కళాంజలి

కథాగానంలో మేటి కావూరి శారద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరికథ మన తెలుగువారి విశిష్ట కళారూపం. భక్తి కథలను, ప్రధానంగా హరి లీలను సంగీత సాహిత్య నృత్యపరంగా చెప్పడాన్ని హరికథ అంటారు. నారదుడు మొదటి హరిదాసు అంటారు. హరికథ చెప్పేవారికి ఆట పాట మాట మీద పట్టు ఉండాలి. వీరిలో ప్రసిద్ధులు భాగవతారిణి కావూరు శారద. 30 సంవత్సరాలుగా కొన్ని వేల హరికథ ప్రదర్శనలిచ్చారు. భక్తి చేత, భక్తి నుండి, భక్తి వలన ప్రచారం పొందాయి భారతీయ కళలు. వీటి పథమూ, గమ్యమూ భగవంతుని పాదములే!
* * *
కావూరు శారదగారి తండ్రి కావూరు బ్రహ్మానందరావుగారు ప్రఖ్యాత రంగస్థల నటులు. 1962, అక్టోబర్ 30న పశ్చిమ గోదావరి జిల్లా మాముడూరు మండలంలో జన్మించారు శారద. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి హరికథలో ఆమె డిప్లొమా చేశారు. ఆకాశవాణిలో ‘ఏ’ గ్రేడ్ ఆర్టిస్టు. యాల్లబండి తాతారావు భాగవతార్ వద్ద ఈమె హరికథలను నేర్చుకున్నారు.
ముఖ్యమైన ప్రదర్శనలు
శ్రీశైలం, టిటిడి, భద్రాచలం, సింహాచలం, అన్నవరం, వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్, వైజాగ్, భిలాయ్ స్టీల్‌ప్లాంట్, ఖరగ్‌పూర్, పశ్చిమబెంగాల్, కటక్, భువనేశ్వర్, బరంపురం, పర్లాకిమిడి, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటకలలో ప్రదర్శనలిచ్చారు.
గౌరవాలు
కథాగాన మోహన వంశీ, ఖమ్మం. సువర్ణ హస్త ఘంటాకంకణం - తాడేపల్లిగూడెం. పాడాలని ఉంది -మా టీవీలో న్యాయనిర్ణేత.
హరికథలు
సీతాకల్యాణం, పార్వతీ పరిణయం, భక్తమీరాబాయి, భక్త్ధృవ చరిత్ర, పాండవ సందేశం, శ్రీకృష్ణ రాయబారం, సుందరకాండ, శ్రీనివాస కల్యాణం.
ప్రత్యేక శిక్షణ
హరికథా పునశ్చరణ విద్య - రాజశేఖరుని లక్ష్మీపతిరావు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి