు ఎస్‌పి చేసేది లేక స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా కొంత సేపటి తర్వాత దండగులు ఎందుకైనా మంచిదని భావించారేమో ఓ అటవీ ప్రాంతం వద్ద కారును వదిలేసి అడవిలోకి పారిపోయారు.
- వి. ఈశ్వర్ రెడ్డి

నారాయణ స్టెప్పులు
చికెన్ నారాయణ అంటూ కొంత కాలం పేరు తెచ్చుకున్న సిపిఐ నాయకులు నారాయణ ఇప్పుడు స్టెప్పులేస్తున్నారు. హుస్సేన్‌సాగర్ బోట్‌లో ఒక పాటకు ఆయన స్టెప్పులేసి పార్టీ నాయకులందరినీ సంతోషపెట్టారు. ఏ ఎన్నికల్లో అయినా వామపక్షాలకు అడ్రస్ లేకుండా పోతోంది. మరి మీడియాలో కనిపించాలంటే ఇలాంటి ఏదో ఒక జిమ్మిక్కు చేయక తప్పదు అని సమర్ధించుకుంటున్నారు ఆ పార్టీ నాయకులు. వివిధ ఛానల్స్‌లో తమాషా కార్యక్రమాల్లో హైలెట్ కావాలంటే ఇలాంటివి తప్పదు అంటున్నారు.
- మురళి

పొంగుతున్న ప్రేమలు
నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్ధకు ఎన్నికలు సమీపిస్తుండడంతో, కొన్ని వార్డుల్లో అధిక సంఖ్యలో ఇక్కడ స్ధిరపడిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు కసరత్తును ముమ్మరం చేశాయి. ఇప్పుడు ఇక్కడ స్ధిరపడిన సీమాంధ్రప్రజల సంక్షేమం, అభివృద్ధిని మేమే చూస్తామంటే, మేమే పరిరక్షిస్తామంటూ అధికార, విపక్ష పార్టీలు పోటీలు పడి ప్రకటనలు గుప్పిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఎడాపెడా విమర్శలు గుప్పించిన అన్ని పార్టీలు ఈ రోజు ఆకస్మాత్తుగా గొంతు మార్చి ప్రేమను ఒలకపోస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల్లో ఓటర్లకంటే ప్రేమలు పొంగుతున్నాయి. ఇదంతా చూసి ఇక్కడ సెటిలైన వారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. రాజకీయ పార్టీల పొంగుతున్న ప్రేమను చూసి తట్టుకోలేకపోతున్నారు.
- శైలేంద్ర

శత్రుత్వం వీడి..
తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు కెసిఆర్-చంద్రబాబు ఈ మధ్య వీలైనప్పుడల్లా కలిసి ఏవో అంశాలపై చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఈ ఇద్దరు నాయకులు శత్రువుల్లా ఒకరిపై మరొకరు నిప్పుల వర్షం కురిపించుకున్నారు. 2014 జూన్ 2 న రెండు రాష్ట్రాలు ఏర్పడి, ఇద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించాక సీన్ మారింది. నిరంతరం పరస్పరం కొట్లాడుకునే కంటే ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనుకున్నారేమో ఒకరి నొకరు ఏదో కారణంగా ఆహ్వానాలు అందించుకుని కలవడం మామూలైంది. వీరి కలయిక మీడియాకు పండగగా ఉంటోంది. ఇద్దరు చంద్రుల నిర్ణయాలను, సుహృద్భావ భావనలను రెండురాష్ట్రాల ప్రజలు ఆహ్వానించడం శుభపరిణామమే.
- పి.వి. రమణారావు