మెయిన్ ఫీచర్

రెడీ అంటోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ముకుంద’ మూవీతో టాలీవుడ్‌ని గోపికమ్మగా అలరించిన బ్యూటీ పూజా హెగ్డే. తర్వాత డైరెక్టుగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ పక్కన చాన్స్ కొట్టేసి -పది మెట్లు ఎక్కేసినట్టు ఫీలైంది. మొహెంజొదారో రిజల్ట్ రివర్స్ అవ్వడంతో -మళ్లీ నేల చూపులు చూస్తోందట. చూపించడానికి బోల్డంత్ గ్లామర్ ఉన్నా -అన్నీ హోలీ క్యారెక్టర్లే వస్తున్నాయని గోలపెడుతున్న గోపికమ్మ బెంగను -దువ్వాడ జగన్నాథం తీర్చేయబోతున్నాడట. డీజే -దువ్వాడ జగన్నాథంలో పూజ అల్ట్రా గ్లామర్ రోల్ చేస్తోందని అంటున్నారు. రీసెంట్ ఫొటో షూట్‌తో ఎంత ‘గ్లామర్’ ఉందో చూపించడానికి ప్రయత్నించిన గోపికమ్మ -సినిమాలో మాత్రం మరింత రెచ్చపోవడానికే నిర్ణయించుకుందన్నది డిజె టీం టాక్. దర్శకుడు హరీశ్ సైతం పూజ ‘టాలెంట్’ని వీలైనంత వరకూ ఎక్స్‌పోజ్ చేయడానికి డిసైడ్ అయ్యాడని అంటున్నారు. సో.. డైరెక్టర్, హీరోయిన్ ‘గ్లామర్’ మీద సింగిల్ డెసిషన్‌కి వస్తే -పూజ ఏ రేంజ్‌లో కనిపించనుందో ఊహించుకోవడం కష్టమేం కాదు.