తెలంగాణ

ఐటీ పాలసీని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం సోమవారం కొత్త ఐటీ పాలసీని ప్రకటించింది. ఐటీ దిగ్గజ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం, టీ-హబ్‌, టాస్క్‌ ఎంవోయూ కుదుర్చుకుంది. ఐటీకి అనుబంధంగా మరో నాలుగు పాలసీలను విడుదల చేశారు. స్టార్టప్‌ చేయూత కోసం ఇన్నోవేషన్‌ పాలసీ, ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరించేలా రూరల్‌ టెక్నాలజీ పాలసీ, హార్డ్‌వేర్‌ అభివృద్ధికి ఎలక్ర్టానిక్స్‌ పాలసీ..గేమింగ్‌ అండ్‌ యానిమేషన్‌ పాలసీల ఆవిష్కరణ జరిగింది. నగరంలోని హైటెక్స్‌లో ఈ కార్యక్రమానికి గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఐటీ దిగ్గజాలు నారాయణమూర్తి, మోహన్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌, మంత్రులు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగానికి హైదరాబాద్ కేంద్రంగా నిలుస్తోందని, యువతను ప్రోత్సహించే విధంగా ఐటీ పాలసీ ఉందని తెలిపారు.