మెయిన్ ఫీచర్

మెసేజ్‌తో వస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహర్షి సినిమా చాలా ఇంటెన్స్ వున్న కథ. దీని తరువాత ఎంటర్‌టైన్ చేద్దాం అనుకున్నాను. అయితే అదే సమయంలో సుకుమార్ ఇంటెన్స్‌తో కూడిన సీరియస్ కథను చెప్పాడు. అప్పుడే సీరియస్ కథ వద్దనుకుని అనిల్ రావిపూడి చెప్పిన ఎంటర్‌టైనర్ చేయడానికి సిద్ధమయ్యాను. ఈ విషయంలో సుక్కు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సుక్కు నాకు మంచి ఫ్రెండ్. అతనితో తప్పకుండా భవిష్యత్తులో సినిమా చేస్తా అని అంటున్నాడు మహేష్‌బాబు. ఆయన తాజాగా నటిస్తున్న మహర్షి చిత్రం ఈనెల 9న విడుదలకు సిద్ధం అయిన నేపథ్యంలో మహేష్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మహేష్‌బాబుతో ఇంటర్వ్యూ...
మహర్షిని శ్రీమంతుడుతో పోలుస్తున్నారు? మీరేమంటారు?
-శ్రీమంతుడు, మహర్షికి ఏక్కడా పోలికలు వుండవు. ఈ రెండు కథలు దేనికదే భిన్నం. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది.
మహర్షి ఏం చెప్పాలనుకుంటున్నాడు?
-ఈ కథను నాకు వంశీ నలభైనిముషాలు వివరించాడు. అతను చెప్పినప్పుడు నా పాత్ర నన్ను కట్టిపడేసింది. నా కెరీర్‌లో ఇలా ఒక పాత్ర తాలూకు ప్రతి డీటెయిల్ ఎప్పుడూ వినలేదు. ప్రతి ఎమోషన్, అతని బిహేవియర్.. ఇలా ప్రతి ఒక్క విషయంలో వంశీ చూపించిన కేర్ సూపర్బ్. అయితే కథ విన్నాక బాగా నచ్చింది. కానీ ఈ సినిమా చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. రెండేళ్ళు కూడా పట్టొచ్చు, వెయిట్ చేస్తావా అని అడిగాను. తాను ముందే చెప్పాడు, ఈ కథను మీతో తప్ప ఎవరితో తీయను. ఈ పాత్రలో మిమ్మల్ని తప్ప ఎవరినీ ఊహించను అని చెప్పాడు. చెప్పినట్టే రెండేళ్ళు కాదు మూడేళ్లు నాకోసం వెయిట్ చేశాడు. నిజంగా అతనికి హ్యాట్సాప్ చెప్పాలి.
చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తున్నారు?
-నేను ఇప్పటివరకు ప్రతి సినిమాలో ఒకేలా ఉంటానని ఫ్యాన్స్ అంటున్నారు. అందుకే ఈ సినిమా కోసం కొంత మేకోవర్ మార్చాను. స్పష్టంగా మాట్లాడటం, భిన్నంగా ఉండేలా ట్రై చేయడం లాంటివి ఈ పాత్రలో ఛాన్స్ దక్కింది. ఇందులో మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తాను. ఒకటి స్టూడెంట్, రెండు సీఈఓ, ముందువిలాగే నేటివిటీ. అది కూడా మీకు కొత్తగా అన్పిస్తుంది.
ఈ సినిమా కోసం ట్రాక్టర్ దున్నడం, నాట్లు వేయడం లాంటి పనులు చేశారు? ఆ ఫీలింగ్ ఎలా ఉంది?
-నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ పాత్ర కోసం అవన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి తెలుసుకుని చేశాను.
కాలేజీ స్టూడెంట్‌గా బాగా ఎంజాయ్ చేశారా?
-స్టూడెంట్‌గా బాగా ఎంజాయ్ చేశాను. ఆ పాత్ర తాలూకు ఎమోషన్స్ బాగుంటాయి. మీరూ ఎంజాయ్ చేస్తారు.
సవాలుగా అనిపించిన విషయమేమైనా ఉందా?
-కాలేజీ స్టూడెంట్ పాత్రను చేయడం పెద్ద సవాలుతో కూడుకున్నది. చాలా కష్టం కూడా. బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్.. చాలా కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. నిజానికి ఆ ఎపిసోడ్ విషయంలో కొంత నెర్వస్‌గా ఉన్నా. కానీ దర్శకుడు వంశీ ఇచ్చిన ఇన్‌పుట్స్‌తో బాగా చేశాను.
మీ కెరీర్‌లో మీరు ఎమోషన్‌గా భావించిన ఉత్తమ క్షణం?
-ఉత్తమ క్షణం అంటే.. మురారి సినిమా విడుదల రోజు మొదటి షో నేను, నాన్న కలిసి హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో చూశాము. సినిమా పూర్తయ్యాక నాన్న నా భుజంపై చేయి వేసి ఒక ఎమోషనల్ స్మైల్ ఇచ్చాడు. అది ఇప్పటివరకు నేను మరిచిపోని క్షణం.
మరి ఈ సినిమాను నాన్నగారు చూశారా?
-చూసారు. ఆయన సినిమా విషయంలో జెన్యూన్ రిజల్ట్ ఇస్తాడు. మంచి విమర్శకుడు కూడా. మహర్షి విషయంలో నాన్న పూర్తి సంతృప్తిగా ఉన్నాడు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పూరి, కొందరి దర్శకుల పేర్లు కావాలనే చెప్పలేదన్న విమర్శలు వస్తున్నాయి?
-నేనెప్పుడూ ఎవరినీ టార్గెట్ చేయను. ఈ సినిమా విషయంలో వంశీని పొగిడాను తప్ప మరో దర్శకుడిని కార్నర్ చేస్తూ మాట్లాడలేదు. కానీ నేను మాట్లాడిన మాటలను ఎవరో కాంట్రవర్సీ చేసి రాసేశారు. నిజానికి నా కెరీర్‌లో గొప్ప చిత్రం పోకిరి. అలాగే నాకు చాలా ఇష్టమైన సినిమా 1 నేనొక్కడినే. సుకుమార్, పూరి జగన్నాథ్ ఇద్దరూ నాకు మంచి మిత్రులు. వాళ్ళను నేను ఎప్పుడూ టార్గెట్ చేసి మాట్లాడలేదు.
సుకుమార్‌తో సినిమా ఎందుకు సెట్ కాలేదు?
-సుకుమార్ రంగస్థలం సినిమా తరువాత నా కోసం ఓ కథ సిద్ధం చేశాడు. అయితే తాను కథ వినిపించినప్పుడు, అప్పటికే మహర్షి సినిమా చేస్తున్నాను. సుకుమార్ చెప్పిన కథ ఇంటెన్స్‌తో కూడుకున్నది, పైగా సీరియస్ కథ. నాకు సీరియస్‌గా కాకుండా ఫుల్ ఎంటర్‌టైనర్ ఇవ్వాలన్న ఆలోచన ఉంది. అదే విషయం సుక్కుకి చెప్పా. తాను కూడా సరే అలాంటి కథ వస్తే చూడండి, మనం తరువాత చేద్దామని చెప్పాడు. అప్పుడే అనిల్ రావిపూడి చెప్పిన కథ బాగా నచ్చింది. అందుకే ఆ సినిమాను సెట్స్‌పైకి తీసుకువస్తున్నా.
అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడు?
-జూన్ చివర్లో. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.
అల్లరి నరేష్ పాత్ర ఎలా వుంటుంది?
-ఈ సినిమాలో నరేష్‌ది చాలా మంచి పాత్ర. వంశీ కథ చెప్పినప్పుడే అల్లరి నరేష్ పేరు చెప్పాడు. తాను పాత్రకు తగ్గట్టు బాగా చేశాడు.
హీరోయిన్ పూజా హెగ్డే అందమైన అమ్మాయి.. పైగా మంచి నటి కూడా. ఈ సినిమాలో చక్కగా చేసింది. తప్పకుండా తనకు మంచి ఫ్యూచర్ వుంది.
మీరు కొత్త దర్శకులతో పనిచేయకపోవడానికి కారణం?
-కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించాలన్న ఆలోచన ఉంది. అయితే నాకోసం కొత్త దర్శకులు మంచి స్క్రిప్ట్‌తో ఎవరూ సంప్రదించలేదు. నేను కూడా కొత్త తరహా సినిమాలు చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. సరైన స్క్రిప్ట్ వస్తే తప్పకుండా చేస్తా.
ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ గురించి ఏమి చెబుతారు?
-ఇది నా ఆరేళ్ళ కల. హైదరాబాద్‌లో ఇండియాలోనే బెస్ట్ మల్టీప్లెక్స్ ఉండాలన్న ఆలోచన కలిగింది. ఆ ఆలోచనను ఆసియన్ సినిమాస్ వాళ్లకు చెప్పాను. నేను చెప్పినట్టుగానే ఇండియా బెస్ట్ థియేటర్ అనుభూతి ప్రేక్షకులకు కలిగేలా అన్ని రకాల ఉన్నత సాంకేతిక విలువలతో ఇక్కడ మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. అది నాకు ఒకరకంగా గర్వంగా ఉంది.
మీ బ్యానర్ నుండి వరుస సినిమాలు చేస్తారని అంటున్నారు?
-అవును.. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ విషయంలో నమ్రత అన్నీ దగ్గరుండి చూసుకుంటోంది. మన దగ్గర టాలెంట్ వుంది. దాన్ని అందుకోవాలన్నది మా ప్రయత్నం.
మళ్లీ మల్టీస్టారర్ సినిమాలు చేయడం లేదు? కారణం?
-మల్టీస్టారర్ సినిమాలు చేయడం ఆషామాషీ కాదు. ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తూ కథ నడిపించాలి. సీతమ్మ వాకిట్లో... తరువాత ఆ తరహా స్క్రిప్ట్ నా దగ్గరికి రాలేదు. నేను కూడా రామ్‌చరణ్, ఎన్టీఆర్ లాంటి అందరి హీరోలతో సినిమాలు చేయాలనీ ఉంది. చూద్దాం..
తదుపరి చిత్రాలు?
-అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా జూన్‌లో మొదలవుతుంది. అలాగే రాజవౌళి దర్శకత్వంలో కెఎల్ నారాయణ నిర్మించే సినిమా ఒకటి ఉంటుంది. దానికి ఇంకాస్త సమయం పడుతుందేమో!

-శ్రీనివాస్ ఆర్ రావ్