తెలంగాణ

సిఎం కెసిఆర్ పూటకో మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాసనసభలో ప్రతిపక్ష నేత జానారెడ్డి
కామారెడ్డి/కామారెడ్డి టౌన్/సదాశివనగర్, డిసెంబర్ 29: బంగారు తెలంగాణ సాధిస్తానంటూ ముఖ్య మంత్రి కెసిఆర్ కాలయాపన చేస్తూ ప్రభుత్వాన్ని నెట్టుకువస్తున్నారని శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి చౌరస్తా వద్ద మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల సాధనకై 22వ ప్యాకేజీ పునరుద్ధరణకై ప్రజ లు, రైతులు ఉద్యమించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. రీడిజైనింగ్ పేరుతో నిజామాబాద్ జిల్లా ప్రజలకు నష్టం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. బంగారు తెలంగాణ అంటూ తెలంగాణను భ్రష్టు పట్టకుండా చూ డాలని సిఎం కెసిఆర్‌ను ఎద్దేవా చేశా రు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఉద్యమాలు చేద్దామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కెసిఆర్‌తో రాలేదని స్పష్టం చేశారు. అన్ని పార్టీల నాయకులు, ప్రజల సెంటిమెంట్‌ను గుర్తించిన ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇవ్వడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణను ప్రజలు గుర్తించాలన్నారు. ప్రభుత్వ పరిపాలన ఇష్టారాజ్యంగా కొనసాగుతుందన్నారు. పార్టీలను అణచివేసే ధోరణిని కెసిఆర్ అవలంభిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అవమానాలకు గురైన సహనంతో ఉంటున్నామని పేర్కొన్నారు. ప్రాణహిత-చేవెళ్ల సాధనకై ఇప్పటికైనా కెసిఆర్ ప్రతిపక్ష నాయకుల అభిప్రాయాలను తెలుసుకుని అన్ని జిల్లాలకు న్యాయం చేయాలన్నారు. కాళేశ్వరం నుండి సిఎం కెసిఆర్ చెబుతున్న ప్రాణహిత వాటర్ చివరకు ఎల్లంపల్లి ద్వారానే అందుతుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు.