ఆంధ్రప్రదేశ్‌

రెవెన్యూ లోటు తగ్గుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10:ఎపి బడ్జెట్‌లో రెవెన్యూ లోటు తగ్గుతూ వస్తుండటం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 సంవత్సరంలో 10 నెలల కాలానికి ఎపి రాష్ట్రానికి ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్‌లో రెవెన్యూ లోటు 16,200 కోట్ల రూపాయలుగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం 2,303 కోట్లు విడుదల చేసింది. ఇలా ఉండగా 2015-16 సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో రెవెన్యూ లోటు 7,299.78 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. అయితే గురువారం ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన గణాంకాల్లో 2015-16 సంవత్సరం సవరించిన బడ్జెట్ ప్రకారం రెవెన్యూ లోటు 4,140.11 కోట్ల రూపాయలుగా చూపించారు. 2016-17 సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో రెవెన్యూ లోటు 4,868.26 కోట్లుగా పేర్కొన్నారు. అంటే గత మూడు సంవత్సరాల్లో రెవెన్యూ లోటు గణనీయంగా తగ్గుతూ వస్తోందని స్పష్టమవుతోంది. అంటే రాష్ట్ర ఖజానాకు వస్తున్న రెవెన్యూ ఆదాయం గణనీయంగా పెరుగుతోందని విదితమవుతోంది.