మెయిన్ ఫీచర్

రంగమార్తాండుని మహాభినిష్క్రమణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నకర్మణా న ప్రజయా ధనేన / త్యాగే నైకేన అమృతత్వ మానశుః’’ అన్నారు పెద్దలు.
అజో.విభొ సంస్థవారు జనవరి 2019 మొదటి వారంలో తెనాలిలో మహాసభలు నిర్వహించారు. ప్రతి సంవత్సరము వారు ఒకే మహనీయునకు జీవన సాఫల్య పురస్కారం క్రింద లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తున్నారు. ఈ ఏడాది ప్రొఫెసర్ మొదలి నాగభూషణశర్మగారికి ఈ సత్కారం జనవరి 6వ తేదీన జరిగింది. సరిగ్గా పది రోజులు తిరగకముందే జనవరి 15వ తేదీ సంక్రాంతి పర్వదినంనాడు ఆయన తిరిగి రాని లోకాలకు తరలిపోయారు.
నాగభూషణశర్మగారి పేరు చెప్పగానే ఒక ఉత్తమ అధ్యాపకుడు, ఒక కళాద్రష్ఠ, త్రష్ఠ, రంగప్రయోక్త, నటుడు, విమర్శకుడుగా మన కన్నుల ముందు సాక్షాత్కరిస్తారు. అసంఖ్యాకమైన గ్రంథాలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. నాటక రంగానికి సంబంధించి వివిధ గ్రంథాలు ప్రచురించారు. పత్రికా సంపాదకత్వం వహించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆంగ్లశాఖాధ్యక్షులుగా డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌గా సేవలను అందించారు. డ్రమట్రెజీ డిపార్ట్‌మెంట్‌లో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేశారు. వివిధ విద్యాసంస్థలలో, సదస్సులలో పత్ర సమర్పణ చేసి తమ విద్వత్తు చాటుకున్నారు. కుమ్మరి వీధిలో కుండలు అమ్మడం దుస్సాహసం. అలాగే తెనాలిలో వారు నాటక ప్రదర్శనం ఇవ్వటమే కాకుండా చివరి రోజులలో అక్కడే మల్లాదివారి వీధి నాజర్‌పేటలో స్థిరపడ్డారు. భార్యా వియోగంతో ఆయన మానసికంగా కొంత క్రుంగిపోయినా, సాహిత్య కళారంగ సేవలను నిరవధికంగా సాగించారు. గొంతు క్యాన్సర్ వ్యాధితో కొద్దికాలం అస్వస్థతను అనుభవించి 2019 జనవరి 15వ తేదీ తెనాలిలోనే తుది శ్వాస విడిచారు. తొలి తెలుగు నాటకకర్తలలో ప్రఖ్యాతుడై ఆంధ్ర భాషలో అజరామరమైన నాటకాలను రాసి ఆ నాటకాలకు దర్శకత్వం వహించి తాను స్థాపించిన సరస వినోదినీ సభ ద్వారా ప్రదర్శించి ఆ నాటకాలలో నటించి తెలుగు నాటకానికి సుస్థిరతను, దేశవ్యాప్తిని కలిగించిన నాటకకర్త ‘ఆంధ్ర నాటక పితామహ’ బిరుదాంకితుడు శ్రీ ధర్మవరము రామకృష్ణమాచార్యులు. ఆయన నాటకాలలో లభ్యమైన 20 నాటకాలను మూడు సంపుటాలలో ఆచార్యులవారి కుటుంబ సభ్యుల పక్షాన ప్రచురించడం జరుగుతున్నది.
మూడవ సంపుటిలోని నాటకాలు: 1. అజామిళ 2. ఉషాపరిణయము 3. హరిశ్చంద్ర 4. ప్రచండ గాధేయము 5. కురుక్షేత్ర నాటకము లేదా యుధిష్ఠిర పట్ట్భాషేకము 6. యుధిష్ఠిర వరాజ్యపట్ట్భాషేకమ (2 అంకములు) అనుబంధాలు.
ఆంగ్లంలో'Bellari Raghava', 'The Folk Performing Arts of Andhra Pradesh', The Shadow puppet Theatre of Andhra', 'A History of the Surabhi Theatres, 'Kuchipudi: Gurus, Performers and Performance Traditions' వంటి పదిహేను విమర్శనాగ్రంథాలను, తెలుగులో ‘తెలుగు సాహిత్యం: గాంధీజీ ప్రభావం’, ‘నవలా వికాసం’, ‘నాటక శిల్పం’, ‘స్థానం నరసింహారావు నట జీవన ప్రస్థానం’, ‘కల్యాణం రఘురామయ్య జీవితం’ వంటి ఇరవై విమర్శనా గ్రంథాలతోపాటు ‘నూరేళ్ల తెలుగు నాటక రంగం’, రాజమన్నారుగారి ‘తప్పెవరిది?’ వంటి పది గ్రంథాలకు సంపాదకత్వం వహించారు.
వివిధ అంతర్జాతీయ, జాతీయ పత్రికల్లో ఆంగ్లంలోను, తెలుగులోనూ వంద పరిశోధక వ్యాసాలను ప్రచురించారు. పది ఆంగ్ల నాటకాలకు, అరవై తెలుగు నాటకాలకు దర్శకత్వం వహించారు. ‘ప్రజానాయకుడు ప్రకాశం’, ‘కాయితం పులి’, ‘దొరా, నీ సావు మూడింది’, ‘రేపటి స్వర్గం’ వంటి ప్రయోగాత్మక తెలుగు నాటకాలకు ప్రసిద్ధులు. ‘నర్తనం’ అనే ఆంగ్ల త్రైమాసిక పత్రికకు వ్యవస్థాపక సంపాదకులు. భారతీయ నాటక, నృత్య, జానపద కళలకు సంబంధించిన పలు జాతీయ సంస్థలలో సభ్యుడు. ప్రఖ్యాత సంస్కృత, ఆధునిక భారతీయ, పాశ్చాత్య నాటకాలు- మృచ్ఛకటిక, ముద్రారాక్షసం, భగవదజ్జుకీయం, రాజా ఈడిపస్, మాక్‌బెక్, ఎంపరర్ జోన్స్, వెయిటింగ్ ఫర్ గోడో వంటి నాటకాలను తానే అనువదించుకుని రంగస్థలం మీద ప్రయోగించారు. 20 ఇంగ్లీషు నాటకాలకు, 60 తెలుగు నాటకాలకు దర్శకత్వం వహించారు. నూరేళ్ల తెలుగు నాటక రంగం, ఆచార్య ఆత్రేయ, కన్యాశుల్కం- నూరేళ్ల సమాలోచనం, బళ్ళారి రాఘవ, తెలుగు నవలావికాసం, తెలుగు సాహిత్యం- గాంధీజీ ప్రభావం, నాటకకర్త చిలకమర్తి వంటి గ్రంథాలు వారి విమర్శనా పటిమను వెల్లడిస్తాయి. జానపద ప్రదర్శక కళారూపాలను ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఆంధ్ర దేశం నలుమూలలా దిగ్విజయంగా ప్రదర్శిస్తున్న ‘‘ప్రజానాయకుడు ప్రకాశం’’ వీరి ఇటీవలి రచన, ప్రయోగం.
జాతస్య హి ధృవో మృత్యుః అన్నట్లు పుట్టినవారు గిట్టక మానరు. కాని వారి వ్యక్తిత్వం వక్తృత్వం శేముషీలై దగ్ధ్యం ప్రపంచంలో శాశ్వతంగా మిగిలిపోతుంది. నటరాజ పాద మంజీర శింజినీ నిక్వాణంగా ఎనిమిది దశాబ్దాలు వెలిగిన ఒక ధృవతార రాలిపోయింది. వారికి ఇదే అక్షరాంజలి.

- జొన్నాభట్ల నరసింహప్రసాద్