ఆంధ్రప్రదేశ్‌

ఏడుగురు జాలర్ల ఆచూకీ గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: నిజాంపట్నం ఓడరేవు నుంచి ఈనెల 16న సముద్రంపైకి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంతవరకూ తెలియరాలేదు. వారు వేటకు వెళ్లిన తర్వాత బంగాళాఖాతంలో తుపాను ఏర్పడింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచాయి. తుపాను సమయంలో వీరు సముద్రంలో కొట్టుకుపోయి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కోస్టుగార్డు బృందం ఈ జాలర్ల ఆచూకీ కోసం సముద్రంలో గాలిస్తోంది.