ఆంధ్రప్రదేశ్‌

ఎపి తాత్కాలిక సచివాలయం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: వెలగపూడి వద్ద సోమవారం తెల్లవారు జామున 4.01 గంటలకు తాత్కాలిక సచివాలయం భవనాన్ని ఎపి సిఎం చంద్రబాబు ప్రారంభించారు. దీనికి ‘ఎపి గవర్నమెంట్ ట్రాన్సిషనల్ హెడ్‌క్వార్టర్స్’గా ఆయన నామకరణం చేశారు. ఇక్కడ సిఎం కార్యాలయం కోసం నాలుగో బ్లాకులో రెండు గదులను సిద్ధం చేశారు. జూన్‌లోగా మిగిలిన నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. తాత్కాలిక సచివాలయం ప్రారంభం సందర్భంగా వివిధ పూజలు, హోమాలు నిర్వహించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ బుద్ధప్రసాద్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్, టిడిపి నాయకులు పాల్గొన్నారు.