మెయిన్ ఫీచర్

ఊరిస్తోన్న ఖద్దరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాకు -రాజకీయం కొత్తకాదు. తరువాత రాజకీయానికీ -సినిమాతో సంబంధాలు పెరిగాయి. రెంటిమధ్య కనెక్టివిటీ -ఆడియన్స్‌కి అలవాటైన అనుభవమే. ఆన్‌స్క్రీన్ దాటి పొలిటికల్ స్క్రీన్‌మీద సత్తా చూపించినోళ్లు, చితికిలబడినోళ్లు కోకొల్లలు. ఈ సంబంధాల నేపథ్యంలో -సీజన్లవారీగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమాలు రూపుదిద్దుకోవడం చాలాకాలంగా జరుగుతోంది. కాకపోతే -కొన్ని సినిమాలు టార్గెట్లతో వచ్చాయి. ఇంకొన్ని టార్గెట్ లేకుండా -రాజకీయ కథా వస్తువుతో వ్యాపారాత్మకంగా వచ్చాయి. మొత్తం కోణంలో -తెలుగు సినిమా పాత్ర చిన్నదేమీ కాదు.
గత రెండేళ్లుగా తెలుగు స్క్రీన్‌పై ‘ఖద్దరు’ తళతళలాడుతోంది. స్టార్ హీరోలు సైతం ‘పాలిట్రిక్స్’ పట్ల ఆసక్తి చూపించడం కనిపిస్తోంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆకర్షిస్తోన్న రాజకీయం -స్క్రీన్‌పైకి సినిమాగానూ వస్తోంది. పెద్ద హీరోలు సైతం -్భరీ బడ్జెట్‌తో ఈ తరహా కథలు ఏరుకుని స్క్రీన్‌కు వస్తుండటం తాజా పరిణామం. నిజానికి రాజకీయ నేపథ్యాన్ని తెలుగు స్క్రీన్‌మీద చూపడం ఇప్పుడే మొదలైందేమీ కాదు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచే ‘పాలిటిక్స్’ స్క్రీన్‌మీదకొచ్చింది. అందులో మంచిని చూపించారు కొందరు. అవకతవకలను కథలు చేసుకున్నారు ఇంకొందరు. రాజకీయ చీకట్లోని కుట్రలు, కుతంత్రాలను ఆడియన్స్‌కి అందించినోళ్లూ ఉన్నారు. ఎన్నికల ముందు ‘అధికారాన్ని’ తూర్పారబట్టేందుకూ కొన్ని చిత్రాలొచ్చాయి. అంటే, టార్గెట్ బేస్‌డ్. ఒక్కో సీజన్‌లో.. ఒక్కో హీరో.. ఒక్కోతరహా పొలిటికల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినోళ్లే. అందరి అజెండా -రాజకీయం.
****
భారత రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న గొప్ప పరిమాణం -నోటా. ‘కాల్ బ్యాక్’ సిస్టమ్‌కు బలాన్నిచ్చే అంశమిది. సింపుల్‌గా చెప్పాలంటే -నచ్చని రాజకీయ పార్టీని, రాజకీయ ప్రతినిధిని తిప్పికొడుతున్నానంటూ ఎన్నికల్లో ప్రయోగించడానికి ఓటరుకు దొరికిన గొప్ప ఆయుధం. తాజాగా ఆ టైటిల్‌తో వచ్చిన ద్విభాషా చిత్రమే -నోటా. పెళ్లిచూపులతో గుర్తింపు సంపాదించి, అర్జున్‌రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రధాన పాత్ర కావడంతో ఊరూ వాడా -నోటా మాట వినిపించింది. ఈ తాజా పరిణామానికి కొద్ది రోజుల క్రితం ఇలాంటి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తోనే స్టార్ హీరో మహేష్‌బాబు ఓ సినిమా చేశాడు. ఓ సామాన్య కుర్రోడు ముఖ్యమంత్రి అయితే? అన్న ప్రశ్నకు సమాధానంగా వచ్చిన చిత్రమే ‘్భరత్ అను నేను..’. దీంతో టాలీవుడ్ స్క్రీన్‌పై మళ్లీ రాజకీయ సిత్రాలు మెరుస్తున్నాయన్న స్పృహకు ప్రేక్షకుడు వస్తున్నాడు. నిజానికి తెలుగు స్క్రీన్‌పై పొలిటికల్ సిత్రాలు తక్కువేం కాదు. అప్పట్లో సమితి ప్రసిడెంట్, సర్పంచ్ రాజకీయాలను తెలుగు సినిమా -ప్రేక్షకుడి ముందుకు తెచ్చింది. మారుతోన్న కాలాన్నిబట్టి రాజకీయ కథలూ మారాయి. ఎమ్మెల్యే, ఎంపీల పాత్రలతో విలనిజాన్ని సృష్టించి, వాడి ఆగడాలను ఎదిరించే హీరో పుట్టుకొచ్చే కథలూ ప్రేక్షకులకు అందాయి. తరువాతి కాలంలో ముఖ్యమైన క్యారెక్టర్ ఆర్టిస్టుకు రాజకీయ పాత్రనిచ్చి, హీరో వెన్నంటివుంటూ రాజకీయాన్ని బతికించే కథలూ తెలుగు ప్రేక్షకులకు అందాయి. స్థూలంగా చెప్పుకోవాలంటే -ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌ల కాలంలో అనేక సినిమాలు ఉదాత్త సందేశాన్ని ఆడియన్స్‌కు అందించాయి. తరువాతి కాలంలో వ్యక్తులను టార్గెట్ చేస్తూ వచ్చిన సినిమాలూ లేకపోలేదు. ముఖ్యంగా సూపర్‌స్టార్ కృష్ణ కాంగ్రెస్ పక్షాన నిలబడి నాపేరే ప్రభంజనం చేస్తే, ఎన్టీఆర్ వేషంలో కోట శ్రీనివాస్ మండలాదీసుడు.. ఇలాంటి చిత్రాలు చేశారు. రాజకీయాల్లో వెలిగిపోతున్న ఎన్టీఆర్‌ను టార్గెట్‌చేస్తూ వచ్చిన రాజకీయ కథలు అప్పటి సినీ వ్యాపార వస్తువులయ్యాయి. తరువాత -మార్కెట్‌లో ఓ ముఠాకు మేస్ర్తీగావున్న చిరంజీవి అనూహ్య అవకాశంతో ముఖ్యమంత్రి సీట్లోకూర్చుని, రాజకీయాలను ప్రక్షాళన చేసిన కథలూ తెలుగు ప్రేక్షకుడికి తెలిసిందే. మొత్తంగా ‘రాజకీయం’ అనే వస్తువును సినిమాకు అన్వయించుకుని హిట్టుకొట్టిన సినిమాలు కొన్ని, చతికిలబడిన చిత్రాలు ఇంకొన్ని.
గత దశాబ్దకాలంలో తెలుగు సినిమా గొప్ప ‘రాజకీయానే్న’ పండించింది. చిన్నవాడైనా.. స్టార్‌హీరో అయినా.. అంతా ఏదోక కోణంలో రాజకీయాన్ని టచ్ చేస్తూనే ఉన్నారు. దగ్గుబాటి రాణా ‘లీడర్’, ‘నేనే రాజు నేనే మంత్రి’, మహేష్‌బాబు ‘్భరత్ అను నేను’, రామ్‌గోపాల్‌వర్మ ‘వంగవీటి’, బాలకృష్ణ ‘లెజెండ్’, నారా రోహిత్ ‘ప్రతినిధి’, శర్వానంద్ ‘ప్రస్థానం’, రాజశేఖర్ ‘ఎవడైతే నాకేంటి?’.. ఇలా ఎన్నో చిత్రాలు నేరుగా రాజకీయ ముఖచిత్రంగానో లేదా నేపథ్యంతోనో వచ్చినవే. ఇంకొనే్నళ్లు వెనక్కెళ్లిచూస్తే -ఆపరేషన్ దుర్యోధన, అధినేత, దరువు, గణేష్, ముకుందలాంటి చిత్రాల్లోనూ ‘రాజకీయమే’ ప్రధానాంశంగా కనిపిస్తుంది.
**
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే చిత్రాలన్నీ ఎక్కువ శాతం ప్రాంతీయ చిత్రాలే. మరీముఖ్యంగా దక్షిణాది చిత్రాలకే రాజకీయం అనేది గొప్ప కథావస్తువుగా స్థిరపడింది. జాతీయస్థాయి అంటే బాలీవుడ్ చిత్రాల్లో పూర్తిస్థాయి రాజకీయ ముఖ చిత్రంతో వచ్చే చిత్రాలు తక్కువ ఉండటానికి కారణం లేకపోలేదు. జాతీయ రాజకీయాలను కథా వస్తువుగా మలచుకోవడం అంత సులువు కాదు. పైగా, ఆ కథా వస్తువుతో అన్నిప్రాంతాల ప్రేక్షకులను మెప్పించడం సాధ్యం కాదు కూడా. అందుకే ఇటీవిల కాలంలో బాలీవుడ్‌లో ‘రాజ్‌నీతి’, ‘ఇందు సర్కార్’వంటి చిత్రాలే తెరకెక్కాయి. అదీ కేంద్రంలో చక్రం తిప్పే రాజకీయ నేతల పాత్రలతో మాత్రమే. కానీ, ప్రాంతీయ చిత్రాల్లో రాజకీయ పాత్రలను అద్భుతంగా చూపించే అవకాశం ఉంటుంది. అందుకే -రాజకీయ నేపథ్యంతో ఎక్కువ ప్రాంతీయ చిత్రాలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఎన్నికల వాతావరణం ఆవరించే సందర్భాల్లో ఈ తరహా చిత్రాల జోరు కనిపిస్తూ ఉంటుంది. పైగా దిక్షణాది సినిమాలకు, రాజకీయాలకు బలమైన కనెక్టివిటీ ఉండటంతో -ఏ భాషలో రాజకీయ నేపథ్య చిత్రాన్ని నిర్మించినా మిగతా భాషల్లోకీ అనువాదంగా ఆ చిత్రాలు వెళ్తూనే ఉన్నాయి. హీరో మహేష్ చేసిన ‘్భరత్ అను నేను’ చిత్రం అటు తమిళం, ఇటు మలయాళం భాషల్లోనూ విడుదలై 230 కోట్ల గ్రాస్ సాధించిందంటే కారణం ఇదే. ఈ ఏడాదే కన్నడలో ‘అవినీతి కార్పొరేటర్’ కథగా వచ్చిన చిత్రం అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. 2016లో తమిళంలో స్టార్ హీరో ధనుష్, త్రిషాకృష్ణన్‌లు రాజకీయ ప్రత్యర్థులుగా చూపిస్తూ వచ్చిన ‘కోడి’ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తరువాత పొలిటికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘కో’గాని, మలయాళం సూపర్‌స్టార్ దిలీప్ చేసిన రాజకీయ నేపథ్య చిత్రంగానీ గొప్ప విజయాలు సాధించినవే. అలాగే రాజకీయ నేపథ్యంగా వచ్చిన సందేశం, ముదల్వన్ చిత్రాలూ గొప్ప వసూళ్లనే రాబట్టాయి. దారితప్పిన రాజకీయాలను ఎత్తిచూపిస్తూ ఇటీవల చిరంజీవి చేసిన ‘ఖైదీ నెం 150’, రాజకీయ దుర్నీతిని ఎండగడుతూ విజయ్ చేసిన మెర్సల్ చిత్రాలూ ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
గత కొద్దిరోజులుగా తమిళనాడులో వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాలను కథగా అల్లుకుని విజయ్ దేవరకొండ చేసిన చిత్రమే -నోటా. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ వాతావరణం వేడెక్కి ఉండటంతో కాస్త అటూ ఇటూ మార్పులతో ద్విభాషా చిత్రంగా తీసుకొచ్చారు. సినిమా ఎలాంటి విజయాన్ని సాధించిందన్న విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడితే -మళ్లీ రాజకీయ నేపథ్యంతో కథలల్లుకుని చిత్రాలు చేసేందుకు ఇటీవల వస్తోన్న చిత్రాలు ఊపునిస్తున్నాయని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సిన పనిలేదు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు ప్రకటించి నేపథ్యంలో కొత్త చిత్రాలు తెరకెక్కే అవకాశం లేకపోలేదు. *