మెయిన్ ఫీచర్
ఆహా.. ఓహో.. రికార్డులు అదుర్స్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మన టాలీవుడ్ హీరోల చిత్రం విడుదల అనగానే జరిగే హంగామా, మితిమీరిన మీడియా అంచనాలు చూసేవారికి నవ్వుతెప్పిస్తున్నాయ. అభిమానుల హద్దుమీరిన అభిప్రాయాలు మరింత నవ్వుల్లో ముంచెతు తతున్నాయ. నటులు ఒకరిని మించి మరొకరు గొప్ప అన్న అహంభావం వున్నందువల్ల జరిగేతంతు సైతం నవ్వు లాట గానే వుంది. ఫలా నా హీరో చిత్రం హక్కులు ఇన్ని కోట్లు, శాటిలైట్ హక్కులకు ఇన్ని కోట్ల వ్యాపారం జరిగిందని చిత్రం విడుదలకు ముందే మీడియా గెంతులు వేస్తూ చెబుతోంది. ప్రపంచ వ్యాప్తం గా వేల థియేటర్లలో చిత్రం విడుదల
కానుంది అంటూ అదేదో గొప్ప అంటూ ప్రకటించుకోవడం, పిదప ఓవర్సీస్ కలెక్షన్లు ఇన్ని కోట్లని కాకిలెక్కలు చెప్పడం మనం చూస్తూనే వున్నాం. మరో నెల రెండు నెలలకు మరో హీరో చిత్రం విడుదల సన్నాహాలు ప్రారంభం కాగానే, ముందు హీరో చిత్రం విడుదల లెక్కలను మించి, చిత్ర హక్కులకిన్ని కోట్లు, శాటిలైట్ హక్కులకు ఇన్ని కోట్లు, ఆ పిదప వసూలు ఇన్ని కోట్లని ఎక్కువ చెప్పుకోవడం అందరం వింటున్నాం, చూస్తున్నాం. తద్వారా ఫలానా హీరో కంటే మా హీరో గొప్పవాడు, వసూళ్లు, థియేటర్లు కూడా ఎక్కువే అంటూ సొల్లు కబుర్లు చెప్పుకోవడం చూస్తున్నాం. మీడియాకు, అభిమానులకు అర్థంకాని విషయమేమిటంటే చిత్రంపై నెగెటివ్ టాక్ రాకముందే పెట్టుబడి, లాభం మూటగట్టుకోవాలన్న ధ్యేయం కన్పిస్తోంది. అది వ్యాపార లక్షణం. అందుకే ఈ ఓవర్సీస్, వేల థియేటర్లు, చిత్రహక్కులు, శాటిలైట్ హక్కులంటూ నాటకానికి తెరతీస్తున్నారన్నది వాస్తవం. అలా అనవసర హంగామా చేసినందుకే స్పైడర్, పైసా వసూల్, కాటమరాయుడు, తుపాన్, లయన్, సర్దార్ గబ్బర్‌సింగ్, తాజాగా అజ్ఞాతవాసి లాంటి అనేక చిత్రాలు అడ్రస్ లేకుండా గల్లంతయ్యాయ. మరో విచిత్రమేమంటే మన మీడియా ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని థియేటర్లని డబ్బా కొడుతోంది. ప్రపంచంలో 204 దేశాలుంటే, పది దేశాలలో చిత్రం విడుదల చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా అని చెప్పడం వింతకాదా? మరో వింత- విదేశాలలో టికెట్ ధర 30 డాలర్లంటే మన రూపాయలలో 2వేలు,
50 డాలర్లంటే 3,500లు అవుతుంది.
ఆ లెక్కన పనికిమాలిన చెత్త చిత్రానికి సైతం వారం పది రోజు ల్లో కోట్ల ఆదాయం వస్తుంది.
అదే మన రెండు రాష్ట్రాల్లో టికెట్ ధర రూ.1000, 2వేలు, 3వేలు పెడితే పది రోజులకు కోట్లు రాక ఏమవుతుంది? అదేమంత గొప్పకాదే. దానికోసం ఇంత బిల్డప్ చూస్తుంటే నవ్వు రాదా? అదండీ ఈ కోట్ల వసూళ్ల చిదంబర రహస్యం. నిజం చెప్పాలంటే హాలీవుడ్ చిత్రాలను మనమెంతవరకు చూస్తున్నాం. మన జనాభాలో పదిశాతంమంది ప్రేక్షకులు కూడా హాలీవుడ్ చిత్రాలు చూడరు. మన డిస్ట్రిబ్యూటర్ల, థియేటర్ల యాజమాన్య చేతివాటం తెలుసు కనుక (టికెట్లు చించరు, డబ్బు వసూలు చేసుకుని నేరుగా థియేటర్లలోకి పంపిస్తారు, ఆదాయపుపన్ను కట్టకుండా దొంగ లెక్కలు చూపిస్తారు, దొంగ కలెక్షన్లు చూపిస్తారు) మన దేశ వసూళ్లపై ఆలోచించదు హాలీవుడ్, ఆశపెట్టుకోదు. అలాగే ఆలోచిస్తే వున్న మన దేశస్థులు అంటే ఎన్ఆర్ఐలు 2 లేక 3 శాతం వుంటున్నారు. మరి మన బ్లాక్‌బస్టర్ చిత్రాలను చూసేదెవరు? ఆ 2 లేక 3 శాతం ఎన్ఆర్ఐలు చిత్రం చూసినంత మాత్రాన కోట్లు వసూళ్లు వస్తాయా? నమ్మేదేనా? అక్కడ వున్న అనేక భాషల కోట్ల ప్రజలు భారతదేశంలో ఏ మూలో వున్న టాలీవుడ్ చిత్రాలు చూస్తారా? నమ్మేదేనా? అంతా డ్రామా అనిపించదా? ఈ హద్దులు మీరిన హంగామా, కాకిలెక్కలు నిజమనిపిస్తాయా? విదేశాలలో మన చిత్రాలు చూసే ప్రేక్షకులున్నారా? ఈ కోట్ల వసూళ్లు, వేల థియేటర్లు హీరో కోసం, వారి అభిమానుల కోసం మీడియా చేసే హంగామే ఇది. ఇదంతా నమ్మి అభిమానులు ‘అహా.. ఓహో రికార్డులు అదుర్స్, గిన్నీస్ బుక్’ అంటూ పగటి కలలు కనడం అంతా డ్రామా అని తెలిసికోలేక పోవడం వారి ఆవేశానికి నిదర్శనం. చిత్రం విడుదల హంగామా చిత్రం ఫ్లాఫ్ అయిదంటే అభిమానులు, మీడియా వౌనం వహిస్తుంది. విడుదలకు ముందు డబ్బా కొట్టి తర్వాత చిత్రం ఫ్లాప్కాగానే వీరంతా ఎక్కడుంటారో తెలియదు. చిత్రం విడుదలై విజయం సాధిస్తే హంగామా చేయవచ్చు. కాకిలెక్కలు చెప్పవచ్చు, చరిత్ర సృష్టించినదని చెప్పవచ్చు. గిన్నీస్ బుక్ వారు వచ్చి పరిశీలించి, నిజమని నమ్మి సర్ట్ఫికెట్ ఇచ్చారని పచ్చి అబద్ధాలు చెప్పినా నమ్మవచ్చు. అలా కాకుండా చిత్రం గురించి ఏమి తెలియకపోయినా వంద రోజులు, 200 రోజులు, అదుర్స్ రికార్డ్స్ అంటే ఎవరు నమ్ముతారు? మీడియా చేసే ఉత్తుత్తి హంగామా చూసి అభిమానులు నమ్మి కాలరెగరేయడం హాస్యాస్పదం కాదా? కోట్ల వసూళ్ల క్లబ్‌లు, వేల థియేటర్లు, ప్రపంచ వ్యాప్తంగా విడుదల, రోజుకు పది ప్రదర్శనలు, చరిత్ర తిరగవ్రాసింది, గిన్నిస్ బుక్ వారు ధృవపత్రం ఇచ్చారు (బోగస్) అని యాగీ చేయడం సంతోషమే. మరి అంత గొప్ప చిత్రాలు ఎక్కడైనా చలన చిత్రోత్సవాలకు ఎంపిక అయ్యాయా? అవార్డు అందుకున్నాయా? మేధావుల ప్రశంసలు అందుకున్నదా? ఆస్కార్ మొదటి ద్వారం వరకైనా వెళ్లాయా? ఎక్కడ అలాంటి అవార్డు రివార్డు, ప్రశంసలు అందుకోలేని చిత్రాలకు అంత హంగామా అవసరమా? డబ్బా- సుత్తి- ఊకదంపుళ్లు అవసరమా? ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన అవతార్, టైటానిక్, స్టార్‌వార్స్ లాంటి చిత్రాలకు హంగామా చేసినా అర్థముంటుంది. ఓ గ్లాడియేటర్, ఓ రాంబో, ఓ రాకి, ఓ కానన్, ఓ జేమ్స్‌బాండ్, ఇండియానాజోన్స్ చిత్రాల హీరోలపై ప్రశంసలు కురిపించినా అర్థముంటుంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లేని మన హీరోల కోసం అంత హంగామా అవసరమా? నిజంగా సత్తా వున్న చిత్రాలను మెచ్చుకోవలసిందే. ఏమీ లేని చిత్రాలను (ఘోర ఫైట్లు, పిచ్చిగెంతులు తప్ప ఓ నీతా, సందేశమా?) అలా పొగడడం, ఆకాశానికెత్తడం, హంగామా చేయడం అటు మీడియా ఇటు అభిమానులు మానుకుంటే తప్ప టాలీవుడ్ బాగుపడదు. అంతవరకు ఏఎన్నార్, ఎన్టీఆర్ అని గుర్తు చేసుకోక తప్పదు, ఏమంటారు?!