ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం, గుంటూరు జిల్లాలలో వర్షానికి స్తంభించిన జనజీవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రకాశం, గుంటూరు జిల్లాలలో మంగళవారం జనజీవనం స్తంభించింది. దాచేపల్లి మండలం కరాలపాడులో రాత్రి నుంచి కురిసిన వర్షానికి గోడ కూలి మహిళ మృతిచెందింది. గురజాలలోని దండి వాగు ఉద్ధృతికి మాచర్ల-గుంటూరు రైల్వే ట్రాక్‌ అర కిలోమీటరు మేర కొట్టుకు పోయింది. గురజాల-మాచర్ల-రేపల్లె మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గురజాలలోని వెంకట్రావ్‌నగర్‌ కాలనీ జలమయమైంది. పలువురు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. కారంపూడి మండలంలోని ఎర్రవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం అతలాకుతలమైంది. కొత్త అన్నాసముద్రం- పాత అన్నాసముద్రం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పర్చురూరు మండలం చెరుకూరులోని త్రివిక్రమస్వామి దేవాలయంలోకి వరదనీరు చేరింది. యర్రగొండ పాలెం మండలంలోని అన్నా సముద్రం చెరువుకు గండి పడింది.