తెలంగాణ

పాలకపక్షంలో ఎర్రబెల్లి, సాయన్నకు సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగో వరుసలో రేవంత్ ఉప ప్రతిపక్షంగా ఎంఐఎం?
హైదరాబాద్, మార్చి 11: తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షంలో తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం విలీనం కావడంతో శాసనసభలో సభ్యుల సీట్లలో మార్పులు, చేర్పులు జరిగాయి. సభలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉన్న టిడిపికి వారి తర్వాతి వరుసలో గతంలో సీట్లను కేటాయించారు. అయితే టిడిపి సభ్యులు 12 మంది టిఆర్‌ఎస్‌లో చేరడంతో వారికి పాలకపక్షం టిఆర్‌ఎస్ సభ్యులతో పాటు రెండవ వరుసలో సీట్లు కేటాయించారు. టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన సభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సాయన్న, టి ప్రకాశ్‌గౌడ్‌కు సీట్లు కేటాయించారు.
టిడిపికి ఇక సభలో మిగిలింది ముగ్గురు సభ్యులు మాత్రమే కావడంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఆ తర్వాత వరుసగా ఎక్కువ సభ్యులు కలిగిన ఎంఐఎం, బిజెపిలకు కేటాయించి నాలుగవ వరుసలో టిడిపి సభ్యులు రేవంత్‌రెడ్డి, ఆర్ కృష్ణయ్యకు సీట్లు కేటాయించారు.
అయితే సండ్ర వీరయ్యకు మాత్రం పేరులో మొదటి అక్షర క్రమం ప్రకారం మూడవ వరుసలో సీటు లభించింది. ఇలా ఉండగా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌కు సభలో స్థానం లభించగా, వారి తర్వాత ఎక్కువ సభ్యులుగా కలిగిన ఉప ప్రతిపక్షంగా టిడిపికి అవకాశం ఉండేది. అయితే 12 మంది టిడిపి సభ్యులు టిఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో సభలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం తర్వాత స్థానం ఎంఐంఎంకు, ఆ తర్వాతి స్థానం బిజెపికి, ఆ తర్వాత ముగ్గురు సభ్యులు కలిగిన టిడిపి నాలుగవ స్థానానికి పడిపోవడం విశేషం.