ఆంధ్రప్రదేశ్‌

లాకప్‌డెత్ బాధ్యులందరిపై చర్యతీసుకోవాలి: ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, ఫిబ్రవరి 12: ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలో పోలీసు కస్టడీలో కాపు యువకుడు బొప్పన పరిపూర్ణచంద్రరావు మృతికి కారకులైన వారందరిపై కఠినచర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండుచేశారు. ఆటో డ్రైవర్ బొప్పన పరిపూర్ణచంద్రరావును పోలీసులే కొట్టిచంపారని కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలను పరిగణనలోనికి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కిర్లంపూడిలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ముద్రగడ మాట్లాడారు. ఆటో నడుపుకునే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, మూడు రోజులపాటు చిత్రహింసలకు గురిచేయడం దారుణమన్నారు. కాపు యువకులను వేధించడం, అక్రమంగా నిర్భంధించడం, కొట్టి చంపడం లాంటి చర్యలు చూస్తూంటే పథకం ప్రకారం ప్రభుత్వం కాపులను భయబ్రాంతులకు గురిచేస్తున్నట్టు భావించాల్సివస్తుందన్నారు. చంద్రరావుకు ఫిట్స్ రావడంతో పోలీస్ స్టేషన్ నుండి ఆసుపత్రికి తీసుకెళ్ళగా మృతి చెందాడని పోలీసులు చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. పూర్తి ఆరోగ్యవంతుడైన చంద్రరావుకు హఠాత్తుగా అనారోగ్యం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. వేటపాలెం పరిధిలో ఉన్న వ్యక్తిని విచారణ పేరుతో కారంచేడుకు ఎందుకు తరలించారని ప్రశ్నించారు. చంద్రరావును అదుపులోకి తీసుకున్నప్పటి నుండి మృతి చెందేవరకు డ్యూటీలో ఉన్న పోలీసులందరూ నిందితులేనని, వారందరిపై కేసులు నమోదు చేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్ధాయి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు.