ఆంధ్రప్రదేశ్‌

పునర్విభజన చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు పునర్విభజన చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని జన చైతన్య వేదిక డిమాండ్ చేసింది. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన చైతన్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి లక్ష్మణ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్రాకు ప్రత్యేక హోదాతోపాటు రాజ్య సభలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలపక్ష బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని సమావేశం తీర్మానించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ పార్లమెంట్ ఆమోదించిన పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని రెండేళ్లు గడచినా మేథావులు కోరవలసిన దుస్థితి రావడం దురదృష్టకరమన్నారు. అభివృద్ధి అంతా రాజధానికే పరిమితం చేస్తే మరో ప్రాంతీయ ఉద్యమం వస్తుందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత తులసీ రెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టంలో 25 అంశాలకు 5లక్షల కోట్ల ప్రయోజనం అందించగా కేంద్రం ప్రభుత్వం గత రెండేళ్లలో 6400 కోట్లు మాత్రమే అందించిందన్నారు. రిటైర్డ్ ఐజి ఎ హనుమంతరెడ్డి మాట్లాడుతూ కడపలో స్టీలు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎలాంటి కృషి జరగడం లేదన్నారు. సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసులు ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొమ్మిది క్యాంపు ఆఫీసులకు 90కోట్లు ఖర్చు చేశారన్నారు. రిజర్వాయర్ లేని పట్టిసీమ దండగ అన్నారు. అబద్ధాలపై పాలన చేయరాదని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఏపి సివిల్ సొసైటీ రాష్ట్ర కన్వీనర్ డానీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుందరరామ శర్మ, ప్రగతి పథం కన్వీనర్ పిఎన్‌వి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవి పటేల్, హైకోర్టు న్యాయవాది జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ అభివృద్ధి వేదిక నాయకులు ఇస్మాయిల్ రెడ్డి, శివారెడ్డి, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యర్శి సలీం మాలిక్ తదితరులు ప్రసంగించారు.