తెలంగాణ

నీటిపారుదల శాఖలో భారీ మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాఖకు రూ.2 వేల కోట్లు కేటాయింపు
ప్రతి నియోజకవర్గానికీ మినీ ట్యాంక్‌లు మంజూరు
రెండవ విడత మిషన్ కాకతీయ కింద 10,500 చెరువులు
జనవరి రెండవ వారం నుంచి ఈ పనులు
రాష్ట్ర నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ నాగేంద్రకుమార్ వెల్లడి
మెదక్, డిసెంబర్ 29: తెలంగాణ ప్రభుత్వంలో నీటి పారుదల శాఖలో అనేక మార్పులు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ నాగేంద్రకుమార్ తెలిపారు. మంగళవారం నాడు మెదక్ పట్టణంలోని గో సముద్రం, పిట్లం చెరువులను సందర్శించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. సమైక్యాంధ్రలో 23 జిల్లాలు ఉండగా నీటి పారుదల శాఖకు 2.30 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రూ.2 వేల కోట్లు 9 జిల్లాలకు ప్రభుత్వం నీటి పారుదల శాఖకు కేటాయించడం జరిగిందని సిఇ నాగేంద్రకుమార్ తెలిపారు. మెదక్ పట్టణంలో గో సముద్రం, పిట్లం చెరువు బ్యూటిఫికేషన్ వైండనింగ్ మినీ ట్యాంక్ నిర్మాణాల కోసం 9.8 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఈ నిధులను వ్యయపర్చడానికి గో సముద్రం, పిట్లం చెరువును తాను పరిశీలించడం జరిగిందని నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ నాగేంద్రకుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నట్లు తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో మినీ ట్యాంకర్ల నిర్మాణానికి ప్రభుత్వం 3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. వాటి అభివృద్ధి విషయంలో తమ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. రెండవ విడత మిషన్ కాకతీయ క్రింద 10 వేల 535 చెరువులను గుర్తించామని ఆయన తెలిపారు. ఈ చెరువుల అభివృద్ధి విషయంలో 2016 జనవరి రెండవ వారంలో పనులను ప్రారంభిస్తామని సిఇ నాగేంద్రకుమార్ తెలిపారు. మొదటి విడత చేపట్టిన మిషన్ కాకతీయ పథకం క్రింద చేపట్టిన 8271 చెరువులో 20 శాతం పనులు పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. మిగిలిన 1600 చెరువులను 2016 మార్చిలోగా పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ చెరువుల అభివృద్ధికిగాను 1420 కోట్లు మంజూరు కాగా 600 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆయన తెలిపారు. గ్యాప్ ఆయకట్టు 10 వేల ఎకరాలను కూడా పునరుద్ధరింపజేస్తామని నాగేంద్రకుమార్ వెల్లడించారు. తెలంగాణలో 9 జిల్లాలలో ఉన్న చెరువుల కింద రూ.18 లక్షల ఎకరాల ఆయకట్టు భూమి ఉన్నట్లు తెలిపారు.