ఈ వారం తార

పెళ్లయినాగానీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల నటి ప్రియమణి ఓ ఇంటిది కాబోతోంది. తనకు మూడేళ్లనుంచి పరిచయమున్న, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారం చేస్తున్న ముస్త్ఫరాజ్‌తో పెళ్లికి సిద్ధమైంది
ప్రియమణి. ఈనెల 27న బెంగుళూరులో దగ్గరి బంధువుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిందంటూ
ప్రియమణి తన ట్విట్టర్‌లో పేర్కొంది. సదరు ఫొటోలను కూడా అప్‌లోడ్ చేసింది. గత మూడేళ్లుగా డేటింగ్‌లోవున్న వీరిద్దరూ పెళ్లిదాకా వస్తారన్న నమ్మకం మొదట్లో ఎవరికీ లేదు. అతను పరిచయమైనప్పటి నుండీ ఒకరి మనసులు ఒకరికి అర్థమవడంతో అలాగే ప్రేమలో మునిగిపోయామని, ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నామని చెప్పుకొచ్చింది ప్రియమణి. అభిమానులకు ఆనందకరమైన విషయం ఏమిటంటే, ప్రియమణి పెళ్ళయ్యాక కూడా నటిస్తుందట!