మెయిన్ ఫీచర్
కథ నడిచేది కాంబినేషన్‌తోనే....
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
** వెండితెర మీద వెలుగులు విరజిమ్మాలంటే పాత్రల్లోని నటులు ఆ పాత్రల్లో జీవించాలి. అలా జీవించాలంటే ఆ పాత్రల్లో నటించిన నటుల మధ్య, కాంబినేషన్ బాగుండాలి. ప్రతీ ఇద్దరిమధ్య కాంబినేషన్ బాగుండాలనేదేమీ లేదు. ఆ పాత్రలు, హీరో, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు, స్నేహితులు, విలన్స్, వ్యాంప్ క్యారెక్టర్లు ఏవరయినాసరే అందరి మధ్యన అంతగా పండవు. అవి పండించాలంటే, పాత్రలు ఒకదానికొకటి సింక్ కావాలంటే కొన్నికొన్నిసార్లు ఆ పాత్రలకు తగ్గట్లుగా నటీనటులను ఏరికోరి ఎంచుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ సాధించకపోవచ్చు. అలా ఏరికోరి పాత్రలకు సరిపోయేటటువంటి నటీనటులను మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులను ఎంచుకోవడంలో దర్శకులు బాగా తర్జనభర్జన పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే కథకు తగినట్లుగా హావభావాలు పలికించే నటులు లేకపోతే కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ప్రేక్షకులు కూడా ఆదరించలేరు. ఇప్పటి పెద్దపెద్ద హీరో, హీరోయిన్లు కూడా ఒకప్పటి సాధారణ హీరో హీరోయిన్లనే చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ప్రతి పరిశ్రమల్లోనూ ఉన్నాయి. పాత్రల్లోని నటుల మధ్య కాంబినేషన్‌ను ప్రేక్షకులు ఖచ్చితంగా గమనిస్తున్నారు.
=====================================
మొదటితరం నటులు రమణారెడ్డి. చూడటానికి చాలా బక్కపలుచగా ఉన్నప్పటికీ ఆయన కామెడీ చాలా అద్భుతంగా ఉండేది. ఆ తరువాత రావుగోపాలరావు, అల్లు రామలింగయ్యల మధ్యన పాత్రల సందడి భలేగమ్మత్తుగా ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో చాలా సినిమాలు వచ్చాయి. ఆ తరువాత సుత్తివేలు, చిడతల అప్పారావుల నటన ఏం తక్కువకాదు. రాజబాబు-రమాప్రభల జోడీ అదిరిపోయేది. రానురాను కోట శ్రీనివాసరావు- బాబుమోహన్‌ల బంధం చెప్పలేనిది. ‘మామగారు’ చిత్రంలో హీరో మామ పాత్రలో కోట శ్రీనివాసరావు, బిచ్చగాడి పాత్రలో బాబుమోహన్ ప్రతి మాటకు దెబ్బలుతినే సన్నివేశాలు ఆ సినిమాకు భలే హాస్యాన్ని జోడించాయి. ఆ సినిమా సెంటిమెంటల్ ఎమోషన్స్ ఉన్న సినిమానే అయినప్పటికీ వీరిద్దరి కాంబినేషన్‌లో కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ‘ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలో వెంకటేష్ స్నేహితుడి పాత్రలో బ్రహ్మానందం నటనతోపాటు కోట శ్రీనివాసరావు జోడీ అదిరిపోయింది. అరగుండుతో బ్రహ్మానందం - కోట శ్రీనివాసరావు పిసినారితనం ఇద్దరికీ మంచి పేరుతెచ్చిపెట్టాయి. అంతకుముందు వచ్చిన సినిమాల్లో గిరిబాబు, కైకాల సత్యనారాయణ, సుధాకర్, మోహన్‌బాబుల కామెడీ 1980, 1990 దశాబ్దాల్లో ఒక ఊపుఊపాయని చెప్పవచ్చు. బ్రహ్మానందం - కోవైసరళలు తెరపై కనబడితే నవ్వులే నవ్వులు. ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ చిత్రంలో రాజేంద్రప్రసాద్- గుండు హనుమంతరావుల కాంబినేషన్ బాగుంది. అగ్ర నాయకుల మధ్యకూడా కాంబినేషన్ ఎప్పట్నుంచో ఉంది. ‘కృష్ణార్జునులు’ సినిమాలో శోభన్‌బాబు, కృష్ణ, జయప్రద, శ్రీదేవి నటీనటులుగా నటించిన మంచి విలువలున్న చిత్రం. ఇందులో వీరందరూ అగ్ర నాయికానాయకులే. అయినప్పటికీ ఈ నలుగురు నటించడంవల్లనే ఆ పాత్రలు జీవం పోసుకున్నాయి. ఈ చిత్రంలో శోభన్‌బాబు, శ్రీదేవి అన్నాచెల్లెలుగా నటించారు. కృష్ణ, శోభన్‌బాబు స్నేహితులుగా నటించారు. ఇక కృష్ణ, మహేష్‌బాబు, రమేష్‌బాబు ముగ్గురు అన్నాతమ్ముళ్ళుగా నటించారు. ‘వేగుచుక్క- పగటిచుక్క’ చిత్రంలో భానుచందర్, అర్జున్‌లు అన్నాతమ్ముళ్ళుగా నటించారు. వీరిద్దరూ ఒకప్పుడు అగ్ర హీరోలే.
కథానాయిక, కథానాయకుల విషయానికొస్తే... ఎన్.టి.ఆర్.తో సావిత్రి, జమున, శ్రీదేవి లాంటి హీరోయిన్లతో తీసిన చిత్రాలు ప్రేక్షకుల మదిని దోచాయని చెప్పవచ్చు. అదే విధంగా ఏఎన్నార్ సావిత్రి, జమున, శ్రీదేవి, భానుమతి, కృష్ణ-శ్రీదేవి, విజయనిర్మల, జయసుధలు, శోభన్‌బాబు- వాణిశ్రీ, శ్రీదేవి, శారదలు, మురళీమోహన్ -శ్రీదేవి, జయసుధ, చంద్రమోహన్-శ్రీదేవి, కైకాల సత్యనారాయణ- శారద, వాణిశ్రీలు, మామగారులో సాధారణ మధ్యతరగతి కుటుంబ వాతావరణంలో హీరో అక్కా-బావలుగా కోట శ్రీనివాసరావు-అన్నపూర్ణలు, ఆకలిరాజ్యం చిత్రంలో కమల్‌హాసన్- శ్రీదేవి, మోహన్‌బాబు- జయసుధ, భానుప్రియ, (పెదరాయుడులో మోహన్‌బాబు-్భనుప్రియ) అభినయం అజరామరం. సుమన్-విజయశాంతి, భానుప్రియ, బాలకృష్ణ-విజయశాంతి (నిప్పురవ్వ, లారీడ్రైవర్, మంగమ్మగారి మనవడు), ఆదిత్య 369 (బాలకృష్ణ-మోహిని), రాజశేఖర్-జీవిత, చిరంజీవి-్భనుప్రియ, రాధ, రాధిక, శ్రీదేవి (జగదేకవీరుడు-అతిలోక సుందరి), విజయశాంతి, రజని, సుహాసిని, వెంకటేష్-శ్రీదేవి, సౌందర్య (ఇంట్లోఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు) వీరందరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులు బాగా ఆదరించారు. నిర్మాతలకు కూడా ఆర్థికంగా కలిసివచ్చిందని చెప్పవచ్చు.
ఇక ఇప్పుడు వచ్చే సినిమాలు ఒక్క హీరోయిన్, ఒక్క హీరోతో చేసేటప్పటికే మళ్లీ అదే హీరోతో చేసే అవకాశాలు రావటంలేదు. హీరో, హీరోయిన్లు ఎంత పెద్ద స్టార్లయినప్పటికీ ఒకప్పుడు ఒకే హీరో, ఒకే హీరోయిన్ చాలా సినిమాల్లో నటించారు. దీనికి కారణం నటీనటులు పెరిగిపోవటం కావొచ్చు, ఇద్దరిమధ్య కెమిస్ట్రీ బాగోలేకపోవచ్చు.
కమెడియన్ల విషయానికొస్తే... ఎ.వి.ఎస్, బ్రహ్మానందంల మధ్యన కామెడీ అత్యద్భుతంగా పండిందని చెప్పవచ్చు. రాళ్లపల్లి-రాజేంద్రప్రసాద్, సునీల్- బ్రహ్మానందం నటించిన ‘నువ్వులేక నేను లేను’ చిత్రం, తెలంగాణ శకుంతల- వేణుమాధవ్, ఎమ్మెస్ నారాయణ- ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం-విష్ణు, బ్రహ్మానందం-ఆలీ ఇక ఇప్పుడు వస్తోన్న జూనియర్ నటులు చమక్‌చంద్ర- రచ్చ రవి, వేణు, సుధాకర్, రఘు, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ వీళ్ళందరూ జబర్దస్త్‌లాంటి ప్రోగ్రాంతోపాటు సినిమాల్లో కూడా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తున్నారు.