తెలంగాణ

ఐదువేలు లంచం తీసుకుంటూ... ఎసిబికి చిక్కిన ఆరోగ్య శాఖ సీనియర్ అసిస్టెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 12: ఎసిబి అధికారుల వలలో ఆరోగ్య శాఖలోని ఓ అవినీతి చేప చిక్కింది. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న హైమత్ బేగం ఎన్‌ఎంగా పనిచేస్తున్న శ్రీరాముల విజయ నుంచి పెద్దపల్లి ఆస్పత్రిలో ఐదు వేల లంచం తీసుకుంటుండగా శుక్రవారం మధ్యాహ్నం ఎసిబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు. వరంగల్ ఎసిబి డిఎస్పీ, కరీంనగర్ ఇన్‌చార్జి సాయిబాబా కథనం ప్రకారం పెగడపల్లి ఎఎన్‌ఎంగా పని చేస్తున్న శ్రీరామలు విజయ 10 నెలల టిఎ బకాయలు, అదనపు హెచ్‌ఆర్‌ఎలతో పాటు జనవరి నెల వేతనం కోసం సీనియర్ అసిస్టెంట్ హైమత్ బేగంను ఆశ్రయంచింది. ఇందుకు హైమత్ బేగం 10 వేలు డిమాండ్ చేయగా, 5 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో విజయ ఎసిబి అధికారులను ఆశ్రయించడంతో హైమత్ బేగంను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకొని, నిందితురాలిని కరీంనగర్ ఎసిబి స్పెషల్ కోర్టుకు తరలించారు.