మెయిన్ ఫీచర్

తరాలు మారినా తరగని వెతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దళిత, బహుజనులంటే సమాజంలో అణచివేయబడ్డవారు. వాడు శ్రమచేసి దొరల బంగ్లాలు కడ్తారు. వారి ఇండ్లను శుభ్రంచేస్తాడు. వాడి శ్రమతోనే దొరల పొలాలు పచ్చదనాన్ని సంతరించుకోగలవు. మానవ నాగరికతకు వాడు మూలవాసుడైన వానికి పట్టెడన్నం కరువు. దొరలిండ్లల్లో దళిత స్ర్తిలు అరవ చాకిరి చేస్తారు. వడ్లను చెరిగి రాళ్ళు లేకుండా చేస్తారు. వడ్లను దంచి దొరలకు సన్నబియ్యం అందించిన చేతులవి. వాడు శ్రమపడి దొరల పాదాలకు ముల్లు గుచ్చకుండా, మట్టి అంటకుండా చెప్పులు చేస్తాడు. వాడు దళితుడు, వాడు అంటరానివాడు, వడ్లు చెరిగినపుడు, బియ్యం దంచినపుడు రాని అంటరానితనం బుక్క నోట్లకు జారేప్పుడు ఎక్కడినుంచి వచ్చింది. మానవ నాగరికతకు మార్గం చూపిన మూలవాసులు, వృత్తి కులాలు సమాజంలో చిన్నచూపునకు గురవుతున్నారు. తమను సాటి మనిషిగా చూడమని వాళ్ళు ఉద్యమిస్తున్నారంటేవారు ఎంత బాధలకు గురవుతున్నారో తెలుస్తుంది.
పనితనంగా ఏర్పడిన కులం మానవ సమాజంలో క్రొత్త పుంతలు త్రొక్కింది. తక్కువ కులాలని, ఎక్కువ కులాలని బేధభావం చూపెట్టారు.
సోమరిపోతుల సమాజం ఉన్నత వర్ణంగా, కూటికి లేనివాడు కూలీగా, శ్రమశక్తితో ఈ ప్రపంచాన్ని నిర్మించేవాడు హీనంగా చూడబడుతున్నాడు. ఎంత శ్రమపడ్డా కూటికి, గూటికి లేనివాడు, చదువు సంధ్యలకు నోచుకోనివాడుగా మారిపోయాడు. వాని రెక్కల కష్టం లేకుండా ఈ సమాజం నిలబడుతుందా? ఈ సమాజం వాడికేమిచ్చింది. అవమానాలను, అవహేళనలను అందించింది. చిన్న కులస్థులుగా చూడబడే దళితులు ఎదురుమాట్లాడవద్దు అనేది ఉన్నత కులస్తుల భావం. దీన్ని ధిక్కరిస్తే ఎన్ని హత్యలు చేశారో, ఎంత రక్తపాతాన్ని వెదజల్లారో, అందుకే రక్షించేవాడులేని కులాలు తమ ఆత్మాభిమానాన్ని నిలుపుకోవడానికి ఉద్యమించారు. ఉద్యమి స్తున్నారు.
మాదిగ ఓ మాలన్న ఈ ఘోరమేందిరో
ఈ దూరమేందిరో
పొగరుబోతు మానువాదుల పొతం పట్టరో
పోరుదారి నడవరో22
అంటరానితనంతో అవమానాలు ఎదుర్కొని వెట్టిచేయడం కడుహేయం, అందుకే నడుం బిగించమంటున్నాడు. నీతి నిజాయితీలేని సమాజంలో తిరుగుబాటే మార్గం ఇంతకన్నా మరో దారిలేదు.
3గుడిలో దేవుడికి సేవలు చేసేది మనం. ఆ గుళ్ళను అందంగా రంగులద్ది తీర్చిదిద్దేది మనం. మన శ్రమలేకుంటే దేవునికి నైవేద్యం ఎక్కడిది.
గుళ్ళు కట్టి రంగులద్ది- గుళ్ళోదేవున్నిబెట్టి
పండుగనాడు పబ్బంనాడు-
పచ్చపచ్చని పందిరి లేసి
మొక్కుకున్న మొక్కులిడిసి- మొక్కబోతరా
ముట్టరాని కులంనీది- మొక్కబోతరా
ముట్టరాని కులం నీది- మొక్కొదన్నరా22 ॥
ప్రతి శ్రమలో మనమైవాడి ఉన్నతికి కారణమైనా! మనకేం మిగిలింది. మనం అంటరాదు. ఇదేనా మనం వాడినుండి పొందిన ఆదరాభిమానం, కృతజ్ఞతహీనులైన వారిపై మనం తిరుగబడాలే.
కులమును పట్టించెటోన్ని-
కులాల దన్ని తీరాలంటే
మాల మాదిగన్నలంత- వౌనాన్ని విడనాడి
కుల నిర్మూలనకై నువ్వు- కయ్యమాడురలో
మనువాదాల రాజ్యాన్ని కూలదోయరో22 ॥
కులం రంగు పులిమిన సమాజంపై తిరగబడి కుల నిర్మూలనకై పాటుపడాలి.
ఈనాడు మనిషి-మనిషికి మధ్య అనుబంధంలేదు. ప్రేమభావాలు అసలే లేవు. యజమాని సేవకు అనే తలంపు ఉన్నది. ఎన్ని సేవలుచేసినా ఏం ప్రయోజనం అంటున్నాడు నాసరయ్య.
దొరకు కుక్కపిల్లకు మధ్యనున్న ఆ బాంధవ్యం మనలోలేదు. మన సేవలు వాడికి కావాలి. వాడుపెట్టే హింసలు మనం భరించాలి. ఇదీ మానవత్వమా అంటున్నారు.
కుక్కపిల్లా చూడు- పొట్టెట్లనింపిందో
పాల బిస్కెట్లతో- పచ్చిమాంసం తింటే
నే పొద్దంతా పనిచేస్తే- పొట్ట నిండకపోయె22గడియ రికాం లేదు. గవ్వ యింటికి రాదన్నట్లు, ఆరుగాలం కష్టపడ్డా పొట్టగడువని బ్రతుకని చింతిస్తున్నాడు.
కక్షకట్టిన బ్రహ్మ-పిచ్చి వ్రాతవ్రాసే
కుక్కపిల్లకన్నా- క్రూరమైన బ్రతుకు
నా బ్రతుకు చూసిన కుక్క ఎక్కిరించసాగె22
కుక్క బ్రతుకే నయం. అది దొరను ఆడిస్తుంది, పాడిస్తుంది. ఇంత హీనమైన బ్రతుకు మరోటిలేదని తనలోతనే కుమిలిపోతున్నాడు.
ఎట్టి కష్టముచేస్తే- పొట్టనిండకపోయె
తిండి దొరకక-కడుపు తొండమొలెండింది
ఏ కష్టమెరుగని దొర-కడుపెట్ల పెరిగింది22
దొరకు తిండియెక్కువై బొర్ర పెరుగుతుంది. తనకు తిండిలేక కడుపు ఎండుకపోతుందని, మానవత్వంలేని దొరలు మంటగలిసిపోను అని దళితుడు ఆవేదనతో అరుస్తున్నాడు.
దళితులపై దాడిని బండారు నర్సింహులు గేయరూపంలో అగ్రవర్ణ కుట్రలను, వారి వక్రబుద్ధిని, కుటిల నీతిని వివరించాడు.
దళితులపై దాడి సూడన్నో ఈ దేశమూలో
దమనకాండలు దండిగాయన్నో22
దాడులు, దమనకాండలు, అగ్రవర్ణాలవంతయింది. మాట్లాడితే తిరుగుబోతుగా తలుస్తారు. కారంచెడులో ఇదేందన్నందుకు దౌర్యన్యం చేశారు.
తాగే మంచినీళ్ళ చెరువులో
గొడ్డుగోదల కడుగుతుంటే
ఇది ఏమి న్యాయమని
నిలదీసి దొరలను అడిగినందుకు
మాదిగ .......
మమ్ములడిగే దైర్యమొచ్చని
కమ్మదొరలు బదురుకున్నారో కారంచేడులో
మాదిగాలపై దాడి చేసిండ్రో
ఆ పల్లెవల్లకాడు చేసిండ్రు22
చుండూరులో దళితులపై దాడి జరిగింది. పాశవికంగా చంపివేశారు. తప్పేందంటే గిదేందన్నందుకే... మదమెక్కిన... దొరల కుతంత్రాలకు దళితులు బలైపోయిండ్రు.
కాళ్ళకాడ ఏళ్ళకాడ
బాంచెన్ అంటూ బతికేటోల్లు
.....
మాకు ఎదురుంగొస్తిరాని
ఏటి .......
ఏమినిల్గుడు వచ్చెనాని
దొంగచాటుగా దాడిచేసిండ్రో
చుండూరు ......
వెంటబడి సంప్రిండ్రో
మూటగట్టి తుంగభద్రలేసిండ్రో22
ఎవడి చేతిలో ఈ ప్రపంచం అందంగా సృష్టించబడుతుందో, ఎవడి శ్రమతో వెలుగుల మధ్య జీవిస్తున్నాం. వాడే మనకు అంటరానివాడు, ముతక బట్టకు మర్యాద లేకుండా పోయింది. కష్టించేవాడికి కష్ట్ఫలితం అందకుండా పోతుంది. వాడిపైనే దాడుల ఈ కుతంత్రాలు లోకంలో దళితులపై దాడులు, హింసాత్మక చర్యలు దేశమంతా విస్తరించినవి. ఒక రూపంనుండి హింస మరో రూపంలోకి.
బీహారు రాష్టమ్రుల్లో
నీళ్ళుమాదని నిప్పుమాదని
నిలదీసి దొరల నడినందుకు
.... ..... ... .... .... .... ...
దళితులను పట్టుకొని
అరవై మందిని నరికి సంప్రిండ్రో రక్తం
కడుపునిండా తాగి మురిసిండ్రో22
దళితుడు బాంచెన్ బ్రతుకు బ్రతకాల్సిందేనా? ఎన్నో వృత్తుల్లో నైపుణ్యం సాధించి ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినవాడు కుమిలి ఏడ్వవలసిందేనా? అయ్యో పాపం అనే వాళ్ళు లేరా? బహుజనులను దళితులను కలగలిపి అణగద్రొక్కినారు.
కుమ్మరోల్లు, కమ్మరోల్లు/ సాకలోల్లు మంగలోల్లు
సాలోల్లు యానాదోల్లు/ గొల్లోల్లు, గౌండ్లోల్లు
మాలోల్లు, మాదిగోల్లు/ బెస్త, బోయి, ముదిరాజులు
మేదరోల్లు, ఎరుకలోల్లు/ ఎనకబడ్డ కులపోల్లమంత
ఏకమై దారికాస్తాం22
అన్ని వృత్తికులాలు ఐకమత్యంతో ముందుకురావాలి. కలిసుంటే కలదు సుఖం. అందుకే మనమంతా ఐక్యం కావాల్సిన అవసరమున్నది.
3పుట్టినావు మాకులాగే - గేయంలో మాష్టార్జీ అగ్ర వర్ణ దురహంకారాన్ని నిలదీస్తున్నాడు.
పుట్టి మాకులాగే
ముట్టునుండి వున్నకొడుక
పట్టుకొని రాలేదని
కన్నతల్లి కడుపునుండి... మరి?
కలిమి నీకు ఎట్లకలిగెనో ఓరున్నోడా
లేమి మాకు ఎట్టదక్కెను?
కష్టం మాది సుఖం నీదెట్లయింది. ఎంత మోసం కష్టపడువానికి బతుకు లేకుంటయిందని బాధపడ్తున్నాడు.
పుట్టనప్పుడు నీకు- కట్టుబట్టలేకుంటే
కష్టపడి నేసి ఇచ్చే- మా యన్న పద్మశాలి
వట్టిబట్టుతో నీవోల్లు- దామరకుంటే
మట్టగాను కుట్టి ఇచ్చే మాయన్న దర్జన్న22
బట్టనేసిది మేం, ఆ బట్టలను కుట్టిచ్చేది మేం,
చివరికి మాకే కట్టుబట్టలేదని అంటున్నాడు.
నేసినోళ్ళు కుట్టినోళ్ళురో ఓరున్నాడ
వేసుకోను బట్టలేకరో/ మాసిపేల్క లేసుకుంటెరో22
నువ్వు మాత్రం అందమైన బట్టలేసుకొని
షోకు సాన జేస్తున్నవో!
మీ రాజసానికి, మీ అందానికి బట్టలద్దిన వాళ్ళం మమ్ము మా శ్రమను మర్చిపోయి అహంకారానికి గురౌతున్నారు. మేం మీ కన్నులకు కన్పించడం లేదా?
ఊరిసాకలోల్లబిల్సి- ఉత్కుమాని తర్ముతావు
సాకలన్న సెరువుకెల్లి- కమ్మరన్న పాత్రలోన
కుమ్మరన్న జేసినట్టి- కుండతోటి నీళ్ళుబట్టి
నీళ్ళుబట్టి నానబెట్టి- వొడ్డెరన్న బండమీద
సాటివాడు కార్మికన్న-చేసినట్టి సబ్బుతోటి
ఉత్కినీకు తెల్లాగిస్తిరో22
తెల్లని బట్టలు, కూసుండ కుర్చీలు, పండుకొను కోలమంచాలు, తినకంచాలు, మీ దొరసాన్లకు రంగు రంగుల చీరెలు- సారెలు ఎవరు జేసిండ్రు ఎవనికట్టంతో రూపొందినది.
పొద్దుగాల లేసి నీవు- రాత్రిరంగులాడేదాక
పనికివచ్చే వస్తువల్ల- పుట్టలేదు గాలినుండి
పాసు దీసెటూతుపేస్పుండ్లుదోమె తెల్లబ్రషు
రాసుకునే రంగుజర్ద
పూసుకునే సెంటునూనె/ పూటపూట మెక్కెకూడు
మాట, మాటకొచ్చె డబ్బు
కోట్లకొద్దీ ఆస్తులున్నా- తూట్లుబడే సంపదంతా కార్మికుల కష్ట్ఫలితమే22
దోపిడీ దౌర్జన్యాలతో అన్యాయంగా సంపాదించిన సంపదనీది నీతి నిజాయితిని నమ్ముకున్న కష్టం మాది. మాకు కన్నీరు, నీకు పన్నీరు ఇది జరుగుతున్నదే కదా! ఇక చూడు నీ ఖజానాను కదిలిస్తాం. ఇజాలను మారుస్తాం అని కష్టజీవలు ప్రతినభూనుతున్నారు.
వెనుకబడ్డ కూలన్నలనంత కూడగట్టుదాం
బ్రహ్మవీరునితో మనపోరు ముడిపెట్టుదాం
దళితులంత దండుకట్టి రాజ్యమేలుదాం
మన బతుకిచ్చిన భూతల్లిని విడిపించుకుందాం ఎంత కాలమని మనం దుఃఖమును గుండెలో దాచుకోవాలి. మన కడుపున పుట్టిన వారికి కాసింత బ్రతుకునివ్వలేని వారమవుతున్నాం. భూతల్లి వారి చెరలో ఉంది. మనం ఆ తల్లికి సేవలు చేస్తున్నాం బిడ్డలారా! అది ఫలితాన్నిస్తే వాడందుకుంటున్నాడు. మనమెందుకు మనముందు తరాలకు దారిని చూపలేకపోతున్నాం. మన బ్రతుకులు మనవి కాకుండా పోతున్నవి. మన కలిసిమెలిసి ఉండి వారి కుట్రలను ఎదిరించాలి. అప్పుడే మనం జీవించగలం. తల ఎత్తుక తిరుగగలం.

- డా.నందినేని రవీందర్ 94910 78515