మెయిన్ ఫీచర్

మెటాలిక్ వేవ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహో..
ఓ సాహసం.
ఓ తెగింపు. ఒకింత తెలివి. శిఖరమంత ఖ్యాతి. హాలీవుడ్‌తో పోటీ పడేందుకు తెలుగు సినిమా ‘బాహుబలి’ అనే విత్తనమేసింది. అదిప్పుడు ‘సాహో’గా అంకురించింది. భవిష్యత్‌లో హాలీవుడ్‌తో పోటీ పడే సినిమాలంటూ భారతీయ సినిమా నుంచి పుట్టుకొస్తే -వాటికి ఆ ధైర్యాన్ని నూరిపోసిన చిత్రాలుగా వీటినీ ప్రస్తావించాలి. అందుకే సాహోని ఆర్థిక కోణంలోకంటే -భవిష్యత్‌కు కొత్త దారి చూపే సినిమాగా చూడాలి.

సాధారణ ప్రపంచం
-తన గమనంలో తనుంది.
సాహో ప్రపంచం
-ఆగస్టు అంచుకు పరుగులు పెడుతోంది.
***
ఇంచుమించు నాలుగేళ్ల క్రితం.. అంటే బాహుబలి విడుదలకు ముందు
సాధారణ ప్రపంచం
-తన గమనంలో తనుంది.
బాహుబలి ప్రపంచం మాత్రం
-జూలై 15 కోసం పరుగులు తీసింది. బాహుబలి -తెలుగు సినిమా చరిత్రని తిరగరాయనున్న అద్భుతంగా మాట్లాడుకున్నాం. జక్కన్న మస్తిష్కం నుంచి పుట్టిన జానపద కళాఖండం -్భరతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేజీని ఆవిష్కరించనుందనీ చెప్పుకున్నాం. భారీ బడ్జెట్. భారీ తారాగణం. విదేశీ నిపుణులు. ఆధునిక సాంకేతికత. అంతకుమించి తెగింపు. కట్‌చేస్తే -బాహుబలి విజయం సాధించింది. మార్కెట్ జరిగిపోయింది. అప్పటి వరకూ వత్తిడిని ఎదుర్కొన్న నిర్మాతలు -హమ్మయ్య అని గుండెలపై చేయ్యేసుకున్నారు. రెండేళ్ల తరువాత -బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్న ఒకే ఒక్క ప్రశ్న సంధించి ‘కన్‌క్లూజన్’నూ ప్రాఫిట్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్త ‘ఆడియన్స్’ని బాహుబలి కుమ్మేశాడు. కోట్లు కూడబెట్టాడు. గ్రేట్ స్కీమ్. గ్రేట్ బిజినెస్.
**
సాహో..
సేమ్ స్కేల్. సేమ్ స్ట్రాటజీ. సేమ్ ఫ్యాక్టర్. భారీ బడ్జెట్. భారీ తారాగణం. విదేశీ నిపుణులు. ఆధునిక సాంకేతికత. బాహుబలి నుంచి తీసుకున్న బ్లూప్రింటే కనుక -అనూహ్యం అనుకోకపోతే ఫలితాలూ అలాగే ఉంటాయి. సందేహం లేదు. కాకపోతే అప్పుడు బాహుబలితో, ఇప్పుడు సాహోత సాధించేదేమిటి? తెలుగు సినిమా స్టామినాను యావద్భారతానికి చూపించడానికా? హాలీవుడ్ మార్కెట్‌ను ఢీకొట్టే ప్రయత్నాలకు పదును పెట్టడమా? ఏమిటి లక్ష్యం. ఏమిటి గమ్యం?
***
నిజానికి సాహో -బాహుబలికి ముందే సిద్ధమైన కథ. అంటే -ఐదేళ్ల క్రితమే ప్రభాస్ కథను విని ఓకే అన్నాడు. తరువాత బాహుబలితో ప్రభాస్ రేంజ్ మారింది. దాంతో సాహో స్కేల్ విస్తృతమైంది. అంటే బాహుబలి వెయిట్ ప్రభాస్ ఫేట్‌ని మార్చింది. బాహుబలి -కన్‌క్లూజన్ విడుదల టైంలో ప్రభాస్ ఓ మాటన్నాడు. వత్తిడి తట్టుకోవడం కష్టంగా ఉంది. రిస్క్‌తో కూడిన భారీ చిత్రాల్ని చేసే విషయంలో పునరాలోచన చేయాలని. దాంతో, రొటీన్ హీరోయిజం మూవీనే చేస్తాడనుకున్నారు. బాహుబలితో ఎవరెస్ట్‌కెక్కిన ప్రభాస్‌కు -కిందకు దిగాలనిపించలేదు. అంతే -సాహో స్కీం మరింత మారింది. ప్రాజెక్టును చేసేది కుర్ర దర్శకుడే అయినా -అప్పటికే సక్సెస్‌ఫుల్ బ్లూప్రింట్ చేతిలో ఉంది కనుక అదే స్కీంను స్క్రీన్‌కు తెచ్చే ప్రణాళిక సిద్ధమైంది. పర్ఫెక్ట్ ప్రణాళికకు -యువీ క్రియేషన్స్ గట్స్ తోడయ్యాయి. బడ్జెట్ పరిమితులు చెరిగిపోయాయి. కాలాన్ని గాలికొదిలేసి -సుజీత్ ఊహకు స్వేచ్ఛనిచ్చే తెగింపు చూపించారు. పర్ఫెక్ట్ యాక్షన్ సినిమాలంటే హాలీవుడ్‌కే సాధ్యమా? అంతకుమించిన అనుభూతిని ఇండియన్ స్క్రీన్‌పై ఇవ్వలేమా? లాంటి ఆశలు పదునుదేరాయి. సాహో స్ట్రీమ్‌ను స్క్రీన్‌కు తేవడానకి -డార్లింగ్ టీం రెండేళ్లు కష్టపడింది. సాహో ఆవిష్కృతమైంది.
***
సినిమా తీయడం వేరు. మార్కెట్ చేయడం వేరు. మళ్లీ -ఇక్కడా బాహుబలి స్కీమే ధైర్యాన్నిచ్చింది. ప్రమోషన్స్‌ని పతాకస్థాయికి తీసుకెళ్లి -జనం మైండ్‌లో సాహో తప్ప మరెవ్వరూ లేకుండా చేయాలన్న ప్రణాళిక రూపుదిద్దుకుంది. ‘బాహుబలి’ని చూడనోడు -సినిమా ప్రేమికుడు కాదన్న మూడ్‌ని అప్పుడు తీసుకొస్తే.. హాలీవుడ్‌ను తలదనే్నలా తీసిన సినిమాను చూడకపోతే మన సినిమాకు అన్యాయం చేసినట్టేనన్నంత ప్రచారం జరిగింది. కట్‌చేస్తే -సాహోను హాలీవుడ్ సినిమాగా చూడ్డం మొదలెట్టాం. భారీ సినిమామీద గౌరవమో, పోటీ ఎందుకులేనన్న ఆలోచనో.. -అన్ని భాషల్లోని చిన్నా చితకా సినిమాలూ సాహోకి కార్పెట్ వేసేశాయి. దాంతో సీన్ మారిపోయింది. హిందీ వర్షన్‌కు వంద కోట్ల డిమాండ్ రావడంతో, బ్రేక్ ఈవెన్‌కు చేరే దారి ఈజీ అనుకున్నారు నిర్మాతలు. తెలుగు, తమిళ శాటిలైట్, డిజిటల్ హక్కులూ వంద కోట్లు పైచిలుకు పలుకుతుంటే సంతృప్తిపడ్డారు. కర్నాటక, తమిళనాడు నుంచి చెరి పాతిక కోట్లు వచ్చినా, కేరళనుంచి కనీసం పది కోట్లు పలుతుందని అంచనా. ఓవర్సీస్ నుంచి 55 నుంచి 60 కోట్లు వర్కౌటవ్వొచ్చని నమ్మకం. సో, సాహో సేఫ్ గేమ్ దాటేసి ప్రాఫిట్ స్ట్రీమ్‌లోకి వచ్చేశాడు.
తెగింపు, తెలివీ వుంటే -యూనివర్శల్ అప్పీల్ కథతో హాలీవుడ్‌ను తలదనే్న సినిమాల్ని సిద్ధం చేయొచ్చని ‘సాహో’ మళ్లీ రుజువుచేస్తున్నాడు. మన కలలు పెద్దవి. వాటిని ఈడేర్చే ఆర్థిక సత్తా అర్థమైంది. ‘సాహో’తో భారతీయ సినిమా కాన్వాస్ విస్తృతమవుతోంది.
***
అంతా బాగానే ఉంది. కానీ, ఇలాంటి వత్తిళ్లు ఇకపై భుజానికి ఎత్తుకోలేనంటూ ప్రభాస్ చేతులెత్తేశాడు. సరైన ప్రణాళిక అమలు చేస్తే పెట్టుబడులే కాదు, ఖాయంగా ప్రాఫిట్లూ వస్తాయని రుజువవుతున్నా -మరోసారి ‘్భరీ’ బడ్జెట్‌ను సమకూర్చే నిర్మాతలూ కనిపించటం లేదు. సో, ఇలాంటి ‘ భారీ’ ప్రయోగాలు అప్పుడప్పుడూ జరగాలే తప్ప, అనుసరణగా జరగవన్న విషయం అర్థమవుతోంది. సాహో సీజన్ ముగిసే వరకే -ఈ ఊపు. దాటితే మరో పెద్ద ప్రాజెక్టు అకస్మాత్తుగా తెరపైకి వచ్చేవరకూ అంతా మామూలే.

-విజయప్రసాద్