మెయిన్ ఫీచర్

నినదించిన వసుగీతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నదీమతల్లులకు నారీత్వము ప్రసాదించి రసోదంచిత చమత్క్రియా కల్పనా కల్ప భవ్యమ్ముగా ఎవరు మహాప్రబంధమును శిల్పించి (సృష్టించి) సరిగమల మంజు హేలాగతీ మధురిమలను చిలికించునో అట్టివాడు తప్పక మహాకవే. వాడే మూర్తియైననూ హృజ్జాతము వసుగీతమే. ఇది యొక యోగ సందర్భము. సాహిత్యస్పృహే (చైతన్యం) కవికి నిజమైన గీటురాయి. ‘‘సాహిత్య దర్పణం’’ చెప్పినా, ఛార్లెమ్ బోదివేర్ చెప్పినా ఒకటే మాట. చూడండి "It is not given to every one to take a both in the multitude; to enjoy the crowd is on out'' జనంలో జలకాలాఢటం అనేది ఒక రసతత్త్వానుభూతి. ఇది అందరకు ఉండదు. కవులకు మాత్రమే ఉంటుంది.
ప్రబంధ కవులా! వారి పోకడేలేదు. వారి ప్రతిభా ప్రాగల్భ్యములట్టివే. నిరంకుశులన్న యిట్టివారే. అక్షరము లమర్చుటలో ఆనుపాను లెరిగినవారు. శబ్ద విద్య తెలిసినవారు. అక్షర విధము తెలియని నేటివారు అల్పులయ్యూ ‘‘కవు’’లుగా చెలామణి అవుచునే వున్నారుగదా. ఇదేమి మ్లానయోగమనుకొన్నచో దుర్గతి యట్టిదే మరి. నిజమునకిట్టి వారిని ఉప్పుపాతర వేయవలెను. ప్రజాస్వామ్యముగదా ఈ సాహిత్య పీడ గ్రహణమై పట్టుకొనుట చట్టమే అయినది. చెల్లుచున్నది. భావప్రకటన స్వేచ్ఛయై అలరారుచున్నది. అవకాశమునందిపుచ్చుకొనుటలో- మిగిలిన వారికన్నా కవులు పది అడుగులముందే వున్నారు. ఈ విద్యలో వర్తమాన తెలుగు కవులు ప్రథమగణ్యులు. వీరికి కవిత్వము పట్ల యోగ్యమైన అవగాహన లేదు.
‘‘ఇదం కవిభ్యః పూర్వేభ్యోనమోవాకం ప్రశాస్మహే
వందేమహిచతాం వాణీ మమృతా మాత్మనః కలామ్’’
భారతీయ సాహిత్యానికి శాస్ర్తియమైన సర్వలక్షణ సంపన్నమైన విశేషమైన ఒక పరంపరయున్నది. వేదకాలంలో మహర్షులు మంత్రద్రష్టలై భారతీయ సంస్కృతిని భారతీయాత్మను ప్రతిబింబించు ఋక్కులను గానం చేశారు. ఆ ఋక్కులు త్రికాలా బాధితాలు; సచ్చిదానంద రూప చైతన్య స్ఫోరకాలు. కవి-కావ్య లక్షణాలను శ్రుతులు బహురీతులలో వర్ణించాయి. జగత్సర్జన కర్తమైన పరమేశ్వరుని ‘‘కవిర్మనీషీ పరిభూః స్వయంభూః’’అని వర్ణించాయి. కవి అంటే ఇక్కడ పరమేశ్వరుడే. పరమేశ్వర సృష్టమైన రుూ జగత్తు నామరూప కర్మాత్మకము. ‘‘త్రయంవాన నామ రూపకర్మం’’ యని బృహదారణ్యక శ్రుతి. నామము శ్రవణేంద్రియ గోచరము. రూపాత్మకమైన దృశ్యప్రపంచం చక్షురింద్రియ గోచరం. కర్మకాయికము.
ఈ రీతిగా స్పష్టమైన జగత్తులో ఎన్నో శ్రవణ సుభగాలైన నాదాలను విన్న మానవుడు అనంతమైన వాఙ్మయాన్ని సృజించాడు. నయనాభిరామాలైన సుందర దృశ్యాలను చక్షురింద్రియ తర్పణంగా దర్శించి ఆనందాతిరేకంతో రేఖాంచితం వర్ణాంచితం చేశాడు. వాటిని విని చూచి భావావిష్ణుడై హావభావాలను వెలారుస్తూ నర్తించాడు. ఆ వాఙ్మయం, రామణీయకమైన ఆ దృశ్యం ఆ హావభావ చేష్టితం వెనుక సచ్చిదానంద ఘనమైన చైతన్య స్ఫురణమే కానవస్తుంది. ఆ చైతన్య స్ఫురణమే లేనివాడు ఈ జగన్నాటకమే హుళక్కి. ఆ చైతన్యమే ఈ జగత్తుకు ఆత్మ. మిగిలినదంతా శరీర కల్పమే. అయితే ఈ శరీరం లేకుండా చైతన్యస్ఫురణ అసంభవం. అట్లే చైతన్య నిరణితంగా జగదభి వ్యక్తి ఉండదు.
జగత్కావ్యకర్తయైన పరమేశ్వరుని ‘‘కవి’’యన్నట్లే లౌకిక కావ్య రచయిత గూడ కవి శబ్దవాచ్యుడే. నా కృషి కురుతే కావ్యమ్’’అనికదా ఆర్యోక్తి. పెద్దలగువారిని ఆర్యులందరు. (మరి పెద్దలెవరు? వారెట్లు పెద్దలయిరి. ఈ చర్చ మరొకసారి.) పశ్యంతీ వాగ్భూమికలో సమాహిత చిత్తంతో సత్యదర్శనం చేసినవాడే ఋషి. అట్టి ఋషియే క్రాంతదర్శనంగల కవి. క్రాంత దర్శనంగల కవి హృదయంనుండి విస్తృతమైన వాక్కు ఆత్మకళ. కావుననే భవభూతి మహాకవి ‘‘వందేమహిచ తాం వాణీ మమృత మాత్మానం కలామ్’’అని వాగ్దేవతను అమృత రూపిణిగా, ఆత్మకళా స్వరూపిణిగా కీర్తించాడు. కాన కవి హృదయోద్గారమైన వాక్కు ఆత్మకళయే. ‘‘కవేః ఇదం కావ్యమ్’’ అనే వ్యుత్పత్తిననుసరించి కావ్యం ఆత్మకళయనినంతనే తత్కావ్యం ఆత్మచైతన్య స్ఫోరకంగా వుండాలి, సచ్చిదానంద సమున్మిషితమై వెలుగొందాలి. అట్లు కానినాడు అది శుష్క వారంభణం మాత్రమే. అవుతుంది గాని, సత్కావ్యం, రసవత్కావ్యం కానేరదు. మహాకవియొక్క వాణీ మహిమాంశయాన్ని కావ్య ప్రకాశకర్త మమ్మటుడు ఇలా అంటాడు.
‘‘నియతి కృత నియమరహితాం / హ్లాదైక మరుూ మనన్య పరతంత్రాం / న వరసరుచిరాం నిర్మితి / మాదధీతి భారతీ కలేర్జయతి’’
లౌకిక కవి వాక్కు ప్రకృతి నియమాలకతీతమైంది (అని చెప్పి కవికున్న పైత్యాన్ని అక్షరబద్ధం చేయరాదు. పైత్యం కవిత్వంకాదని గ్రహించాలి) కవి స్పష్టమైన ఈ వాణి ఆనంద ఘనము కవిప్రతిభా సమున్మిషితమవటం వలన అనన్య పరతంత్రము (స్వతంత్రము) నవరస రుచిరము. తాదృశమైన కవి వాణికి జయమగుగాక అని భావము. లౌకిక కావ్య స్వరూపాన్ని, స్వభావాన్ని లక్షణాన్ని చెప్పటంతోపాటు దాని మహత్వాన్ని గానంచేశాడు మమ్మటుడు. కవులు దాన్ని అనుసరించారు. కాకులు (నీటి కాకులు) దీని సరిహద్దులకు కూడా చేరుకోలేక చావుకేకలు పెట్టారు. అలంకారకులు కావ్య లక్షణాలను కావ్య ప్రయోజనాలను కావ్య రచనకు మూల భూతాలైన ప్రేరక శక్తులను విపులంగా- విశదంగా వివరించారు. భారతీయాలంకారకులు కావ్యాభివ్యక్తి విధానంకంటే ఆత్మస్థానీయమైన భావపక్షానికి అధిక (ప్రముఖ)స్థానం యిచ్చారు.
కావ్యానికి మూలభూతమైనది రాగాత్మక ప్రవృత్తి; భావతత్త్వమేకానీ కల్పనా రహితంగా భావవికాసం జరగదు. ఒకప్పుడు కల్పన విశృంఖలమై అసంబద్ధంగా ఉండటం సంభవం. వైచక్షణ్యయుక్తమైన బుద్ధి ఆ కల్పనాశక్తిని అదుపులోవుంచి భావాలను మర్యాదాబద్ధం చేస్తుంది. బుద్ధితత్త్వం (సహృదయ తత్త్వం) కావ్యంలో ప్రస్ఫుటితమైనప్పుడు సత్యం శివం చక్కగా అభివ్యంజితాలవుతాయి. భావతత్త్వంవలన ‘సుందరం’ అభివ్యక్తవౌతుంది. ఈ విధంగా బుద్ధితత్త్వం భావతత్త్వం సమన్వితమై సమరసంగా వుంటే సత్కావ్యం ఆవిర్భవిస్తుంది. తాదృశ కావ్య పఠనంవల్ల సహృదయ హృదయాలు ప్రతిస్పందితాలై ఆనందాబుధిలో మునకలు వేస్తాయి. కనుకనే భారతీయ సాహితీ మర్మజ్ఞులు ప్రతిభా వైదుష్యాలతో కావ్యలక్షణాలను నిర్వచించారు. మొట్టమొదట కావ్యలక్షణాన్ని నిర్వచించింది అగ్నిపురాణం.
‘సంక్షేపాద్వాక్యమిష్టార్థవ్యవచ్ఛిన్నా పదావతి
కావ్యం స్ఫుటవదలంకారం గుణవర్దోష వర్జితమ్’
గుణాలంకార యుక్తము, దోష వర్జితము, ఇష్టార్థ ప్రతిపాదకము అయిన పదావళి లేక వాక్యం కావ్యమని భావము. దండాచార్యుడు కూడా కావ్యదర్శంలో ఇష్టార్థ వ్యవచ్ఛిన్నా పదావలి’’అంటూ కావ్యలక్షణాన్ని చెప్పి అగ్ని పురాణ వచనానే్న అనుసరించాడు. తదనంతర వర్తులైన అలంకార శాస్తజ్ఞ్రులు శబ్దార్థాలను రెంటినీ కావ్య శరీరమని భావిస్తూ కావ్య లక్షణ నిర్వచనం చేశారు. అడుగు చెడకుండా తరువాతివారు అల్లుకుపోయారు. అందిపుచ్చుకున్నవారు ప్రతిభను జోడించి మహాకవులయ్యారు. ప్రబంధ కవులందరు సమకూర్చిన అలంకారములన్నియు ఒక ఎత్తు. తన సంగీతశాస్త్ర పరిష్కృతమైన ధారాశుద్ధితో నిర్వక్రప్రౌధితో వాగ్వైచిత్రితో జీవనమెల్లసత్కవి నిషేవితము విశ్వధాత్రీ వలయ త్రికాల ఫలదేశికము ముక్తావళీ విభ్రమాస్సరము అయిన కవితా విపంచిని మీటి అచేతనమ్ముల చేతన రీతి దనర చేత నమ్ములచేతన భాతినొనర అపూర్వ కవితాశిల్పముతో కవి సంతరించిన సౌందర్య శోభ ఒక ఎత్తు. భారతమునందలి ఒకానొక కథను తీసుకొని తన ప్రతిభావ్యుత్పత్తులచేత వర్ణనా వైశద్యమును బహుకావ్య విజ్ఞతను ప్రదర్శించి ఒక మహాకావ్య నిర్మాణము చేసెను. కావ్యమందలి ప్రౌధామ, ధ్వని, చమత్కారము, శే్లష, సంగీత ధారానైగనిగ్యము మరొక కావ్యమున కానరాదు.
‘‘నను శ్రీరామపదారవింద భజనానందున్ / జగత్ప్రాణనందన కారుణ్యకటాక్ష లబ్ధి / కవితాధార సుధారాశి సంజనితైకైక / దిన ప్రబంధ ఘటికా సద్యశ్శతగ్రంథ / కల్పను సంగీత కళారహస్యనిధి బల్వంబంచి...’’
ఈ పద్యంలో కవి ఆత్మప్రత్యయం గోచరిస్తోంది. ఇది అసాధారణ ప్రజ్ఞకదా. ఇతడు సంగీత కళారహస్య నిధి. పద్యరచనా సామ్రాజ్య పట్ట్భద్రుడు. అంతేకాదు బహువిషయ విజ్ఞా, సంస్కృతాంధ్ర సకల భాషాసామ్రాజ్యా సర్వంకషమైన పరిశ్రమచేసి సంపాదించిన శక్తులు అనన్యసామాన్యములు. అనితర సాధ్యములు. ఇతడేమంటాడంటే...
‘‘కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు
ఆద్య సత్క్ధల్వావిరి పుట్టురత్నములు
అవారిత సత్కవి కల్పనాభూషావహ
పూర్వవృత్తములు సానలుదీరిన
జాతిరత్నములు’’--
కల్పనా మనోహరములగు పూర్వకథా విశేషములు సానలు తేఱిన మణులు వంటివికాన మిశ్రకథనేర్పుతో గావింతునని యర్ధము. అప్పుడే కవి పురాణములనుండి మూల పదార్థమైన కథను కేవలమల్పాల్పమైన ఆలంబనముగా తీసికొని తన యోగ్యతలన్నీ జోడించి రసహృదయులకు రసాధర్మముపదేశించినాడు. సంగీత సాహిత్యములు ఇంత సమానముగా కడుపార త్రావి పెరిగిన కవికిశోరము ప్రబంధ యుగములో మరొకరగుపించరు. సంగీత సాహ్యిములు శారదాదేవి స్తనములుగా ఉపవర్ణించి అలఘప్రస్తారములు చేసి (1-3) తన సంగీత కళాసర్వస్వమును ప్రకటించుకున్నాడు.
‘‘సకలామోదక తాళవృత్తగతులన్
సంగీత సాహిత్య నామక
విద్యాయుగళంబు పల్కు చెవికింపామిడ్లతోడై
సిరుక ప్రకటింప
నఖరేఖలందు నలఘప్రస్తారముల్ సేయ
సర్వ కళాకాంతుడు...’’ (1-3)
ఈ పద్యంలోని అర్థద్వయాన్ని వ్యాఖ్యాతలే చెప్పారు. ఇందులో మనోహరమైన ఒక శే్లష చమత్కృతి. తాళ వృత్తములలో మొదటిది సంగీతానికి రెండవది సాహిత్యానికి అన్వయం. ఈ విషయము ‘సకలామోదము’ అను సమాసములో గుప్తపరిచినాడు. సంగీతమాపాత మధురము. కనుక ఇది సకలామోదము. సాహిత్యము ఆలోచనామృతము. కనుకనే అది కలామోదము. సకలామోదము. ఇక్కడ ఆత్మకళతో కూడుకున్న కళాభిజ్ఞత. ఆ తెలివిగల వారికి ఆలోచనామృతము. ఇంకా వివరించవచ్చు. ఆ లోతు ఈత నేర్చినవారు ఉంటే చెప్పగలను. ఈ కవి కవిత్వం చదవగానే ముందు శ్రవణనందము కలుగును. తరువాత మధురస రుచిచూపి ఆపై హృదయ కుహరంలో ప్రవేశించి మనసుకు అవ్యక్తమైన ఆనందాన్ని కలిగిస్తుంది (2-14) కలస్వనముగానము కనుక ఉద్దీపన విభావనమని తెలియనగును. అళి గానముకంటె అళినీ గానము మరీ మధురము. గురుచరదళినీ యగుటవలన పూవులపై చరించుచు తేనియ త్రావు తుమ్మెదయని భావము. పూదేనె కంఠరవమునకు ప్రశక్తిని గూర్చనుగాన ఆ గానమానంద బ్రహ్మమునకు చేరువయనుట. ‘‘సకలామోద’’శబ్దమే చమత్కార జనక భావనా విషయార్థ ప్రతిపాదక శబ్దః కావ్య’’మైనది. ఇది కావ్యలక్షణానికి సర్వసామాన్యమైన నిర్వచనం.
‘‘యద్వైతత్ సుకృతం రసో వైసః’’అంటూ సచ్చిదానంద ఘనమైన బ్రహ్మచైతన్యమే రసమని శ్రుతిరహస్య స్వరూపాన్ని నిర్వచించింది. అలౌకికమైన ఆత్మానందమే రసమని శ్రుతి తాత్పర్యం ఈ శ్రుతి తాత్పర్యానే్న మనసునందుంచుకొని జగన్నాధుడు రమణీయార్థ ప్రతిపాదక శబ్దఃకావ్యమ్’’అన్నాడు. మరో కవి స్వీయప్రతిభతో తన కావ్యంలో అలౌకికమైన విభావానుభావ సంచారీ బావరూపమైన కవితా సామాగ్రిని తన కావ్యంలో నిక్షిప్తంచేశాడు. రాగం తానం పల్లవి వీణలో పలికించి సర్వేంద్రియ మోహనమైన నియతికృత నియమ రహితహ్లాద సుధా భాజసమైన ఆనందతత్త్వాన్ని ప్రసాదించాడు. కంఠాలాప్తి ఠేవన్ వీణ పలికించు శబ్దములు మృదంగపు వరుసలలోని ముక్తాయింపు ధ్వనులను తలపిస్తాయి.
‘‘శక్తిర్కిపుణతా లోకశాస్త్ర కావ్యాద్యవేక్షణాత్
కావ్యజ్ఞ శిక్ష యాభస ఇతి హేతుస్తదుద్భవే॥
శక్తి-నిపుణత్వం లోక శాస్త్ర కావ్యది పరిశీలనం- లేక జ్ఞానంవలన కలిగే యోగ్యత. కావ్యతత్త్వజ్ఞాని వలన పొందిన శిక్షణ ద్వారా లభించిన అభ్యాసం, ఈ మూడు కావ్యరచనకు హేతువులు. ఇంత సాధించిన వాడే కవి. మరి ఇప్పుడా కవి ఎవరు?
ఏమా గ్రంథ ప్రబంభము? భట్టుమూర్తియో- రామరాజు భూణుడో, ఇరువురొకరైనవాడు. పొత్తమది వసు చరిత్రము. ఇంతగా నినదించిన ఈ వసుగీతము ఎట్లుండెననగా- ఇదిగో ‘‘వీనుల విందై యమృతపు సోనల పొందై యమంద సుమచలదళినీ గానము క్రందై యా స్వనమానంద బ్రహ్మమయి’’ యుండెను.

- సాంధ్యశ్రీ, 8106897404