మెయిన్ ఫీచర్

వివాదాలు మామూలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో ప్రతి చిన్న సమస్యను వివాదాస్పదం చేయడం మామూలైపోయింది. ఏ చిన్న అవకాశం దొరికినా వివాదం చేసేందుకు అవకాశవాదులు సిద్ధంగా వుంటున్నారు. అదేదో ‘అలెగ్జాండర్ ది గ్రేట్’ సేనలా మంగోలియన్ లెజండ్ కింగ్ ‘్ఛంగిస్ ఖాన్’ సేనలా, తమ చెత్త చెదారాల గ్రూపులకు ఏదో ‘సేన’ అని పేరు పెట్టుకుంటున్నారు. మంచి పనిచేస్తే హర్షించవచ్చు. పనికి మాలిన పనులందు తల దూర్చడం లేనిపోని గొడవలు, అల్లర్లు చేస్తూ తామేదో ‘శాంతిదూతల’మన్నట్లు ప్రవర్తించడం చూస్తుంటే వారంతా సంస్కార హీనులుగా కనిపించారు. దానికి ఉదాహరణ ‘సంజయ్ లీలా భన్సాలీ’ నిర్మించి కళాఖండం ‘పద్మావతి’ చిత్రం. చిత్రరంగంలో చారిత్రాత్మక చిత్రాలు నిర్మించిన వారంతా దేశభక్తితో మన చిత్ర హీరో (హీరోయిన్)లను గొప్ప పాత్రలుగా సృష్టించి, విదేశీ వీరుల గొప్పతనాన్ని తగ్గిస్తూ చిత్రాలను నిర్మిస్తున్నారు. అలా నాడు ఆంగ్లేయుల వీరత్వాన్ని తగ్గిస్తూ ‘ఝాన్సీ రాణి’ పాత్రను హైలైట్ చేశారు. ‘వీర పాండ్య కట్ట బొమ్మన’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘చాణక్య-చంద్రగుప్త’ చిత్రాలలో మనవారి పాత్రలను హైలెట్ చేయడం, విదేశీ వీరులను తగ్గించి చూపడం మనకు తెలియంది కాదు. ఓటమి ఎరుగని వీరుడు, ప్రపంచ విజేత ‘అలెగ్జాండర్’ పాత్రను ఓ మెట్టు తగ్గించి, ‘వౌర్వ చంద్రగుప్తు’ని పాత్రను పురుషోత్తముని పాత్రను గొప్పగా రెండు మెట్లు ఎక్కించి ‘చాణక్య-చంద్రగుప్త’ చిత్రం నిర్మించారు. మనం చూశాం, ‘బొబ్బిలి యుద్ధం’ లాంటి అనేక మన వీరగాథల గురించి గొప్పగా చెప్పుకున్నా, పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా చూపించినా, సినిమాలు నిర్మించినా చరిత్రలో ‘ప్రపంచ విజేత అలెగ్జాండర్’ కీర్తిగౌరవానికి భంగం కలగదు. మబ్బు కమ్ముకోదు. అలెగ్జాండర్ ‘అలెగ్జాండరే’’, చంద్రగుప్తుడు ‘చంద్రగుప్తుడే’, మనం ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ‘పద్మావత్’ చిత్ర నిర్మాణ ఆరంభం నుండి పలుమార్లు ‘కర్ణిసేన’ వివాదాస్పదం చేస్తూనే ఉంది. చిత్రం ఇంకా నిర్మించలేదు. చిత్రం చూసినట్లు, తామేదో చరిత్ర చదివి, అవగాహనతో ఉన్నట్లు చిత్ర నిర్మాణానికి ఆటంకం కల్గించారు. లక్షలతో నిర్మించిన ‘సెట్’లను అంటుపెట్టారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. మరికొందరు ఉగ్రవాద మనస్కులు పద్మావతి పాత్రధారిణి ‘దీపికను’ ‘్భన్సానీ’ని చంపాలని ‘బహుమతి’ ప్రకటించడం చూస్తుంటే మనం ఇంకా ఆదిమానవులమా? అనిపిస్తుంది. చిత్రం చూసి తప్పులు పడితే అంగీకరించవచ్చు. చిత్రం చూడక ముందే అలా వివాదాస్పదం చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనం. ఆ చిత్రాన్ని ‘దీపావళికి’, హిందీ-తమిళ్- తెలుగు భాషల్లో విడుదల చేయ సంకల్పించారు భన్సాలీ. ఆ కర్ణిసేన ఆగడాల వల్ల దేశవ్యాప్తంగా వాదోపవాదాలు జరిగాయి. అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్లారు. సెన్సార్ వారిపై చిందులు వేశారు. ఫలితంగా న్యాయస్థానం చిత్ర విడుదలకు పచ్చజెండా వూపింది. మేధావులు, విమర్శకులు, సెలబ్రెటీలు ఆ చిత్రం చూసి చాలా బావుంది. చరిత్రను వక్రీకరించలేదని, రాజపుత్రుల వంశానికి గౌరవభావం కలిగించారని సెలవిచ్చారు. అయినా ఆ మూర్ఖసేన విధ్వంసం సృష్టించింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసింది. అల్లరిమూకలుగా రోడ్డెక్కింది. ప్రజా జీవనానికి ఆటంకం కలిగించింది, శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది. ఆ మూర్ఖసేన మూర్ఖత్వం వల్ల చిత్రం పేరు ‘పద్మావతి’ కాస్త ‘పద్మావత్’గా మార్చి, కొన్ని దృశ్యాలను తొలగించి జనవరి 25న ఆ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు భన్సాలీ. మన చిత్రాలలో రాజకీయ నాయకులను (ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రులను) ప్రతి నాయకులుగా అంటే విలన్లుగా చూపిస్తున్నారు. మరి అలాటి రాజకీయ నాయకులు అభ్యంతరం చెప్పారా? లేదే! పోలీసు అధికారులను రాజకీయ నాయకులకు తొత్తులుగా చూపిస్తున్నారు. మరి వారంతా అభ్యంతరం చెప్పలేదే? సంఘంలో సెలబ్రిటీలు, అమాయకులుగా కనిపించే బడాబాబులు అరాచకాలు చేస్తున్నట్లు చూపిస్తుంటే అట్టి వారంతా అభ్యంతరాలు చెప్పలేదే? వారందరికీ తెలుసు జ్ఞానముంది కాబట్టి ఇది సినిమా, అంతా కల్పితమేనని. సినిమా ప్రేక్షకులకు వినోదం కల్గిస్తుంది. కాలక్షేపమందిస్తుంది. అంతవరకే మనం చూడాల్సింది. ప్రేక్షకులకు వినోదం కావాలి. చరిత్రలు, నిజానిజాలు, యదార్థ సంఘటనలు, నవల, కాకమ్మ కథలు అని ఆలోచించరు. ఓ రెండు గంటలపాటు కాస్త రిలీఫ్ కావాలి. కాస్త నవ్వుకుని శారీరక బాధలు, ఉన్న మానసిక వేదనలు మరచిపోతారు. పోరాటంలో ‘మైక్ టైసన్ను’, ‘బ్రహ్మానందం’చితక్కొట్టినట్లు చూపించినా హాయిగా నవ్వుకుంటూరే తప్ప మైక్ టైసన్ను, బ్రహ్మానందం కొడతాడా? అని ఆలోచించరు. దానే్న వినోదం అనుకోవాలి. చరిత్ర అందరం చదువుతాం. గుర్తుంచుకుంటాం, కానీ చరిత్ర సృష్టించేది కొందరేనన్నది మరవ రాదు. సరే మూర్ఖసేనను పక్కన పెడదాం కాసేపు. ‘పద్మావత్’ చిత్రం విడుదలైంది. బాలారిష్టాలను అధిగమించి ప్రేక్షకులకు చేరువైంది. ప్రేక్షకులు చరిత్ర గురించి ఆలోచించకుండా చిత్రం చూసి గొప్పగా ఉంది అంటూ తన్మయత్వంతో పులకించి పోయారు. చిత్రానికి వసూళ్ల వర్షం కురిపించారు. అఖండ విజయం అందించారు. భారత దేశ సినీ చరిత్రలో గొప్ప చిత్రంగా గుర్తింపు ఇచ్చారు. విడుదలై నెల ముగియక ముందే 500 కోట్ల వసూళ్లను అధిగమించింది. ఈ వసూళ్లను మూర్ఖసేన ఆపగలదా? గొప్ప చిత్రాలను ప్రేక్షకులు ఆదరించబట్టే కదా ఇలాంటి గొప్ప చిత్రాలు నిర్మించగలుగుతున్నారు. పేరు మార్చాలి, సన్నివేశాలను తొలగించాలి, ఫలాన కులాన్ని (మతాన్ని) కించపరచారులాంటి ‘చీప్’ ఆలోచనలు ఇలాంటి చెత్తసేనలు, అవకాశవాదులు మానుకుంటే మంచిది. సినిమాను సినిమాగా చూడాలి. కాలక్షేపం పొందాలి. వినోదం పొందాలి. భన్సాలీ, దీపికల ‘పద్మావత్’ చిత్రానికి ప్రేక్షకుల మందరం ‘హ్యాట్సాఫ్’ చెప్పాలి.

-మురహరి ఆనందరావు