Others

ఢైమండ్ జుబిలీ గిఫ్ట్: డబుల్ డెక్కర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేన్ మోర్గాన్ (82), షెర్లీ మోర్గాన్ (76) జంట పోయినవారం వైవాహిక జీవిత వజ్రోత్సవం ( అరవై ఏళ్ళు) జరుపుకున్నారు ఆనందంగా. బహుమతిగా ఆమెకు భర్త ఏమిటిచ్చాడనుకుంటున్నారు? 1956 నాటి మోడల్ డబుల్ డెక్కర్ బస్సు. మ్యూజియమ్‌లు, పాత వస్తు సముదాయ దుకాణాలు- అన్నీ వెదికి వెదికి- అలనాటి మాడల్ పాత డబుల్ డెక్కర్ బస్సును పట్టుకున్నాడు. పదమూడువేల పౌండ్లకి దానిని తక్షణం కొన్నాడు మోర్గాన్.
వీళ్లిద్దరికీ తొలి చూపుతోనే వలపు సంభవించింది. 1956లో ఒక రెడ్ డబుల్ డెక్కర్ రూటు బస్సులోనే. వాయుదళం రిజర్వుడు సోల్జర్‌గా పనిచేస్తున్న యువకుడు కేన్, ఒకనాడు గ్లోసెస్టర్ దగ్గర కార్డ్ఫికి వెళ్దామని బస్సెక్కాడు. పద్ధెనిమిదేళ్ల అందాల బొమ్మ లేడీ కండక్టర్ షిర్లీ ‘టికెట్ ప్లీజ్’ అంటూ గంట కొట్టింది. మోర్గాన్ రెండు షిల్లింగుల ఆరు పెన్నీలు ఆమె చేతబెడుతూ ఆమె అందచందాలకు ముగ్ధుడైపోయి- తన హృదయాన్ని కూడా ఆ పైసలతోపాటే యిచ్చేశాడు. అలా ఆమెనే చూస్తుండిపోయాడు. గమ్యం రానే వచ్చింది.
‘‘యస్ ప్లీజ్!’’ అంటూ దిగమని సైగ చేస్తూ కిసుక్కుమని నవ్వింది అందాల భామ షిర్లీ. ‘‘డేటిస్తావా? అమ్మాయ్?’’ అనడిగాడు మొండి ధైర్యంతో. అలా మొదలయింది ఆ ఇద్దరి రొమాన్స్. అది ప్రగాఢమై- ఎడబాటు సహించలేక కెన్ మోర్గాన్- ఆర్.ఏ.ఎఫ్ ఉద్యోగానికి గుడ్‌బై కొట్టి బస్సు డ్రైవింగ్ నేర్చుకుని ఓ డబుల్ డెక్కర్‌లో డ్రయివర్‌గా కుదురుకున్నాడు.
ఇక కెన్ - షిర్లీల ప్రేమయాత్ర- డబుల్ డెక్కర్‌లోనే చివురించి, పుష్పించి, ఫలించగా- 1959లో పెళ్లి చేసుకున్నారు. అలాగ ఈ బస్సు ప్రేమికులు ఓ యింటి దంపతులై హాయిగా డబుల్ డెక్కర్ సాక్షిగా- ‘పువ్వుల నదిలో నవ్వుల వాన’ అన్నట్లు జీవన రాగం ఆలాపిస్తూ వయోవృద్ధులైనారు. ‘అరవై’ వాళ్లకి కాదు - వాళ్ల దాంపత్య జీవితానికి నిండింది. అలనాటి పాత బస్సు కోసం వాళ్లు యునైటెడ్ కింగ్‌డమ్ అంతా గాలించారు. చివరికి దొరికింది- దాని ‘డొక్కు’ ఒకటి.
మధురస్మృతులు నెమరువేస్తూ- ఆ బస్సుకి రంగులు ఆమె వేయగా- హంగులు అతను కూర్చాడు. ‘‘నాకో టిక్కెట్ ప్లీజ్’’ అన్నాడు తాతగారు. ‘‘ఇదుగో!’’నంటూ అలనాటి కండెక్టర్ బ్యాడ్జీ ధరించి మరీ వచ్చింది కండక్టర్ అవ్వగారు. పెళ్లి ఉంగరం కన్నా రుూ కండెక్టర్ బ్యాడ్జీనే ఎక్కువ అంటూ దాచుకున్నది అరవై ఏళ్లు పదిలంగా.
‘‘చలో, మరో హనీమూన్!’’ అంటూ రుూ ప్రేయసీ ప్రియులు - డ్రయివరూ, కండెక్టర్‌గా ఆ డబుల్ డెక్కర్‌లో చెక్కేశారు. అదే మలి సంధ్యారాగం అంటే!