తెలంగాణ

ముగిసిన నాగోబా జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఫిబ్రవరి 12: ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో సంప్రదాయబద్ధంగా సాగుతున్న ఆదివాసీల నాగోబా జాతర ఉత్సవాలు మండగాజిలి ఉత్సవాల్లో ముగిశాయి. శుక్రవారం మెస్రం వంశీయులు తమ ఆచార వ్యవహారాలతో నాగోబాకు పూర్ణాహుతి పూజలు చేసి జాతర ఉత్సవాలకు ముగింపు పలికారు. ఉదయం నుండే వివిధ ప్రాంతాల నుండి భక్తిపారవశ్యంతో తరలివచ్చిన గిరిజనం తమ ఇలవేల్పు అయిన నాగోబాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గిరిజన పరివారమంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా మెస్రం వంశీయుల సాంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో పండగ వాతావరణం వెల్లివిరిసింది. ముఖ్యంగా మెస్రం వంశీయులు జాతర చివరి రోజైన శుక్రవారం ఆలయ మండపంలో సంప్రదాయబద్ధంగా మండగాజిలి తంతు కార్యక్రమంతో బేతాల్ పూజలు నిర్వహించారు. వృత్తాకారంలో మెస్రం వంశీయులు, పటేళ్లు, పర్దాన్‌లు, కటోడ (పూజారి)లు లయబద్ధంగా నృత్యాలతో తమ ఆరాధ్య దైవమైన నాగోబాను స్మరిస్తూ ఆనందడోలికల్లో మునిగితేలారు. జాతర ఉత్సవాలు ఎలాంటి ఆటంకం లేకుండా సంస్కృతి సాంప్రదాయాలు మేళవించే రీతిలో ప్రశాంతంగా జరగడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. చివరి రోజు జిల్లా యంత్రాంగం కెస్లాపూర్ జాతరలో నిర్వహించిన ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.