తెలంగాణ

వైద్యపరీక్షలకు భరతసింహారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థి దేవీరెడ్డి కారు ప్రమాదంలో మరణించడానికి కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె స్నేహితుడు భరతసింహారెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు సోమవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరు పరుస్తారు. కోర్టు ఆదేశిస్తే గనుక నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలిస్తారు. మద్యం మత్తులో కారు నడపి దేవీరెడ్డి మృతికి కారకుడయ్యాడని భరతసింహారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కారు ప్రమాదంలో గాయపడడం వల్లే దేవీ రెడ్డి మరణించిందని, ఇతర కారణాలేమీ లేవని నగర పోలీసు కమిషనర్ ప్రకటించారు.