రుచి

ఎండ నుంచి అండగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వేసవిలో ఎటువంటి పోషకాహారం తీసుకుందామా అని చాలామంది ఆలోచిస్తుంటారు. మండు వేసవిలో నిండు చల్లదనాన్ని పంచే తాజాపండ్లు ప్రతినిత్యం తీసుకోవడంవల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవు. పైగాఅందంగా ఉంటారు.
వేసవిలో అరటి, మామిడి, కమలా, నారింజ, పుచ్చకాయ, దోసకాయ, స్ట్రాబెర్రీ, సపోట, ద్రాక్ష, అనాస, దానిమ్మ పండ్లతోపాటు ఎర్రటి యాపిల్, నిమ్మపండ్లు దొరుకుతాయి. ప్రతిపండులోనూ పోషక విలువలు దండిగా మెండుగా వుంటాయి. పండ్లను తినేటప్పుడు పరిశుభ్రంగా కడుగుకోవాలి. వేసవి కాబట్టి జ్యూస్‌గా తయారుచేసుకుంటే నోటికి రుచిగా ఉంటాయి. తాజా పండ్ల రసాల్లో విటమిన్ ఏ, సి పుష్కలంగా లభిస్తాయి.
నిత్యం పండ్లు తీసుకునేవారిలో క్యాన్సర్‌బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. విటమిన్ సి, ఫోలేట్ నియాసిన్ వంటి విటమిన్లు నీటిలో కరుగుతాయి. ఆపిల్ తొక్కతో సహా తింటే ఎంతో మంచిదట. ఆ తొక్కలోనే అధిక శాతం క్వెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్ క్యాన్సర్ నిరోధక సాధనం ఉంది. అందుకే ఆపిల్ అనారోగ్యంగా వున్నవారికి అందిస్తారు. ఆపిల్ జూస్ కూడా మంచిదే. అనాసపండు పైనాపిల్ తాజాగా వున్నవాటిలో విటమిన్లు పోషకాలు సమృద్ధిగా లభించేవి ఉన్నాయి. జీర్ణశక్తి ప్రక్రియకు దోహదపడతాయి. మనిషికి ఉత్తేజాన్ని ఇస్తాయి. తాజాపండ్లు తీసుకునే వారి ఆరోగ్యం కూడా చక్కగా వుంటుంది. భోజనం అనంతరం అరటిపండు తినడంవల్ల జీర్ణం బాగా కలుగుతుంది.
ఎర్రటి టమాటో పండ్లలో లైకోపిన్ అనే క్యాన్సర్ నిరోధక యాంటీ ఆక్సిడెంట్లు వున్నాయి. అదేవిధంగా ద్రాక్ష పండ్లలో సైతం ప్రోటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. చర్మం నిగనిగలాడేలా చేసే గుణం తాజాపండ్లలో ఉంది. జ్వరం వచ్చిన వారికి నారింజ రసం ఇస్తారు. నారింజ, బత్తాయి రసాల్లో విటమిన్ ఏ,సి పుష్కలంగా లభిస్తాయి. పుచ్చకాయ వేసవి తాపాన్ని తీరుస్తుంది. బొప్పాయి పండ్లు నిత్యం తినడంవలన కంటి వ్యాధులు దరిచేరవు. మనిషికి మేలు చేసే తాజాపండ్లు మనకు ప్రకృతి ప్రసాదించిన గొప్పవరం. అందుకే అన్ని కాలాల్లోను పండ్లు తినడం ఉత్తమం.

- ఎల్.ప్రపుల్ల చంద్ర